దిబాకర్ బెనర్జీ.. బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు తీశాడు. ఖోస్ల కా ఘోస్లా, ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్, లవ్ సెక్స్ ఔర్ ఢోకా వంటి చిత్రాలతో తనకంటూ ఓ పేరు సంపాదించాడు. అయితే అతడు డైరెక్షన్ చేసిన ఓ సినిమా మాత్రం ఏళ్ల తరబడి రిలీజ్‌కు నోచుకోకుండా ఉండిపోయిందని బాధపడుతున్నాడు.
విడుదలకు నోచుకోని సినిమా
అదే 'టీస్'. ఇది రీలీజ్ చేస్తే ఎక్కడ విమర్శల్లో చిక్కుకుంటామోనని నెట్‌ఫ్లిక్స్ వెనకడుగు వేస్తూ వస్తోంది. తాజాగా ఈ మూవీ ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదైనా దీన్ని రిలీజ్ చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డిప్రెషన్..
సినిమా స్క్రీనింగ్ అనంతరం దిబాకర్ బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ టీన్‌ను పక్కన పడేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. కోపం, ఫ్రస్టేషన్, బాధ... డిప్రెషన్‌కు లోనయ్యాను. నాన్నా, ఎప్పుడూ కోపంగా ఉంటున్నావేంటని నా కూతుళ్లు అడిగినప్పుడు మరింత బాధపడ్డా.. అప్పుడే థెరపీ చేయించుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కోలుకుని కుదుటపడ్డాను.
లాయర్లకే రూ.20-30 లక్షలు ఖర్చు
నాకు నెట్‌ఫ్లిక్స్ మీద కోపం లేదు. ఎందుకంటే అప్పట్లో అమెజాన్ ప్రైమ్ కూడా తాండవ్ అనే సంచలనాత్మక సిరీస్‌ను రిలీజ్ చేసింది. అందుకుగానూ బెదిరింపులు, కేసులు జరిగాయి. ఇలాంటి కేసుల్లో పోరాడేందుకు లాయర్లకే రూ.20-30 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే సంచలనాత్మక కంటెంట్‌ను రిలీజ్ చేసేందుకు వాళ్లు భయపడుతున్నారు. అందులో తప్పు లేదు.
టీస్ మూవీ..
నెట్‌ఫ్లిక్స్ కాకుండా ఇంకెవరైనా కొంటారేమో అని ఎదురుచూశాను కానీ అది జరగలేదు అని చెప్పుకొచ్చాడు. కాగా 2020-21 మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ టీన్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. కానీ తర్వాత ఉన్నట్టుండి మనసు మార్చుకుని సినిమాను అటకెక్కించేసింది. ఈ మూవీలో మనీషా కొయిరాలా, దివ్య దత్త, నజీరుద్దీన్ షా, హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment