సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కోట్లు వెనకేస్తారనుకుంటారు.. కానీ ఆ కోట్లు చూడటానికి ముందు అప్పులపాలై ఆస్తులమ్ముకున్నవాళ్లు కూడా ఉన్నారు. అలా అప్పులపాలై చేతిలో డబ్బుల్లేని స్థితిలో భార్యే అండగా నిలిచిందంటున్నాడు దర్శకుడు దిబాకర్ బెనర్జీ. తాజాగా అతడు దర్శకత్వం వహించిన 'లవ్ సెక్స్ ఔర్ ధోకా' సీక్వెల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్లలోని కష్టాలను పంచుకున్నాడు.
ఎవరూ ముందుకు రాలే
'నేను తీసిన తొలి సినిమా ఖోస్లా కా ఘోస్లా. అప్పటికి నేనింకా ఢిల్లీలోనే ఉన్నాను. అయితే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలంటే ముంబైకి రావాలని అర్థమైంది. కొద్దిరోజులు ముంబైలో తిరిగాను.. పర్సు ఖాళీ అయింది. సినిమా కొనేందుకు ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రాలేదు. అప్పుడు నా భార్యను పిలిచి ఏదైనా ఉద్యోగం చూసుకోమన్నాను. మూడు వారాలకే తను ఓ ఉద్యోగం వెతుక్కుని సంపాదించడం మొదలుపెట్టింది. అలా ముంబైలో బతకడం మొదలుపెట్టాం.
భార్యే అండగా నిలిచింది
అలా రెండేళ్లపాటు తన జీతంతోనే బతికాం. ఆ సమయంలో నేను చిన్నపాటి యాడ్స్‌కు పని చేశాను. నా సినిమా చూశాక ఎవరూ కొనడానికి ఆసక్తి చూపించలేదు, కానీ నాతో మరో సినిమా తీస్తామని ముందుకు వచ్చారు. ఎన్నో తంటాలు పడ్డ తర్వాత ఆ చిత్రం రిలీజైంది' అని చెప్పుకొచ్చాడు. కాగా 'ఖోస్లా కా ఘోస్లా' సినిమాను 2006లో యూటీవీ మోషన్ పిక్చర్స్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, ప్రవీణ్ దబాస్, తారా శర్మ, రణ్‌వీర్ షోరే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment