severe cyclone
-
బంగ్లాదేశ్–మయన్మార్ తీరం దిశగా ‘మోకా’
న్యూఢిల్లీ: మోకా తుపాను మరింత శక్తివంతంగా మారుతోందని, శుక్రవారం ఉదయానికల్లా మరింత తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్–మయన్మార్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు గురువారం రాత్రి తెలియజేశారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమంగా 520 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ నుంచి దక్షిణ దిశగా 1,100 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ బంగాళాఖాతంపై మోకా తుపాను ఆవరించి ఉంది. ఆదివారం ఉదయం వరకూ ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. -
ఒమన్ వైపు ‘వాయు’ గమనం
అహ్మదాబాద్: గుజరాత్‌ను భయపెట్టిన ‘వాయు’ తుపాను తన దిశను మార్చుకుంది. అరేబియా సముద్రంలో అల్లకల్లోలం రేపుతున్న ఈ తుపాను ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. అయినప్పటికీ, గుజరాత్ తీరం వెంబడి వర్షాలు, గాలుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ‘వాయు’ తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే మూడు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ‘వాయు’ గమనం మార్చుకున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపినప్పటికీ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించినట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పాఠశాలలు శుక్రవారం కూడా మూసే ఉంటాయని ప్రకటించారు. ‘వాయు’ దిశ మారినప్పటికీ సౌరాష్ట్ర తీరం వెంబడి రాగల 24 గంటల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వాయు తుపాను ప్రభావం తొలగిపోయినట్లు భావించలేమని అధికార వర్గాలు చెప్పాయి. వాయు ప్రభావంతో రాష్ట్రంలో ఎటువంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపాయి. పోర్బందర్లోని 150 ఏళ్ల నాటి భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం తీవ్ర గాలులు, భారీవర్షం ధాటికి కుప్పకూలిందని వెల్లడించాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ 86 రైళ్లను రద్దు చేసి, 37 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించింది. -
తుపానుగా మారిన ‘వాయు’: ఎగిసిపడుతున్న అలలు
-
గుజరాత్‌కు ‘వాయు’ గండం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఉత్తరభారతంలో ఒక వైపు సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడుతుండగా మరోవైపు ‘వాయు’తుపాను గుజరాత్ వైపు ప్రచండ వేగంతో దూసుకువస్తోంది. గుజరాత్ తీరంలోని కచ్, సౌరాష్ట్ర ప్రాంతంపై ‘వాయు’ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని, భారీ వర్షాలు కురియడంతోపాటు గంటకు 170 కిలోమీటర్ల వేగంతో తీవ్రగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తీరం ప్రాంతాల్లోని పది జిల్లాల లోతట్టు ప్రాంతాలకు చెందిన 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నావికా దళం, వాయుసేన ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. ప్రభుత్వం, స్థానిక విభాగాలు అందించే సూచనలు, సలహాలను పాటించి సురక్షితంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను ట్విట్టర్లో కోరారు. వాతావరణ శాఖ హెచ్చరిక ‘వాయు’తుపాను అతితీవ్రంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్బందర్, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూల మధ్య గురువారం ఉదయం భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. తీరం దాటిన తర్వాత తుపాను సాధారణంగా బలహీన పడుతుంది. ఇందుకు విరుద్ధంగా, ‘వాయు’మరింత తీవ్రంగా మారనుందని తెలిపింది. వెరావల్‌కు దక్షిణంగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ‘వాయు’ గురువారం మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని తాకే అవకాశ ముందని తెలిపింది. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేచి తీరాన్ని తాకుతాయని తెలిపింది. అధికార యంత్రాంగం అప్రమత్తం తుపాను హెచ్చరికలతో గుజరాత్, డయ్యూ యంత్రాంగాలతోపాటు కేంద్రం అప్రమత్తమైంది. జాతీయ విపత్తు నిర్వహణ సహాయ దళం(ఎన్డీఆర్ఎఫ్), సైన్యం ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. యుద్ధ నౌకలు, నావికా దళ విమానాలను కూడా సిద్ధం చేశారు. తీరంలోని నౌకాశ్రయాలను ముందు జాగ్రత్తగా మూసివేయాలని ఆదేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పోర్బందర్, డయ్యూ, భావ్‌నగర్, కెశోద్, కాండ్లా ఎయిర్‌పోర్ట్‌లను 13వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని బస్ సర్వీసులను రద్దు చేసింది. విద్యా సంస్థలకు 12, 13 తేదీల్లో సెలవులిచ్చారు. ఇప్పటికే 70 రైళ్లు రద్దుచేశారు. వచ్చే రెండు రోజులపాటు కొన్ని రైళ్లను రద్దు చేయడమో లేక దారిమళ్లించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముంబైకి రాకపోకలు సాగించే 400 విమానాలకు అంతరాయం కలిగింది. జామ్‌నగర్‌కు విమానంలో బయల్దేరిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు -
హుదూద్.. శాంతించుమా?
విశాఖపట్నం: రాష్ట్రాన్ని వణికిస్తున్న హుదూద్ తుఫాన్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను భయపెడుతోంది. తుఫాన్ కారణంగా తాము టీమిండియా-వెస్టిండీస్ మ్యాచ్ చూస్తామో, లేదోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హుదూద్ తుపాన్ శాంతిస్తే బాగుండునని అనుకుంటున్నారు. ఈ నెల 14న విశాఖపట్నంలో వెస్టిండీస్-భారత్‌ల మధ్య మూడో వన్డే జరగనుంది. హుదూద్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మ్యాచ్ పై సందిగ్దం నెలకొంది. 14వ తేదీ ఒక్క రోజు వర్షం లేకపోయినా మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారులు చెబుతున్నారు. ఆ ఒక్క రోజు వర్షం రాకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. -
ఓ పక్షి పేరు మీద.. హుదూద్ తుఫాను!
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాలను వణికిస్తున్న హుదూద్ తుఫానుకు ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ప్రళయ భీకరంగా దూసుకొస్తున్న ఈ తుఫానుకు వాస్తవానికి ఒక అందమైన పక్షి పేరు పెట్టారు. ఈ పక్షి సాధారణంగా ఒమన్, ఇతర గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఈసారి తుఫానుకు పేరుపెట్టే అవకాశం ఒమన్‌కు లభించింది. బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రంలో వచ్చే తుఫాన్లకు ఆసియా దేశాలు పేర్లు పెడతాయి. ఒకేసారి రెండు సముద్రాలలోను తుఫాను ఏర్పడితే అప్పటికే ఇచ్చిన పేర్లలోంచి ఒకదాన్ని ఎంచుకుంటారు. అలా ఈసారి ఒమన్‌కు అవకాశం రావడంతో, ఆ దేశం ఇప్పటికే సూచించిన హుదూద్ పేరును ఖరారు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా తుఫాన్లకు పేర్లు పెడుతూనే ఉంటారు. దాన్ని త్వరగా గుర్తుపట్టి, హెచ్చరికలను అర్థం చేసుకోడానికి వీలుగా ఉంటుందనే వీటికి పేర్లు పెడతారు. దాదాపు ఒక శతాబ్దం క్రితం కరేబియన్ దీవుల్లో ఇలా తుఫాన్లకు పేర్లు పెట్టడం మొదలైంది. అయితే, ఆసియా దేశాల్లో మాత్రం 2000 సంవత్సరం వరకు తుఫాన్లకు పేర్లు పెట్టలేదు. అందుకే 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమను వణికించిన తుఫానుకు గానీ, అలాగే 1999 అక్టోబర్ 29న ఒడిశా తీరాన్ని అతలాకుతలం చేసిన తుఫానుకు గానీ పేర్లు లేవు. -
విశాఖకు పొంచి ఉన్న పెను తుఫాను
ఆంద్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పెను తుఫాను ముప్పు పొంచి ఉంది. 'హుదూద్' తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి గురువారం రాత్రిలోపు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయానికి అది పెను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీన విశాఖపట్నం- గోపాల్పూర్ మధ్య ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాంతో 11వ తేదీన గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తుఫాను తీరం దాటే సమయంలో అయితే గాలుల వేగం గంటలకు 130-150 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండోనెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఈనెల 11వ తేదీ నుంచే తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. దాంతో ఏపీ, ఒడిశాలకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపిది. విశాఖకు నాలుగు మిలటరీ దళాలను కూడా పంపింది. -
తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ లెహెర్
-
తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ లెహర్
విశాఖ : లెహర్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుపాన్ ప్రస్తుతానికి మచిలీపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ రోజు రాత్రికి మచిలీపట్నం వద్ద తీరం దాటనుంది. దక్షిణ దిశగా పయనిస్తున్న తుపాను మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీనిప్రభావంతో గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. మరోవైపు అన్ని పోర్టుల్లో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక లెహర్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. దాంతో నరసాపురం, యలమంచిలి, ఆచంట, కాళ్ల, భీమవరం, ఆకివీడు,పోడూరు, పాలకోడేరు, వీరవాసరం,మొగల్తూరు మండలాల్లోని ప్రజలకు అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. -
తీవ్రత తగ్గుతున్న ‘లెహర్’
అతి తీవ్రస్థాయి నుంచి తీవ్ర తుపానుగా మార్పు నేడు మచిలీపట్నం వద్ద తీరం దాటనున్న లెహర్ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి టెన్షన్ పుట్టించిన లెహర్ తుపాను తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కాకినాడ నుంచి మచిలీపట్నం వైపు దిశమార్చుకుని అతి తీవ్ర స్థాయి నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడుతోంది. తీరం దాటే సమయంలో మరింత బలహీనపడి తుపానుగానే మారొచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రానికి మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తుపాను పశ్చిమ వాయవ్య దిశగా మచిలీపట్నానికి 450 కి.మీ. దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 470 కి.మీ. దూరంలో కదులుతోంది. లెహర్ ప్రభావంతో కోస్తాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం మినహా కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 29వ తేదీ వరకు ప్రభావం ఉంటుందని, ప్రకాశం జిల్లాతోపాటు తెలంగాణలోనూ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో కొన్నిచోట్ల 80 కి.మీ. నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో వీటి తీవ్రత మరింత ఉంటుందన్నారు. మచిలీపట్నంలో ఏడో నంబర్, ఓడరేవు, కాకినాడలో ఆరో నంబర్, నిజాంపట్నంలో 5వ నంబర్, మిగతా అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఒక మీటరు ఎత్తు వరకు ఎగిసి పడొచ్చని, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మచిలీపట్నం తీరంలోనే ఎందుకు: తుపాన్లు మచిలీపట్నంలోనే ఎందుకు తీరం దాటుతున్నాయన్న అంశంపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చల్లగాలులు వీస్తున్న కొద్దీ తుపాను బలహీనపడుతుంది. తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్నది గాలి దిశపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వాయవ్యం నుంచి గాలులు వీస్తుండడంతో మచిలీపట్నం వైపు తుపాను దూసుకొస్తోంది. తుపాన్లు సముద్రంలో ఉన్నప్పుడు చాలా శక్తి కావాలి. కావాల్సిన ఉష్ణోగ్రతలుంటేనే అవి బలపడతాయని, నదీ ముఖ ద్వారాలవైపే పయణిస్తాయని వాతావరణశాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన: రాష్ర్టంలో బుధవారం అక్కడక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం సాయంత్రంలోపు తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తగినంత సాయం చేస్తాం: కేంద్రం న్యూఢిల్లీ: లెహర్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తగిన సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి బుధవారం భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై తుపానుపై సమీక్షించారు. -
తుఫానుగా మారిన తీవ్ర తుఫాను హెలెన్
తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసిన హెలెన్ పెను తుఫాను బలహీనపడి.. తుఫానుగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం పశ్చిమదిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటలలో కోస్తా సహా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కాగా, హెలెన్ తుఫానుపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావం వల్ల కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే తుఫాను కారణంగా కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఎమ్మార్వో విధి నిర్వహణకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. తుఫాను, పెను గాలుల వల్ల వరి చేలతో పాటు కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను మొదలుపెట్టామని, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 16,290 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి తెలిపారు. -
'హెలెన్' తుఫానుగా మారిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. దీనికి 'హెలెన్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బుధవారం సాయంత్రానికి ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావం వల్ల బుధవారం రాత్రి నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, గురువారం సాయంత్రానికి ఇది కావలి - ఒంగోలు మధ్య ఏదైనా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా పయనించి, తర్వాత నైరుతి దిశకు మళ్లుతుందని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిసరాల్లో కావలి సమీపంలో గురువారం రాత్రి తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడుతుందని, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి 75 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి తీరప్రాంతాల్లో కనిపిస్తుంది. తీరాన్ని దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలిపింది.