
హుదూద్.. శాంతించుమా?
విశాఖపట్నం: రాష్ట్రాన్ని వణికిస్తున్న హుదూద్ తుఫాన్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను భయపెడుతోంది. తుఫాన్ కారణంగా తాము టీమిండియా-వెస్టిండీస్ మ్యాచ్ చూస్తామో, లేదోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హుదూద్ తుపాన్ శాంతిస్తే బాగుండునని అనుకుంటున్నారు.
ఈ నెల 14న విశాఖపట్నంలో వెస్టిండీస్-భారత్‌ల మధ్య మూడో వన్డే జరగనుంది. హుదూద్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మ్యాచ్ పై సందిగ్దం నెలకొంది. 14వ తేదీ ఒక్క రోజు వర్షం లేకపోయినా మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారులు చెబుతున్నారు. ఆ ఒక్క రోజు వర్షం రాకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.