ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా? | Bollywood Block Buster Movie Shaitaan OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Shaitaan Movie OTT Release Date: ఓటీటీలో రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా?

Published Mon, Apr 15 2024 8:11 AM | Last Updated on Mon, Apr 15 2024 10:51 AM

Bollywood Block Buster Movie OTT Streaming Date Goes VIral - Sakshi

అజయ్ దేవ్‍గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని టాక్ నడుస్తోంది.

కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్‌  అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‍పాండే, అజయ్ దేవ్‍గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement