భేతాళుడుగా బిచ్చగాడు | Vijay Antony Saithan as Bethaludu in Telugu Version | Sakshi
Sakshi News home page

భేతాళుడుగా బిచ్చగాడు

Published Sat, Aug 6 2016 2:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

భేతాళుడుగా బిచ్చగాడు

భేతాళుడుగా బిచ్చగాడు

టాలీవుడ్ మార్కెట్ మీద పట్టు కోసం తమిళ స్టార్ హీరోలు కూడా తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగు హీరోల స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకోగా.. సూర్య, విక్రమ్ లాంటి స్టార్లు కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి మరో హీరో చేరిపోయాడు.

డాక్టర్ సలీం, నకిలీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమాతో రికార్డ్ సృష్టించాడు. తెలుగునాట చిన్న సినిమాగా విడుదలైన ఈ డబ్బింగ్ సినిమా భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తాజాగా మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ ఆంటోని.

కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండే విజయ్ ఆంటోని ప్రస్తుతం సైతాన్ పేరుతో సినిమా చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్కు భేతాళుడు అనే టైటిల్ను ఫైనల్ చేశారు. సెప్టెంబర్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే తెలుగులో విజయ్ ఆంటోనికి ఇక తిరుగుండదంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement