Dibakar Banerjee
-
'నా సినిమా నెట్‌ఫ్లిక్స్ పక్కనపడేసింది.. కోపం, బాధ.. ఎలాగైనా..!'
దిబాకర్ బెనర్జీ.. బాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాలు తీశాడు. ఖోస్ల కా ఘోస్లా, ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్, లవ్ సెక్స్ ఔర్ ఢోకా వంటి చిత్రాలతో తనకంటూ ఓ పేరు సంపాదించాడు. అయితే అతడు డైరెక్షన్ చేసిన ఓ సినిమా మాత్రం ఏళ్ల తరబడి రిలీజ్‌కు నోచుకోకుండా ఉండిపోయిందని బాధపడుతున్నాడు.విడుదలకు నోచుకోని సినిమాఅదే 'టీస్'. ఇది రీలీజ్ చేస్తే ఎక్కడ విమర్శల్లో చిక్కుకుంటామోనని నెట్‌ఫ్లిక్స్ వెనకడుగు వేస్తూ వస్తోంది. తాజాగా ఈ మూవీ ధర్మశాల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదైనా దీన్ని రిలీజ్ చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్రెషన్..సినిమా స్క్రీనింగ్ అనంతరం దిబాకర్ బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెట్‌ఫ్లిక్స్ టీన్ను పక్కన పడేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. కోపం, ఫ్రస్టేషన్, బాధ... డిప్రెషన్‌కు లోనయ్యాను. నాన్నా, ఎప్పుడూ కోపంగా ఉంటున్నావేంటని నా కూతుళ్లు అడిగినప్పుడు మరింత బాధపడ్డా.. అప్పుడే థెరపీ చేయించుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత కోలుకుని కుదుటపడ్డాను.లాయర్లకే రూ.20-30 లక్షలు ఖర్చునాకు నెట్‌ఫ్లిక్స్ మీద కోపం లేదు. ఎందుకంటే అప్పట్లో అమెజాన్ ప్రైమ్ కూడా తాండవ్ అనే సంచలనాత్మక సిరీస్‌ను రిలీజ్ చేసింది. అందుకుగానూ బెదిరింపులు, కేసులు జరిగాయి. ఇలాంటి కేసుల్లో పోరాడేందుకు లాయర్లకే రూ.20-30 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే సంచలనాత్మక కంటెంట్‌ను రిలీజ్ చేసేందుకు వాళ్లు భయపడుతున్నారు. అందులో తప్పు లేదు.టీస్ మూవీ..నెట్‌ఫ్లిక్స్ కాకుండా ఇంకెవరైనా కొంటారేమో అని ఎదురుచూశాను కానీ అది జరగలేదు అని చెప్పుకొచ్చాడు. కాగా 2020-21 మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ టీన్ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. కానీ తర్వాత ఉన్నట్టుండి మనసు మార్చుకుని సినిమాను అటకెక్కించేసింది. ఈ మూవీలో మనీషా కొయిరాలా, దివ్య దత్త, నజీరుద్దీన్ షా, హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించారు.చదవండి: బిగ్‌బాస్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే? -
సినిమా కోసం రెండేళ్లు తిరిగా.. భార్య జీతంతోనే బతికా!
సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు.. కానీ ఆ కోట్లు చూడటానికి ముందు అప్పులపాలై ఆస్తులమ్ముకున్నవాళ్లు కూడా ఉన్నారు. అలా అప్పులపాలై చేతిలో డబ్బుల్లేని స్థితిలో భార్యే అండగా నిలిచిందంటున్నాడు దర్శకుడు దిబాకర్ బెనర్జీ. తాజాగా అతడు దర్శకత్వం వహించిన 'లవ్ సెక్స్ ఔర్ ధోకా' సీక్వెల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్లలోని కష్టాలను పంచుకున్నాడు. ఎవరూ ముందుకు రాలే 'నేను తీసిన తొలి సినిమా ఖోస్లా కా ఘోస్లా. అప్పటికి నేనింకా ఢిల్లీలోనే ఉన్నాను. అయితే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలంటే ముంబైకి రావాలని అర్థమైంది. కొద్దిరోజులు ముంబైలో తిరిగాను.. పర్సు ఖాళీ అయింది. సినిమా కొనేందుకు ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రాలేదు. అప్పుడు నా భార్యను పిలిచి ఏదైనా ఉద్యోగం చూసుకోమన్నాను. మూడు వారాలకే తను ఓ ఉద్యోగం వెతుక్కుని సంపాదించడం మొదలుపెట్టింది. అలా ముంబైలో బతకడం మొదలుపెట్టాం. భార్యే అండగా నిలిచింది అలా రెండేళ్లపాటు తన జీతంతోనే బతికాం. ఆ సమయంలో నేను చిన్నపాటి యాడ్స్‌కు పని చేశాను. నా సినిమా చూశాక ఎవరూ కొనడానికి ఆసక్తి చూపించలేదు, కానీ నాతో మరో సినిమా తీస్తామని ముందుకు వచ్చారు. ఎన్నో తంటాలు పడ్డ తర్వాత ఆ చిత్రం రిలీజైంది' అని చెప్పుకొచ్చాడు. కాగా 'ఖోస్లా కా ఘోస్లా' సినిమాను 2006లో యూటీవీ మోషన్ పిక్చర్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, ప్రవీణ్ దబాస్, తారా శర్మ, రణ్వీర్ షోరే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
ఇప్పుడు సినీ దర్శకుల వంతు..
ప్రముఖ హేతువాది, రచయిత కల్బుర్బీ సహా ప్రజాస్వామిక వాదుల హత్యలు, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విపరీత పరిస్థితులను నిరసిస్తూ పలువురు రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వదులుకుంటున్న తరుణంలో.. తొమ్మిది మంది సినీ దర్శకులు తమకు లభించిన జాతీయ అవార్డులను తిరిగిస్తున్నట్లు ప్రకటించారు. 'బాంబే టాకీస్', 'ఖోస్లా కా ఘోస్లా', 'ఒయ్ లక్కీ లక్కీ..' తదితర హిట్ సినిమాల దర్శకుడు దివాకర్ బెనర్జీ సహా తొమ్మిది మంది దర్శకులు జాతీయ అవార్డులను వదులుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. గజేంద్ర చౌహాన్ ను చైర్మన్ గా తొలగించాలన్న పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థుల డిమాండ్ కు మద్దతు తెలపడంతోపాటు కల్బుర్గీ హత్యకు నిరసనగా తామీ పనికి పూనుకున్నట్లు వారు చెప్పారు. బెనర్జీ సహా అవార్డును వెనక్కిచ్చిన వారిలో లిపికా సింగ్, నిష్టా జౌన్, ఆనంద్ పట్వర్ధన్, కీర్తి నఖ్వా, హర్షా కులకర్ణి, హరి నాయర్ తదితరులున్నారు. -
బాలీవుడ్లోఅది కాస్తా పోతోంది
కోల్కత్తా: డబ్బుమీద వ్యామోహంతో బాలీవుడ్ సహజత్వానికి భిన్నంగా ముందుకు వెళుతోందని ప్రముఖ నిర్మాత జాతీయ అవార్డు విజేత దిబాకర్ బెనర్జీ అన్నారు. బాలీవుడ్ సినీ వర్గం స్వతహాగా ఉన్న పద్ధతికి తనకు తానుగా దూరంగా జరుగుతోందని, ప్రస్తుతం ఇక్కడ డబ్బు, హోదా ప్రభావాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. ఇలా సహజ శైలిని కోల్పోవడం బాధకరమన్నారు. నిజమైన సహజ శైలిని ప్రస్తుతం బెంగాలీ సినిమాల్లో మాత్రమే చూడగలుగుతున్నామని చెప్పారు. అక్కడ అద్భుతమైన నటులు ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రాంత విలువలకు ఏమాత్రం భంగకరం కాకుండా, అతి జాగ్రత్తతో ఉంటారని, వారి నటనా శైలిలో కూడా నిరాడంభరం కనిపిస్తోందని, సహజత్వాన్ని ప్రతిబింబచేయడంలో వారికివారే సాటి అని కొనియాడారు. బెంగాలీనటులను, బెంగాలీ సినీవర్గాన్ని ఏ ఇతర అంశంకూడా వారి సహజశైలికి భిన్నంగా ప్రభావితం చేయలేదని చెప్పారు.