బాలీవుడ్లోఅది కాస్తా పోతోంది
కోల్కత్తా: డబ్బుమీద వ్యామోహంతో బాలీవుడ్ సహజత్వానికి భిన్నంగా ముందుకు వెళుతోందని ప్రముఖ నిర్మాత జాతీయ అవార్డు విజేత దిబాకర్ బెనర్జీ అన్నారు. బాలీవుడ్ సినీ వర్గం స్వతహాగా ఉన్న పద్ధతికి తనకు తానుగా దూరంగా జరుగుతోందని, ప్రస్తుతం ఇక్కడ డబ్బు, హోదా ప్రభావాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. ఇలా సహజ శైలిని కోల్పోవడం బాధకరమన్నారు.
నిజమైన సహజ శైలిని ప్రస్తుతం బెంగాలీ సినిమాల్లో మాత్రమే చూడగలుగుతున్నామని చెప్పారు. అక్కడ అద్భుతమైన నటులు ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రాంత విలువలకు ఏమాత్రం భంగకరం కాకుండా, అతి జాగ్రత్తతో ఉంటారని, వారి నటనా శైలిలో కూడా నిరాడంభరం కనిపిస్తోందని, సహజత్వాన్ని ప్రతిబింబచేయడంలో వారికివారే సాటి అని కొనియాడారు. బెంగాలీనటులను, బెంగాలీ సినీవర్గాన్ని ఏ ఇతర అంశంకూడా వారి సహజశైలికి భిన్నంగా ప్రభావితం చేయలేదని చెప్పారు.