![Mocha Set To Intensify Into Very Severe Cyclone - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/12/mocha-cyc.jpg.webp?itok=9YoZQH4-)
న్యూఢిల్లీ: మోకా తుపాను మరింత శక్తివంతంగా మారుతోందని, శుక్రవారం ఉదయానికల్లా మరింత తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్–మయన్మార్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు గురువారం రాత్రి తెలియజేశారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు.
గురువారం సాయంత్రం 5.30 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమంగా 520 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ నుంచి దక్షిణ దిశగా 1,100 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ బంగాళాఖాతంపై మోకా తుపాను ఆవరించి ఉంది. ఆదివారం ఉదయం వరకూ ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment