పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన రోజు. ఎంతలా అంటే వాళ్ళకి ఉన్నంతలో బాగా జరుపుకోవాలి అనుకుంటారు. అయితే భార్యలకు బయటవాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ కంటే మనసుకి నచ్చిన వాళ్ళు ఇచ్చే కామెంట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. తాను పుట్టినరోజుని తన భర్త గుర్తుపెట్టుకుని విష్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. ఎవరు ఎన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చిన భర్త ఇచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తుంటుంది.
భార్య ఎప్పుడు భర్త ఇచ్చే బహుమతిలో ఖరీదు చూడదు. అందులోని ప్రేమనే చూస్తుంది. అయితే భార్యలకి ఉన్న అదృష్టం ప్రతేకత ఉన్న రోజులని గుర్తు పెట్టుకోవడం. అందుకే భార్యలు భర్త పుట్టినరోజుని, పిల్లల పుట్టిన రోజుని, పెళ్లి రోజుని, అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళ పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టుకోగలదు. కానీ భర్త తన భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా.. పని హడావిడిలో మరిచిపోతుంటాడు.
ఇలా భార్య పుటిన రోజుని మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది అని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా ఐదేళ్లు. అవును ఇది నిజం. పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవా అనే అందమైన ద్వీపం ఉంది. ఇక్కడ ఎవరైన పెళ్ళైన వ్యక్తి తన భార్య పుట్టిన రోజుని పొరపాటున మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది. తన భర్త తన పుట్టిన రోజుని మర్చిపోయారని భార్య గనుక ఫిర్యాదు చేస్తే.. తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఇక్కడ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.
ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతాడు భర్త. అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది. మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో.
(చదవండి: పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!)
Comments
Please login to add a commentAdd a comment