మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్! | Mohan Lal start Direct A movie In Malayalam | Sakshi
Sakshi News home page

Mohan Lal: డైెరెక్టర్‌గా మారిన మోహన్‌ లాల్.. మూవీ టైటిల్‌ ఇదే!

Published Wed, May 8 2024 8:55 AM | Last Updated on Wed, May 8 2024 11:15 AM

Mohan Lal start Direct A movie In Malayalam

మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న మోహన్‌లాల్‌ ఇప్పటికే వందల చిత్రాల్లో నటించారు. తాజాగా మోహన్ లాల్ దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టడం విశేషం. స్టార్‌ నటుడిగా ఎదిగిన ఆయన తన అనుభవానంతా రంగరించి బరోస్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

బాలలను అలరించేలా ఫాంటసీ కథాంశంతో 3డీ ఫార్మెట్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్కోడిగామాకు చెందిన విలువైన వస్తువులను కాపాడే రక్షకుడు బరోస్‌ అనే వ్యక్తి ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతాన్ని అమెరికాలోని లాస్‌ ఏంజల్స్‌ నగరంలో నిర్వహించినట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

 చిత్రాన్ని ఓనం పండుగ సందర్భంగా సెపె్టంబరు 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మోహన్‌లాల్‌ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో బరోస్‌ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటుడు గురు సోమసుందరం, నటి మీరాజాస్మిన్, ఆంథోని పెరంబావుర్, రబేల్‌ అమర్కో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి సంతోష్‌ శివన్‌  సినిమాటోగ్రఫీ, లిడియన్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement