
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరోవైపు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.
రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది.
→ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment