సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం ఒకప్రకటన విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని వెల్లడించింది. (మయన్మార్‌లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ )
కాగా కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వంతో విభేదిస్తున్న సైన్యం నిన్న (సోమవారం) మరోసారి తిరుగుబాటు చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను అరెస్ట్ చేసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీ విధించింది. దేశం తమ పాలనలోకి వచ్చినట్టు ఆర్మీ ప్రకటించింది. ఈ ఉదంతాన్ని భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే. (మిలటరీ గుప్పెట్లో మయన్మార్ )
Comments
Please login to add a commentAdd a comment