Saithan
-
ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేసేందుకు చిన్న సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు, సుహాస్ చిత్రం ప్రసన్నవదనం, జితేందర్ రెడ్డి. తమన్నా,రాశి ఖన్నా నటించిన బాక్(అరణ్మనై-4) లాంటి చిత్రాలు వచ్చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే హిట్ చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అజయ్ దేవగణ్ సైతాన్, మలయాళ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ కాస్తా ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. మరీ మీరు ఈ వీకెండ్లో ఏ యే సినిమా చూడాలనుకుంటున్నారో ఓ లుక్కేయండి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్ సైతాన్ (హిందీ సినిమా) - మే 03 ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04 అమెజాన్ ప్రైమ్ క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03 ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళ డబ్బింగ్ సినిమా) - మే 05 మాన్స్టర్స్ ఎట్ వర్క్ సీజన్- 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05జియో సినిమా హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03 ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03 వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03జీ5ది బ్రోకెన్ న్యూస్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- మే 03లయన్స్ గేట్ ప్లేబ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్-3- మే 03 -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్‌గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
సేవ్ ది టైగర్స్ సీజన్-2.. అది చెప్పేందుకు ప్రయత్నిస్తా : మహి వి రాఘవ్
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్-1కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన సేవ్ ది టైగర్ సీజన్ -2 ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సేవ్ ది టైగర్స్ సీజన్- 1, సైతాన్ సూపర్ హిట్, సేవ్ ది టైగర్స్ సీజన్ -2 సక్సెస్‌తో హ్యాట్రిన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓటీటీలో హ్యాట్రిక్ విజయంపై మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. 'ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు. వెబ్ సిరీస్ గురించి చెబుతూ.. 'సేవ్ ది టైగర్స్ సీజన్- 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే.. సీజన్- 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్- 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా' అని అన్నారు. -
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 31 సినిమాలు.. లిస్ట్ ఇదే!
అందరూ 'ఆదిపురుష్' కోసం ఎదురుచూస్తున్నారు. అలా అని అందరికీ టికెట్స్ దొరక్కపోవచ్చు. అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు ఈ వీకెండ్ ఓటీటీల్లోకి ఏకంగా 30కి పైగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. వాటిలో తెలుగు హిట్ సినిమాలతోపాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. దిగువన ఆ లిస్ట్ ఇచ్చాం. లేట్ ఎందుకు ఓ లుక్ వేసేయండి. నెట్‌ఫ్లిక్స్: ► బ్లాక్ క్లోవర్: స్వార్డ్ ఆఫ్ ది విజర్డ్ కింగ్ - జపనీస్ మూవీ (జూన్ 16) ► ఎక్స్ట్రాక్షన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (జూన్ 16) ► కింగ్ ద ల్యాండ్ - కొరియన్ సిరీస్ (జూన్ 17) ► లెగో నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ► బ్లాక్ మిర్రర్: సీజన్ 6 - ఇంగ్లీష్ సిరీస్ (స్టీమింగ్) ► ద బ్యాడ్ ఫ్యామిలీ - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) ► ట్రాన్స్ఫార్మర్స్: ఎర్త్ స్పార్క్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) హాట్‌స్టార్: ► చెవలైర్ - ఇంగ్లీష్ మూవీ ► స్టాన్లీ - ఇంగ్లీష్ సినిమా ► ద ఫుల్ మోంటీ - ఇంగ్లీష్ సిరీస్ ► బిచ్చగాడు 2 - తెలుగు డబ్బింగ్ సినిమా (జూన్ 18) ► సైతాన్ - తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్) ► ప్రైడ్ ఫ్రమ్ అబౌవ్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్) అమెజాన్ ప్రైమ్: ► ఛార్లెస్ ఎంటర్ ప్రెజెస్ - మలయాళ సినిమా ► కాందహర్ - ఇంగ్లీష్ మూవీ ► రావణ కొట్టం - తమిళ సినిమా ► తారంతీర్ధకుడరం - మలయాళ మూవీ ► అన్నీ మంచి శకునములే - తెలుగు మూవీ (జూన్ 17) ► టూ సోల్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) ► జీ కర్దా - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్) ► బోర్రెగో - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) జియో సినిమా: ► ఐ లవ్ యూ - హిందీ సినిమా ► గీ డబుల్ - మరాఠీ మూవీ (జూన్ 17) ► సనమ్ మేరే హమ్రాజ్ - హిందీ సినిమా (జూన్ 18) ► క్వాంటమ్ లీప్ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది) ► రఫూచక్కర్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ► ద వీకెండ్: లైవ్ ఎట్ సోఫీ స్టేడియం - ఇంగ్లీష్ సినిమా (స్ట్రీమింగ్) జీ5: ► తమిళరసన్ - తమిళ సినిమా సోనీ లివ్: ► బ్రోకర్ - కొరియన్ సినిమా ► ఫర్హానా - తెలుగు డబ్బింగ్ మూవీ మనోరమ మ్యాక్స్: ► వామనన్ - మలయాళ సినిమా -
సైతాన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు పాజిటివ్ రెస్పాన్స్
దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ 'సైతాన్'. కొన్ని రోజుల క్రితం సైతాన్ ట్రైలర్ రిలీజ్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్‌పై చర్చ జరగడంతో సోషల్ మీడియాలో సైతాన్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సైతాన్ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్‌తో పాటు షో రీల్‌ను మీడియాకు ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్ వీక్షించిన మీడియా వారితో పాటు తదితరులు సిరీస్ కంటెంట్‌ను, టేకింగ్‌ను మెచ్చుకున్నారు. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌లో కథా పాత్రలను రూపొందించామన్నాడు మహి వి రాఘవ్. ఆర్టిస్టులు రిషి, సెల్లి, జాఫర్, దేవయాని అలాగే ఇతర నటీనటులు అందరూ బాగా చేశారని ప్రశంసించాడు. ఒక తెలుగు వెబ్ సిరీస్‌లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో భయకంరంగా చూపించడం ఇదే తొలిసారి అని, ఆ సీన్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయన్నాడు. ఈ వెబ్ సిరీస్ లో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయని కాబట్టి ఈ వెబ్ సిరీస్‌ను చూసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడు తెలిపాడు. చదవండి: మొన్ననే విడాకులు, అంతలోనే కలవాలని ఉందంటున్న నటుడు -
ఒకటిన సైతాన్
సంగీతదర్శకుడు విజయ్ఆంటోనీ కథానాయకుడిగా కొత్త ట్రెండ్‌లో పరుగెడుతున్నారని చెప్పవచ్చు. నెగెటివ్ టైటిల్స్‌తో పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంటున్నారు. ఆయన నటించిన పిచ్చైక్కారన్ చిత్ర టైటిల్‌ను విడుదలకు ముందు చాలా మంది విమర్శించారు. విజయ్‌ఆంటోనికి ఏమైంది ఇలాంటి టైటిల్స్ పట్టుకుంటున్నారు అని ఆయన ముఖం మీదే అన్నవారున్నారు. అలాంటిది ఆ చిత్రం ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇప్పుడు సైతాన్ అంటూ మరో నెగెటివ్ టైటిల్‌తో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. తదుపరి యమన్ అంటూ రానున్నారు. కాగా ఈయన హీరోగా నటించి సొంత నిర్మాణ సంస్థ విజయ్ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన సైతాన్ చిత్రానికి నవ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. అరుంధతి నాయర్ నాయకిగా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మధ్య మంచి స్పందనను పొందుతున్నాయి. కాగా చిత్రంలోని 10 నిమిషాల సన్నివేశాలు విడుదలై సైతాన్ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రం ఈ నెల 17నే తెరపైకి రావలసి ఉండగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. కాగా సైతాన్ చిత్రాన్ని డిసెంబ ర్ ఒకటవ తేదీన వి డుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ నెలలో సూ ర్య నటించిన ఎస్-3 చిత్రంలో పాటు మ రికొన్ని భారీ చిత్రాలు తెరపైకి రానున్నాయన్నది గమనార్హం. -
భేతాళుడుగా బిచ్చగాడు
టాలీవుడ్ మార్కెట్ మీద పట్టు కోసం తమిళ స్టార్ హీరోలు కూడా తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగు హీరోల స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోగా.. సూర్య, విక్రమ్ లాంటి స్టార్లు కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో హీరో చేరిపోయాడు. డాక్టర్ సలీం, నకిలీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమాతో రికార్డ్ సృష్టించాడు. తెలుగునాట చిన్న సినిమాగా విడుదలైన ఈ డబ్బింగ్ సినిమా భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ ఆంటోని. కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండే విజయ్ ఆంటోని ప్రస్తుతం సైతాన్ పేరుతో సినిమా చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు భేతాళుడు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే తెలుగులో విజయ్ ఆంటోనికి ఇక తిరుగుండదంటున్నారు విశ్లేషకులు.