ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా మోచా తుపానుగా మారింది. తొలుత ఈ తుపాను ప్రభావం ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని భావించారు అధికారులు. కానీ తుపానుగా మారిన తర్వాత తన దిశ మార్చుకుని ఈశాన్య రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను మే 14న బంగ్లాదేశ్, మయాన్మార్ సరిహద్దుల్లో తీరం దాటనుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ మోచా తుపాను గంటకు హరికేన్ 4కి సమానంగా సుమారు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు
ఈ తుపాను మయాన్మార్ రఖైన్ తీరంలోని సిట్వే మధ్య ఆదివారం ఉదయం తాకగానే బలహీనపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఒక లక్ష మందికిపైగా ప్రజలు ఉన్న పట్టణంలో దుకాణాలు, మార్కెట్‌లు మూసేశారు. ఇదిలా ఉండగా, మయన్మార్ జుంటా అధికారులు రఖైన్ తీరం వెంబడి ఉన్న గ్రామాలలో తరలింపు ప్రక్రియలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మయన్మార్ ఎయిర్‌వేస్ ఇంటర్నేషనల్ రాఖైన్ ఎయిర్‌పోర్టు తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమానాలను సోమవారం వరకు నిలిపివేసినట్లు తెలిపింది.
అలాగే పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో అధికారులు రోహింగ్యా శరణార్థులను ప్రమాదకర ప్రాంతాల నుంచి కమ్యూనిటీ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సిద్ర్ తుపాను తర్వాత మోచా తుపాను అత్యంత శక్తిమంతమైన తుపాన్ అని బంగ్లాదేశ్ వాతావరణ విభాగం అధిపతి రెహ్మన్ వెల్లడించారు. ఈపాటికే వేలాది మంది వాలంటీర్లు రోహింగ్యాలను ప్రమాదకర ప్రాంతాల నుంచి పాఠశాలలు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయా సరిహద్దులోని దీవుల్లో పనిచేసే వేలాదిమంది ఆయా ప్రాంతాలను విడిచి పారిపోయినట్లు కూడాఅధికారులు పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఓడరేవు చిట్టగాంగ్‌లో కార్యకలాపాలు నిలిపివేయడమే గాక పడవ రవాణా, చేపల వేటను కూడా నిషేధించారు అధికారులు.
(చదవండి: క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో)
Comments
Please login to add a commentAdd a comment