తెలుగు సినిమా చేస్తున్న 'బిచ్చగాడు' | bichagadu Fame Vijay Antony Direct Telugu Film | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమా చేస్తున్న 'బిచ్చగాడు'

Published Sat, Dec 17 2016 1:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

తెలుగు సినిమా చేస్తున్న 'బిచ్చగాడు'

తెలుగు సినిమా చేస్తున్న 'బిచ్చగాడు'

చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన బిచ్చగాడు, హీరో విజయ్ ఆంటోనికి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. గతంలో నకిలీ, సలీం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని, బిచ్చగాడు సినిమాతో స్టార్ గా మారిపోయాడు. దీంతో విజయ్ ఆంటోని తాజా చిత్రం భేతాలుడు తెలుగు రైట్స్ ను 30 కోట్ల పెట్టి సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం బాగానే సాధించింది.

తనను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను రాధిక శరత్ కుమార్ రాడన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోనిని సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది కూడా ఇది బ్యానర్. అందుకే తెలుగులో అదే బ్యానర్ లో పరిచయం అయితే సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు బిచ్చగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement