ఒకటిన సైతాన్
ఒకటిన సైతాన్
Published Mon, Nov 21 2016 2:56 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
సంగీతదర్శకుడు విజయ్‌ఆంటోనీ కథానాయకుడిగా కొత్త ట్రెండ్‌లో పరుగెడుతున్నారని చెప్పవచ్చు. నెగెటివ్ టైటిల్స్‌తో పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంటున్నారు. ఆయన నటించిన పిచ్చైక్కారన్ చిత్ర టైటిల్‌ను విడుదలకు ముందు చాలా మంది విమర్శించారు. విజయ్‌ఆంటోనికి ఏమైంది ఇలాంటి టైటిల్స్ పట్టుకుంటున్నారు అని ఆయన ముఖం మీదే అన్నవారున్నారు. అలాంటిది ఆ చిత్రం ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇప్పుడు సైతాన్ అంటూ మరో నెగెటివ్ టైటిల్‌తో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. తదుపరి యమన్ అంటూ రానున్నారు.
కాగా ఈయన హీరోగా నటించి సొంత నిర్మాణ సంస్థ విజయ్‌ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన సైతాన్ చిత్రానికి నవ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. అరుంధతి నాయర్ నాయకిగా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల మధ్య మంచి స్పందనను పొందుతున్నాయి. కాగా చిత్రంలోని 10 నిమిషాల సన్నివేశాలు విడుదలై సైతాన్ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
ఈ చిత్రం ఈ నెల 17నే తెరపైకి రావలసి ఉండగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. కాగా సైతాన్ చిత్రాన్ని డిసెంబ ర్ ఒకటవ తేదీన వి డుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ నెలలో సూ ర్య నటించిన ఎస్-3 చిత్రంలో పాటు మ రికొన్ని భారీ చిత్రాలు తెరపైకి రానున్నాయన్నది గమనార్హం.
Advertisement
Advertisement