Hudhud
-
విశాఖ సేఫ్ కాదట!
►ఇది తుపాన్ల ప్రభావిత నగరమట.. ►అందుకే రాజధానిగా ఎంపిక చేయలేదట ►జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో సర్కారు వితండవాదం ►అమరావతి ఎంపికను సమర్థించు కునేందుకు విశాఖపై అభాండం ►తుపాన్ల ముప్పున్నప్పుడు అంతర్జాతీయ నగరంగా ఎలా చేస్తామన్నారు ►సదస్సులు, సంబరాలకు ఎందుకు దీన్నే వేదిక చేస్తున్నారు ►విశాఖ ఇమేజ్ దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారంటూ స్థానికుల ఆగ్రహం విశాఖ నగరం తుపాను ప్రభావిత ప్రాంతం.. హుద్‌హుద్‌లో దారుణంగా నష్టపోయింది.. అందుకనే రాజధాని ప్రాంతంగా దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.. –జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాదన ప్రకృతి ప్రసాదించిన వరం.. విశాఖ నగరం.. అందుకే దీని మీద ఫోకస్ చేస్తున్నాం.. అంతర్జాతీయ నగరంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తున్నాం.. – పలు వేదికలపై సీఎం చంద్రబాబు విశాఖకు ఇచ్చిన కితాబు రెండింటిలో ఎందుకింత వైరుధ్యం.. ఏమిటీ వితండవాదం.. తుపాన్ల నగరమని అభాండం ఎందుకు?! అంతర్జాతీయ సదస్సులు.. సంబరాల నిర్వహణకు.. లెక్కకు మిక్కిలి హబ్బుల ప్రకటనలకు అడ్డురాని తుఫాన్లు.. రాజధాని చేయడానికే అడ్డొస్తున్నాయా?? వాస్తవానికి విశాఖ నగరం ఎంతో సురక్షితమైనది.. తుపాన్లు ఇక్కడ తీరం దాటడం చాలా అరుదన్నది నిపుణుల మాట. తరచూ తుపాన్ల ముప్పు ఎదుర్కొనే చెన్నై నగరం తమిళనాడు రాజధానిగా దశాబ్దాలుగా కొనసాగుతోంది.. వీటన్నింటినీ విస్మరించి తుపాన్ల విశాఖను రాజధానిగా ఎంపిక చేయలేమని ట్రిబ్యునల్‌ను తప్పుదారి పట్టించడం.. విశాఖను చిన్నచూపు చూడటమే.. విశాఖపట్నం: ‘రాజధాని నిర్మాణం కా(లే)ని నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆర్థిక రాజధాని, సహజ సౌందర్య నగరి విశాఖపట్నం మీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్ ఉంది. అందుకే ప్రతిష్టాత్మక ఐఎఫ్ఆర్ విశాఖలోనే నిర్వహించాం.. సీఐఐలు వరుసగా రెండేళ్లు ఇక్కడే పెట్టాం.. ఐదు దేశాల ప్రతినిధులు పాల్గొన్న బ్రిక్స్ సదస్సుకు ఇదే నగరాన్ని వేదిక చేశాం.. విశాఖ నగరానికి మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం’.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడుల్లా చేసే వ్యాఖ్యలివి. సదస్సులు, సమావేశాల నిర్వహణే అభివృద్ధికి సూచికలు.. అన్న రీతిలో మాట్లాడే పాలకులు ఇప్పటి వరకు విశాఖ సమగ్రాభివృద్ధికి పక్కాగా ప్రణాళికలే రూపొందించలేదు. ఈ సంగతి అటుంచితే రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనల్లో తుపాన్ల విశాఖను రాజధానికి ఎలా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో వాదించడం వివాదాస్పదమవుతోంది. హుద్‌హుద్ లాంటి విలయాలను కూడా తట్టుకుని నిలిచిన విశాఖను తుపానుల నగరంగా తేలిగ్గా తీసిపారేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ట్రిబ్యునల్ వద్ద వ్యాఖ్యలు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిబ్యునల్‌లో ప్రభుత్వ వాదన ఇదీ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాజధాని ఎంపిక విషయంలో ఇతర ప్రాంతాలను పరిగణించారాః? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ.. రాజధానిగా విశాఖ నగరాన్ని కూడా పరిశీలించామని.. ఇది అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతమని, హుద్‌హుద్ వల్ల సుమారు రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాజధానిగా విశాఖను పరిశీలించిదెప్పుడు? ఇక రాజధానిగా విశాఖ నగరాన్ని పరిశీలించామని ప్రభుత్వ న్యాయవాది ట్రిబ్యునల్‌కు నివేదించారు. కానీ వాస్తవానికి ప్రభుత్వం ఎప్పుడూ విశాఖను క్యాపిటల్‌గా పరిశీలించిన దాఖలాలే లేవు. సమైక్యాంధ్ర విభజన సమయంలో ఏర్పాటైన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పర్యటన మినహా రాజధాని ఎంపిక పరిశీలన నిమిత్తం ఎప్పుడూ.. ఎవ్వరూ.. పర్యటించలేదు. తప్పుడు వాదనలపై అభ్యంతరాలు వాస్తవానికి హుద్‌హుద్ విలయం 2014 అక్టోబర్‌లో సంభవించింది. అప్పటికే రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసేసింది. కానీ విశాఖను రాజధానిగా ఎంపిక చేయకపోవడానికి హుద్‌హుద్ తుపానునే సాకుగా చూపించడం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి హుద్‌హుద్‌ను తట్టుకుని నిలబడిన నగరంగా విశాఖ చరిత్రకెక్కింది. ఇక అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతంగా విశాఖను పేర్కొనడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క హుద్‌హుద్ మినహా ఇప్పటివరకు తుపాన్లు విశాఖను తీవ్రంగా ప్రభావితం చేసిన దాఖలాలే లేవు. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే నగరంగా కూడా విశాఖ ఇంతవరకు రికార్డులకెక్కలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ట్రిబ్యునల్‌లో విశాఖ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించందంటూ విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలు, ఎండల ముప్పు తీవ్రంగా ఉన్న అమరావతిపై ఉన్న మోజు, రహస్య లావాదేవీల కారణంగానే దాని ఎంపికను సమర్థించుకునేందుకు విశాఖపై బురద జల్లుతున్నారని విమర్శిస్తున్నారు. విశాఖపై తుఫానుల ప్రభావం తక్కువ ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి అందమైన నగరం మరొకటి లేదనేని వాస్తవం. వాతావరణ పరంగా విశాఖ ఎంతో అనుకూలం. తుఫానులు అధికంగా నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడల్లో తీరాన్ని తాకుతుంటాయి. విశాఖ ప్రాంతంలో తీరం తాకడం చాలా అరుదు. హుద్‌హుద్ మినహా పెద్ద తుఫానులు విశాఖపై ప్రభావం చూసిన సందర్భాలు లేవు. గోదావరి జలాలను విశాఖకు తరలించడం సులభం. అదే విధంగా విశాఖ నగరాన్ని మూడు వైపుల విస్తరించుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. డైవెర్సిఫైడ్ ఆలోచనతో పనిచేస్తే శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు రాజధాని అనుబంధంగా నగరాలు, కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు అధికం. విశాఖ రాజధాని అయితే వ్యవసాయ భూములు నష్టపోకుండా రాజధాని నిర్మాణం జరిగేది. – ఆచార్య ఓ.ఎస్.ఆర్ భాను కుమార్, విశ్రాంత ఆచార్యులు, మెట్రాలజీ, ఓషనోగ్రఫీ విభాగం ఎంతో సురక్షితం పర్యావరణ పరంగా.. వాతావరణ పరంగా పరిశీలిస్తే విశాఖ నగరం ఎంతో సురక్షితమైనది. భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తుపాను ప్రభావం అన్ని ప్రాంతాలకూ ఉంటుంది. హుద్‌హుద్‌ను సాకుగా చూపుతూ విశాఖ రాజధానిగా సరిపడదు అని భావించడం తగదు. పోర్టు కూడా ఉంది కాబట్టి అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచేది. ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతంలో ఎండలు అధికంగా ఉంటాయి. దాంతో పోల్చితే వాతావరణ పరంగా విశాఖ ఎంతో అనుకూలం. తమిళనాడు రాజధాని చెన్నై, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లు తీర ప్రాంతంలో ఉన్నవే. మరి వాటికి లేని ముప్పు విశాఖకు ఎలా ఉంటుంది. –ఆచార్య ఎస్.ఎస్.వి.ఎస్ రామకృష్ణ, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ విభాగం, ఏయూ -
రిపేర్లలో ‘వసతి’
► విడుదల చేసిన నిధుల వినియోగానికి ఓపెన్ చేయని టెండర్లు ► బీసీ సంక్షేమ వసతి గృహాల మెరుగులకు కానరాని దిక్కు దివాణం విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్ సమయంలో పాడైన జిల్లాలోని వసతి గృహాలకు మరమ్మతులు చేయాలని కొన్నాళ్ల క్రితం మంజూరైన నిధులను ఇంకా ఉపయోగించకపోవడం విచారకరం. ఇందుకోసం జిల్లాకు కేటారుుంచిన రూ. 81.20 లక్షల నిధులను వినియోగించకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో సౌకర్యాల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏడు బాలికలు, ఒక బాలుర వసతి గృహాల కోసం రూ. 81.20లక్షలు మూడు నెలల క్రితం మంజూరయ్యారుు. వీటికి టెండర్లు పిలిచి వాటిని అట్టేపెట్టారు తప్ప నేటికీ తెరవలేదు. కొన్ని చోట్ల తెరిచినా ఆ పనులు జరగలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలోని దేవుపల్లి, చీపురుపల్లి, మెరకముడిదాం, కొత్తవలస, గోవిందపురం, విజయనగరం, ముక్కాం, చీపురుపల్లి ఇంటిగ్రేటెడ్ వసతి గృహాలకు రూ.లక్షా 50వేల నుంచి రూ. 16లక్షల వరకూ మరమ్మతులకు నిధులు మంజూరయ్యారుు. వీటిలో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, ఇతర మరమ్మతులను వెంటనే బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా నేటికీ వాటి గురించి పట్టించుకోలేదు. వసతి గృహాల్లో విద్యార్థులకు కేటారుుంచిన అల్మరాలు, కప్‌బోర్డులు ఎప్పుడో పాడైపోయారుు. దీంతో వాటిని వినిపయోగిస్తున్న విద్యార్థులు గోనెసంచులను వాటికి అడ్డంగా పెట్టుకున్నారు. అలాగే మైనర్ రిపేర్ల కోసం జిల్లాలోని పది వసతి గృహాలకు రూ.8.70లక్షల నిధులు మంజూరయ్యారుు. వీటిని కూడా అదేవిధంగా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇప్పటికీ ఆయా వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టలేదు. విజయనగరం లో కాట వీధిలోని బీసీ వసతి గృహంలో మోటారు లేక మరుగుదొడ్లకు ఆరుబయట నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక బోరు పాడైపోరుుంది. వాటర్ ట్యాంకు కూలిపోరుు రెండున్నరేళ్లు కావస్తోంది. అలాగే ద్వారబందాలు పాడయ్యారుు. తలుపులు ఊడిపోయారుు. ఇంకుడు గుంతకున్న పైపులైన్లను పాడు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. చిన్న మరమ్మతులకు నిధులు మంజూరైన వసతిగృహాల్లో నెల్లిమర్ల, పూసపాటిరేగ, బొబ్బిలి, బాడంగి, దత్తిరాజేరు, పార్వతీపురం, విజయనగరం, జొన్నవలస, గరుగుబిల్లి, గంట్యాడ తదితర వసతి గృహాలున్నారుు. కానీ నేటికీ ఈ మరమ్మతులను చేపట్టలేదు. త్వరలోనే ప్రారంభిస్తాం మరమ్మతులకు నిధులు మంజూరయ్యారుు. ఈ నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేరుుంచి మిగతా మరమ్మతులకు ఆ తరువాత ప్రాధాన్యమిస్తాం. ఆయా ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతున్నాం. మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభించి వసతి గృహాల్లో మరమ్మతులు పూర్తి చేరుుస్తాం - సీహెచ్ హరిప్రసాద్, డీబీసీడబ్ల్యూ ఓ -
మానని గాయాలు
హుద్‌హుద్ తుఫాన్‌తో దెబ్బతిన్న రహదారులు ప్రపంచ బ్యాంకు నిధులకోసం ఎదురుచూపు ఆన్లైన్ ప్రతిపాదించినా మంజూరు కాని వైనం ఇతర నిధులు కేటాయించని సర్కారు విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్... ఆ పెను విపత్తు ఇంకా జిల్లా ప్రజల మనోఫలకం నుంచి చెరిగిలేదు. ఆ భయం జాడలు వీడలేదు. ఇంకా శిథిలమైన రహదారులు ఆ గాయాన్ని చెరిగిపోని జ్ఞాపకాలుగానే ఉన్నాయి. వాటి మరమ్మతుకు ప్రపంచ బ్యాంకు నిధులొస్తాయని సర్కారు ఎదురుచూస్తోంది. ఆ నిధుల జాడ కానరావడంలేదు. మరే ఇతర నిధులు సమకూర్చేందుకు అధికారులూ యత్నించడంలేదు. ఉత్తరాంధ్రను కుదిపేసిన హుద్‌హుద్ ప్రళయ జాడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మూడు జిల్లాల్లో నష్టపోయిన వివిధ శాఖలకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు వస్తాయని, ఇందుకోసం ముందుగానే ప్రతిపాదనలు చేసుకోవాలని ఆదేశాలందాయి. మొత్తంగా రూ. 2,400 కోట్లు మంజూరు చేసి ఆయా నష్టాలు భర్తీ చేసుకోవాలన్నారు. ఇందులో ఈపీడీసీఎల్‌కు సుమారు రూ. 650 కోట్లు, పంచాయితీ రాజ్‌కు రూ. 350 కోట్లు కేటాయించారు. అయితే జిల్లాకు సంబంధించి పంచాయతీ రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల నడవటానికి వీలు లేకుండా తయారయ్యాయి. కోతకు గురై పెద్ద గండ్లు ఏర్పడ్డాయి. ప్రపంచ బ్యాంకు నిధులకోసం 25 రోడ్లు గుర్తించి, రూ.56 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. కానీ నేటికీ ఆ నిధులు విడుదల కాలేదు. నిధులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడంతో అంతా ఉసూరుమంటున్నారు. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల తదితర మండలాల్లో అయితే మరీ ఘోరంగా రహదారులు దెబ్బతిన్నాయి. వాటికి నిధులు మంజూరు చేస్తారని ఎదురు చూస్తున్నా.. అసలు వస్తాయో రాదోకూడా తెలీడంలేదు. ఏ నిధులకూ నోచుకోక... జిల్లాలోని పలు పంచాయతీ రహదారులు హుద్‌హుద్ ప్రభావంతో పాటు ఏటా కురిసే వర్షాలకు మరింత కోతకు గురవడం... రాళ్లు తేలిపోవడం జరుగుతోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం కదా ఏ క్షణాన్నైనా ఆ నిధులొస్తాయేమోనన్న ఆశతో ఉపాధి హామీ కానీ, మరే నిధుల గూర్చి కానీ పట్టించుకోవడం లేదు. దీంతో ఈ రహదారులకు అటు ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు కాక మరో బడ్జెట్లో ప్రతిపాదించక రెంటికీ చెడ్డ రేవడిలా మారాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అంతా సిద్ధం..నిధులొస్తే పనులు: కె.వేణుగోపాల్, పర్యవేక్షక ఇంజినీరు, పంచాయతీ రాజ్, విజయనగరం జిల్లాలో హుద్‌హుద్ తుఫాన్‌కు పాడైన రహదారుల్లో కొన్నింటికి మరమ్మతులు చేశాం. ఇంకా 25 రహదారులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు విడుదలయితే వెంటనే పనులు ప్రారంభిస్తాం. -
సీఎం హామీలన్నీ హుళక్కే!
సీఎం హోదాలో ఆరుసార్లు చంద్రబాబు పర్యటన మూడు పర్యటనల్లో పలు హామీలు ఒక్కటీ నెరవేరని వైనం నేటి పర్యటనపై ప్రజల అనాసక్తి శ్రీకాకుళం : ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇప్పటివరకూ ఆరుసార్లు జిల్లాలో పర్యటించారు. అయితే ఈ సందర్భంగా ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా 2014 సెప్టెంబర్ 18న, అక్టోబర్ 15, అదే నెల 23వ తేదీల్లో జిల్లాలో పర్యటించారు. అలాగే 2015 ఫిబ్రవరి 11, అదేనెల 14, 2016 ఫిబ్రవరి 12 తేదీల్లో కూడా పర్యటించారు. తొలిసారిగా వచ్చినప్పుడు పెద్దగా హామీలు ఇవ్వలేదు. 2015 ఫిబ్రవరి 11న ఎచ్చెర్ల శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు తనయుడి వివాహానికి హాజరయ్యారు. 2016 ఫిబ్రవరి 12న ఎన్జీవోల రాష్ట్ర సభలకు హాజరై ఎన్జీవో నాయకులు అడిగిన పలు సమస్యలను పరిష్కరిస్తానని మాత్రమే చంద్రబాబు చెప్పారు. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదు. హుద్‌హుద్ తుఫాను సందర్భంలో అక్టోబర్ 15న శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తురాయిచెట్టువీధి లోతట్టుగా ఉందని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి ఇక మీదట ఆ ప్రాంతంలో వరదముప్పు లేకుండా ఎత్తుచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణం పంపించాలని సూచించడంతో ఆ ప్రక్రియను వెనువెంటనే పూర్తిచేశారు. అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇదే సందర్భంలో పొందూరు మండలంలోని కింతలి, మొదలవలస గ్రామాల్లో పర్యటించిన సీఎం రెల్లిగెడ్డకు వరదలు రాకుండా, గ్రామానికి, పొలాలకు, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు దృష్టిసారించిన పాపాన పోలేదు. అటు తర్వాత అదే ఏడాది అక్టోబర్ 23న శ్రీకాకుళం రూరల్ మండలంలో పర్యటించారు. కుందువానిపేటలో పలువురు మత్యకారుల ఇళ్లు దెబ్బతిన్నాయని గుర్తించి ఆ గ్రామంలోని మత్స్యకారులందరికీ తుపానుకు తట్టుకొనేలా ఆధునిక పద్ధతుల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి అధికారులకు ఆదేశించారు. ఈ హామీ కూడా నెరవేరలేదు. 2015 ఫిబ్రవరి 14న జిల్లాలో పర్యటించినప్పుడు నరసన్నపేటలో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణానికి రింగురోడ్డును నిర్మిస్తామని, దీనికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడంతో అధికార పార్టీ నేతలు సైతం దీన్ని మరిచిపోయారు. ఇదే వేదిక నుంచి నరసన్నపేటలో రింగురోడ్డు, రాజుల చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, జగన్నాథపురంలో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా అవన్నీ ప్రతిపాదనల దిశలోనే ఉండిపోయాయి. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో రక్షిత మంచినీటి పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా నేటికీ అది ప్రకటనగానే నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితిలో బుధవారం ఏడోసారి చంద్రబాబు జిల్లాకు వస్తుండగా.. ప్రజలు ఆయన పర్యటనపై ఆసక్తి చూపుతున్నట్టు లేదు. ఆయన ఇచ్చే హామీలను వినడానికి ఏ ఒక్కరూ సుముఖత చూపడం లేదు. అమలుకు నోచుకోని హామీల వల్ల ఉపయోగం ఏమిటని పెదవి విరుస్తున్నారు. నేడు ‘ఉపాధి’కి సెలవు! శ్రీకాకుళం పాతబస్టాండ్: ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం, గార, ఆమదాలవలస నియోజకవర్గాల్లోని పలు గ్రామాల వేతనాదారులకు అధికార పార్టీ పెద్దలు బుధవారం సెలవు ప్రకటించారు. చంద్రబాబు శ్రీకాకుళం రూరల్ మండలంలో పర్యటిస్తున్నందున ఉపాధి పనులకు సెలవు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, వెళ్లేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు కొంతమంది నాయకులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ సమాచారం మంగళవారం నాటికే వేతనదారులకు చేరడంతో మండుటెండలో రోజంతా సీఎం కార్యక్రమంలో ఎలా పాల్గొనాలా అని ఆందోళన చెందుతున్నారు. జన సమీకరణ, రవాణా బాధ్యతలను ఉపాధి హమీ క్షేత్ర సహాయకులు, వెలుగు సిబ్బందికి అప్పజెప్పారు. భారీ బందోబస్తు శ్రీకాకుళం సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేథప్యంలో ఎస్పీ ఏఎస్ ఖాన్ ఆధ్వర్యంలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక అడిషినల్ ఎస్పీ, 13 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 75 ఎస్సైలు, 166 ఏఎస్ఐ/హెచ్‌సీలు, 584 కానిస్టేబుళ్లు, 97 మంది మహిళా కానిస్టేబుళ్లు, 255 మంది హాంగార్డులను బందోబస్తు కోసం నియమించారు. వీరితోపాటు ఒక ఆర్మడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, నలుగురు ఆర్ఎస్సైలు, 33 మంది ఎస్సైలు, 196 పోలీస్కానిస్టేబుళ్లు కూడా విధుల్లో ఉంటారు. -
స్మార్ట్ సిటీకి నిధులేవి..?
విశాఖపట్నం: హుద్‌హుద్‌ను జయించాం...విశాఖను పునర్నిర్మించాం..స్మార్ట్ సిటీగా ఎంపికైన విశాఖ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో మాత్రం విశాఖకు దక్కింది శూన్యహస్తమే. నిన్నటి కేంద్రబడ్జెట్లో స్మార్ట్ సిటీకి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు లభించక తీరని అన్యాయం జరగగా, నేటి రాష్ర్ట బడ్జెట్లో కూడా విశాఖకు నిరాశే ఎదురైంది. టాప్-20 స్మార్ట్‌సిటీల జాబితాలో జీవీఎంసీ టాప్-8లో నిలిచిన విశాఖ ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణన్ సర్వేలో ఐదో స్థానంలో నిలిచింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా 700 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జోన్-1 ప్రాంతమైన ఆర్కే బీచ్, రుషి కొండ తదితర ప్రాంతాలను రూ.1430 కోట్లతో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా రూ.వంద కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు సమకూర్చనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి రుణ సాయం సమకూర్చుకోవల్సి ఉంది. గడిచిన రెండేళ్లకుగాను కేంద్రం నుంచి రూ. 200 కోట్లు, రాష్ర్టం నుంచి రూ.200 కోట్లు సమకూర్చాల్సి ఉంది. కానీ కేంద్ర బడ్జెట్లో స్మార్ట్ సిటీలన్నింటికి రూ.250 కోట్ల వరకు కేటాయింపులు జరపగా దీంట్లో జీవీఎంసీకి దక్కే మొత్తం అరకొరగానే ఉంటుంది. కాగా మంగళవారం రాష్ర్ట అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో విశాఖ, కాకినాడలు స్మార్ట్ సిటీగా ఎంపికయ్యాయంటూ ప్రకటనకే పరిమితమయ్యారే తప్ప బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన జీవీఎంసీ బృందం ప్రస్తుతం డీపీఆర్ తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు నిధుల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. విస్కో ప్రాజెక్టుకు మాత్రం లక్ష రూపాయలు విదిలించారు. -
కొత్త ‘వాతావరణం’!
‘వాన రాకడ...ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు'. ఆ రెండింటి విషయం లోనూ శాస్త్ర విజ్ఞానం సాధించిన ప్రగతి తక్కువేమీ కాకపోయినా అవి ఇప్పటికీ పూర్తిగా మనిషికి పట్టుబడలేదన్నది నిజం. పోతుందనుకునే ప్రాణాన్ని నిలబెట్ట డానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అవసరమైన విధానాలను వైద్య రంగం అందుబాటు లోకి తీసుకురాగలిగిందిగానీ వాతావరణ పరిస్థితులపై సరైన అంచనా లివ్వడం శాస్త్రవేత్తలకు అన్నివేళలా సాధ్యం కావడంలేదు. అయితే ఇరవైయ్యేళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగు. నిరుడు అక్టోబర్‌లో హుదూద్ తుఫాను తీవ్రత గురించి అయినా... ఈమధ్యే చెన్నైలో కురిసిన భారీ వర్షాల విషయంలోనైనా వాతా వరణ శాఖ బాగానే చెప్పగలిగిందనాలి. అలాగే ఈ ఏడాది ఎల్ నినో పర్యవ సానంగా వర్షాభావంతో దేశమంతా కరువు పరిస్థితులు ఏర్పడవచ్చునని ఆ శాఖ చెప్పిన మాట కూడా నిజమైంది. అయినా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా రాగల 24 గంటల్లో, 48 గంటల్లో ఏమవుతుందో నిర్దిష్టంగా చెప్పగల గడం ఇంకా సాధ్యపడటంలేదు. ఈ నేపథ్యంలో వాతావరణ నివేదికల్లో వాడే పరిభాషను మార్చుకోవాలని... స్పష్టమైన అంచనాలివ్వాలని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) నిర్ణయించడం హర్షించదగిన విషయం. గతంలో ఏడాదికో, ఏణ్ణర్ధానికో వచ్చే తుఫానులు పర్యావరణం దెబ్బతింటు న్నందువల్ల ఈ మధ్యకాలంలో తరచు పలకరిస్తున్నాయి. వచ్చినప్పుడల్లా కుండ పోత వర్షాలతో జనజీవనాన్ని అస్తవ్యస్థంగా మారుస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతానికైనా వెళ్లే ముందు అక్కడి వాతావరణ పరిస్థితుల్ని తెలుసు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడుతుందోనన్న ఆదుర్దాయే అందుకు కారణం. వ్యక్తులకు సంబంధించి ఇలాంటి సమస్యలుంటే ప్రభుత్వాలది మరో సమస్య. నిర్దిష్ట ప్రాంతంలో వాయుగుండాలో, తుఫానులో, అకాల వర్షాలో సంభవిస్తాయని...వాటి తీవ్రత ఫలానా స్థాయిలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలిగినప్పుడు సర్వ వ్యవస్థలనూ సమాయత్తం చేయడానికి ప్రభుత్వాలకు వీలు ఏర్పడుతుంది. ప్రజలను అప్రమత్తం చేయడానికీ, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికీ సావకాశం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతానికిపైగా వర్షాధారం. జనా భాలో మూడింట రెండువంతుల మందికి జీవనాధారం వ్యవసాయం. అది సజా వుగా సాగాలంటే రుతుపవనాల్లో పడే వర్షాలే కీలకం. అందువల్ల వానలకు సంబం ధించిన అంచనాలు సరిగా ఉంటేనే ఏ ప్రాంతంలో ఏ పంటకు అనుకూల పరిస్థితు లుంటాయో, ఎలాంటి అననుకూలతలు ఏర్పడతాయో తెలుస్తుంది. అలా తెలుసు కోవడం రైతులకు చాలా అవసరం. ఇన్ని విధాలుగా ఇంతమందికి ఉపయోగపడే వాతావరణ అంచనాలు స్పష్టంగా ఉండాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు. అలాగని అదంత సులభం కూడా కాదు. ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైనది మన రుతుపవనాల తీరుతెన్నులను అంచనా వేయడమేనని శాస్త్రవేత్తలు అంటారు. పశ్చిమాఫ్రికా, ఆసియా-ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా రుతు పవనాల విషయంలో ఈ స్థాయి సంక్లిష్టత ఉండదని వారి వివరణ. మన రుతు పవనాలను ప్రభావితం చేసే స్వల్పకాల, దీర్ఘకాల అంశాలు అనేకానేకం ఉండట వల్లే సంక్లిష్టత తప్పడంలేదని చెబుతారు. చంద్రుడిపైకి మనిషిని పంపడం, గ్రహాల మధ్య దూరాన్నీ, వాటి కక్ష్యలనూ నిర్దిష్టంగా చెప్పడం సాధ్యమవుతున్నప్పుడు...అందుకు అవసరమైన శాస్త్ర, సాంకే తిక ప్రగతి అందుబాటులోకొచ్చినప్పుడు ఫలానా సమయానికి వర్షం పడుతుం దనో, పడదనో ఎందుకు అంచనా వేయలేకపోతున్నారన్న సందేహం సామాన్యు లకు కలగడం సహజం. అసలు గాలులు వీచడానికైనా, వర్షాలు పడటానికైనా, తుఫానులు చెలరేగడానికైనా భూ ఉపరితలం వేడెక్కడమే కారణం. దాన్ని సరిగా గుర్తించగలిగిన, కొలవగలిగిన సాధనాలను అమల్లోకి తీసుకురావడం ద్వారా... వాటి ఆధారంగా సరైన లెక్కలు వేయగలిగే విధానాలను పాటించడం ద్వారా వాతా వరణం ఎలా ఉంటుందో చెప్పడం సాధ్యమవుతుంది. వాతావరణంలోకి విడిచి పెట్టే బెలూన్లు గాలిలో ఉండే తేమనూ, ఉష్ణోగ్రతనూ చెప్పగలిగితే... అంతరి క్షంలో తిరుగాడే ఉపగ్రహాలు నేలపైన ఉండే పరిస్థితులకు సంబంధించిన డేటాను ఇవ్వగలుగుతున్నాయి. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగే సూపర్ కం ప్యూటర్లకు ఈ డేటానంతటినీ అందజేసి అవి ఇచ్చే ఫలితాల ఆధారంగా 20 శాతం అటూ ఇటూగా అంచనాలకు రాగలుగుతున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. అంచనాల వెనక ఎంత శాస్త్రీయత ఉన్నా అవి తప్పుల తడకని తేలితే వచ్చే విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. మన దేశంలో వాతావరణానికి సంబంధించి నంతవరకూ అనిశ్చితికీ, అయోమయానికీ తావిస్తున్న పదాలనూ, అంచనాలనూ మార్చాల్సిందేనని ఈమధ్యే నిర్ణయించారు. వర్షాలు పడే ‘అవకాశం ఉంది’... వడగాడ్పులు ‘వీయవచ్చు’లాంటి వాక్యాలు ఇకపై కనబడకూడదని వాతావరణ విభాగం సర్క్యులర్ జారీచేసింది. ఇక ‘అక్కడక్కడ’ వర్షాలు పడొచ్చుననిగానీ... ‘ఒకట్రెండుచోట్ల’ వర్షాలు పడతాయనిగానీ చెప్పడం చెల్లదు. ‘అక్కడక్కడ’ అంటే ఎక్కడో...ఆ ‘ఒకట్రెండు చోట్లూ’ ఏవో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే సాధారణ వర్షపాతం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, వర్షపాతం లోటు వంటివి ఇప్పుడు కొత్త అర్థాల్ని ఇవ్వబోతున్నాయి. వడగాడ్పులు, చలి గాలులకు సంబంధించిన ప్రమాణాల్లోనూ మార్పులు చేశారు. ఈ మార్పులవల్ల పౌరులకు వాతావరణానికి సంబంధించి అందే అంచనాల్లో మరింత ఖచ్చితత్వం ఏర్పడు తుంది. వాస్తవ పరిస్థితులకు అవి మరింత దగ్గరగా ఉంటాయి. సాంకేతిక విజ్ఞానం పరిధి విస్తరిస్తున్నకొద్దీ దేన్నయినా మార్చుకోవాల్సిందే. వాతావరణ శాఖ అయినా అందుకు మినహాయింపు కాదు. దాన్ని గుర్తించినందుకు ఐఎండీకి అభినందనలు చెప్పాలి. -
అవినీతి తుఫాన్
‘హుద్‌హుద్’ పేరుతో భారీ అక్రమాలు తప్పుడు అంచనాలతో సొమ్ములు తినేసే ప్రణాళికలు ‘వుడా కైలాసగిరి’ లోగో పునరుద్ధరణకే రూ.1.10 కోట్లు పార్కులు, ప్రభుత్వ భవనాలకు అత్యధికంగా ఖర్చు ఔరా.. అనిపించేలా అధికారుల నివేదికలు విశాఖపట్నం: హుద్‌హుద్.. విశాఖ వాసులకు కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యం.. కొన్ని గంటల్లోనే వి శాఖ రూపు రేఖలు మార్చేసిన భారీ తుఫాన్.. భవిష్యత్ తరాలు కథలు, కథలుగా చెప్పుకునేంత పెను విపత్తు.. అయితేనేం ప్రజల మరోధైర్యం ముందు తలవంచింది. వారం పది రోజులు తిండికి, తాగునీటికి అలమటించినా, వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా అతి త్వరలోనే నగరం మళ్లీ నిలబడింది. దాతలు ఇచ్చిన ఉదార విరాళాలు, స్థానికుల శ్రమదానం, నిబద్ధతలతో విశాఖ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కానీ ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. విశాఖ కోలుకోవడానికి తాము చేసిన భారీ ఖర్చు కారణమని చూపిస్తూ కనిపించని అవినీతి తుఫాన్ సృష్టించారు. నివేదికల్లో తప్పుడు లెక్కలు చూపించి వుడా అధికారులు సొమ్ములు దండుకుంటున్నారు. నగరం మునుపటి స్థితికి చేరడంతో తమ దర్జాగా దోచుకుతింటున్నారు. చకచకా సొమ్ములొచ్చే పనులు హుద్‌హుద్ 48మందిని పొట్టనపెట్టుకుంది. 122మందిని గాయాలపాలు చేసింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరంలోని కట్టడాలను కకావికలం చేసేశాయి. వాటిని పునరుద్ధరించడానికి అధికారులు అంచనాలు రూపొందించారు. దాని ప్రకారం అనేక పనులు పూర్తి చేయగా, మరికొన్ని జరుగుతున్నాయి. ఇంకొన్నిటికి టెండర్లు పిలిచారు. తుపాను వల్ల దెబ్బతిన్న 1,46,799 సామాన్యుల గృహాలను తిరిగి కట్టిచ్చేందుకు ఆసక్తి చూపని ప్రభుత్వం, అధికారులు తమకు ప్రయోజనం కలిగే పనులను మాత్రం చకచకా చేసుస్తున్నారు. అయితే పునరుద్ధరణ, పునఃనిర్మాణ పనులకు చేసిన, చేస్తున్న ఖర్చుల లెక్కలు అధికారుల అవినీతికి అద్దం పడుతున్నాయి. వారి లెక్కలు ఇవిగో కైలాసగిరి కొండపై వుడా కైలాసగిరి (వీయూడీఏ కేఏఐఎల్ఎస్ఏజీఐఆర్ఐ-కైలాసగిరి) అనే పేరును దాదాపు రూ.80 లక్షల వ్యయంతో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. తుపాను దెబ్బకు అవి కింద పడిపోయాయి. దీంతో వాటి స్థానంలో కొత్త అక్షరాలను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయాలనుకున్నారు. దానికి రూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ మళ్లీ ఏమనుకున్నారో ఏమో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టేశారు. పడిపోయిన అక్షరాలను నిలబెట్టి సరిపెట్టేశారు. కానీ విచిత్రం ఏమిటంటే రూ.1.10 కోట్లు ఖర్చు అయినట్లుగా రికార్డుల్లో రాసేశారు. ఉన్నవి నిలబెట్టి కొత్త వాటికి చేయాలనుకున్న ఖర్చును ఎలా చూపిస్తున్నారో అంతుచిక్కడం లేదు. దీనిపై వుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను సంప్రదించగా రికార్డుల్లో పొరపాటుగా నమోదైవుంటుందని చెప్పుకొచ్చారు. దీనిపై ఆరా తీయగా పడిపోయిన అక్షరాలు పునరుద్ధరించడానికి రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అదే ఎక్కువనుకుంటే రికార్డుల్లో కోటీ పది లక్షల రూపాయలు చూపించడం వెనక మతలబు ఏమిటో అర్ధం కావడం లేదు. అన్నిటిలోనూ ఇదే తీరు వుడా అధికారులు చేసిన ఖర్చుల లెక్కల ప్రకారం.. బీచ్ రోడ్డులోని కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం వద్ద చెత్త, ఇసుక తొలగించడానికి, ఎలక్ట్రికల్ పనులకు రూ.54.57 లక్షలు ఖర్చయింది. వుడా పార్కు ముఖద్వారం పక్కన 60 మీటర్ల కాంపౌండ్ వాల్, చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కు పునరుద్ధరణకు రూ.11.43 లక్షలు ఖర్చు చేశారు. రే హౌసింగ్ స్కీం భవనాలకు పగిలిన గాజు అద్దాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి రూ.19.42 లక్షలు వెచ్చించారు. కైలాసగిరి రోప్‌వే ప్రాంతం నుంచి తొట్ల కొండ వరకు పడిపోయిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు రూ.6 లక్షలు ధారపోశారు. దెబ్బతిన్న గురజాడ కళాకేంద్రం రూఫ్ స్థానంలో కొత్తది నిర్మించడానికి రూ.5.70 కోట్లతో టెండర్లు తుదిదశకు చేరాయి. సిరిపురం వద్ద యుబి కాంప్లెక్స్ ఎలివేషన్ ప్యానెళ్లు, కిటికీ అద్దాలకు రూ.35 లక్షలు ఖర్చు కానుంది. వుడా పరిధిలో విద్యుత్ మెరుగుపరచడానికి రూ.1.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ లెక్కలన్నిటికీ జిల్లా కలెక్టర్ ఆమోదం లభించింది. -
చిగురంత ఆశ..
‘యారాడ గిరుల శిఖను చేరి..కనులు విప్పారి చూస్తే నా విశాఖలో నాకు ఒక్కొక్కరోజు ఒక్కొక్క అందం కనిపిసుంది...’’ అంటూ శ్రీశ్రీ కొనియాడిన పచ్చని విశాఖలో... సరిగ్గా ఏడాది క్రితం... ప్రళయం ప్రత్యక్షమైతే..వాయు విలయం విరుచుకుపడితే..విధ్వంసం వికటాట్టహాసం చేస్తే..ప్రకృతి ‘అల’కల్లోలంతో ప్రకోపిస్తే..భయం ఓ రూపం దిద్దుకుంటే..వినాశనం కట్టెదుటే కరాళ నృత్యం చేస్తే..రాకా‘సీ’ గర్జిస్తే..పెను ఉప్పెన మీదకురికితే..జలఖడ్గం కోలుకోలేని దాడిచేస్తే . .క్షణం క్షణం చివురుటాకులా వణికితే.. చూస్తుండగా ఊరంతా అతలాకుతలమైతే..జనజీవనం అస్తవ్యస్తమైతే....వేలఏళ్ల వృక్షాలు వేళ్లతో సహా నేలకూలితే..చుట్టూ అంధకారం అలుముకుంటే..అడుగు వేయడానికి ఆటంకాలెదురైతే..బిక్కుబిక్కుమంటూప్రాణాలు అరచేతులు పెట్టుకుంటే.. ఎలాగుంటుందో ప్రత్యక్షానుభవమైంది విశాఖకు.. గతేడాది ఇదేరోజున.. ఇవన్నీ చవిచూసింది నగరం. హుద్‌హుద్ సృష్టించిన విధ్వంసానికి విశాఖ విధ్వంసమైంది. అందమైన నగరంగా భాసిల్లిన సిటీ శోకతప్తమైంది. కన్నీటి సంద్రమైంది. బంగాళాఖాతంలో పురుడుపోసుకున్న తుపాను పెనుశాపమై విశాఖను కష్టాల్లోకి ముంచింది. గాఢాంధకారం చుట్టూ అలముకుంది.. మొక్కలు..చెట్లు నేల కూలి పచ్చదనం కనుమరుగైంది.. హుద్‌హుద్ తర్వాత సాధారణ స్థితికి చేరుకోడానికి..కష్టాల నుంచి తేరుకోడానికి చాలా సమయం పట్టింది. నష్టాల లెక్కలేసుకుంటే చిట్టా చేంతాడయింది. పరామర్శలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడి 48గంటల్లోగా రావడం కొంత ఊరటనిచ్చింది. వెయ్యి కోట్లతో తాత్కాలికంగా ఆదుకుంటామంటూ ఆయనిచ్చిన భరోసా కొండంత ధైర్యాన్నిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులపాటు మకాం వేయడం సంతోషాన్నిచ్చింది. శోక విశాఖ కన్నీళ్లు తుడిచి నిధులతో అభివృద్ధికి కొత్త బాటలేస్తామన్న ఈ నేతల హామీలు మాత్రం సాఫల్యం కాలేదు. వీరి మాటలన్నీ తుపానుకు కొట్టుకుపోయాయి. నగర జీవనాడి మహానగర పాలకసంస్థకు రూ.1270 కోట్లు నష్టం జరిగితే ఏడు కోట్లు విదిల్చిన సర్కారు కపట ప్రేమ ప్రజలను బాధిస్తోంది. వివిధ శాఖలకు తగిలిన గాయాలు మాన్పేందుకు అవసరమైన నిధుల చికిత్సకు మందే కరువైంది. గూడు కోల్పోయిన వారి గోడు అరణ్యరోదనయింది. లక్షన్నర మందికి నిలువనీడ లేకుండాపోతే కేవలం రెండు వేల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పడం.. అవి కూడా నేటికీ పూర్తికాకపోవడం సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. చిన్నాపెద్దా కలిపి 1877 పరిశ్రమలు తుపాను నష్టాలు నెత్తికెత్తుకోగా ఏమేరకు ఆదుకున్నారో ఏలికలకే ఎరుక. జీవనాధారమైన బోట్లను కోల్పోయిన మత్స్యకారులింకా కష్టాల కడలిలోనే ఎదురీదుతున్నారు. నేటికీ ఆశించిన చేయూత అందనేలేదు. పెను తుపాను అలజడికి బాధితులంటా ఇప్పటికీ ఆపన్నహస్తం కోసం నిరీక్షణే. చేతికందొచ్చే తరుణంలో ఆరుగాలం శ్రమ ఆవిరైపోయిన అన్నదాతను ఆదుకోడానికి సాంకేతిక సాకులే వెక్కిరిస్తున్నాయి. హుద్‌హుద్ తాకిడి సర్వం అతలాకుతలమైన సంపదకు మూల్యం కడితే తొమ్మిదివేల కోట్ల రూపాయలని అధికార గణాంకాలే చెబుతుండగా పదోవంతు కూడా నిధులు రాకపోవడం బాధాకరం. ఏడాది తర్వాత వెనక్కి తిరిగి చూస్తే.... చిగురంత ఆశ కలిగించే అంశమొక్కటే..కన్నెర్ర చేసిన ప్రకృతే మళ్లీ కరుణించింది. పచ్చదనం కనుమరుగైన నగరవనంలో మొక్కలన్నీ చిగురించాయి. ‘ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు వికసిస్తుంది అన్న ఓ రచయిత పాట మాదిరిగా పచ్చదనం పర్చుకుంది. తరలి రాదా తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం.. అన్నట్లుగా హుద్‌హుద్ ధాటికి గల్లంతయిన పచ్చదనం మళ్లీ ప్రత్యక్షమై నగర వాసికి సంతోషాన్నిస్తోంది.. -సిటీడెస్కు -
ఏడాది హుద్‌హుద్‌కు ఏపైన పలకరింపు
ఆసియాలో శరవేగంగా పెరుగుతున్న నగరాలలో ఒకటైన విశాఖపట్నం 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తాకిడికి అల్లల్లాడింది. పదిహేను రోజుల్లో ఒక్కసారిగా శతాబ్దం వెనుకకు విసిరివేయబడింది. నీళ్లు, కరెంటు లేకుండా బతుకీడ్చింది. 1930లో నెల్లూరులో భయానక గాలివాన వచ్చినప్పుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి ‘నెల్లోరి గాలివాన’ దీర్ఘకవిత రాసేరు. అలా అక్షరీకరించిందే రామతీర్థ ‘హుద్‌హుద్ నగర కవిత్వం’. ‘పన్నెండు గంటలలో/ పన్నెండు దశాబ్దాలు వెనక్కి/ పిలకట్టుకు విసిరి పారేయడం/ అదీ యుద్ధ ప్రాతిపదిక/ పరిచయం చేసుకో/ నా పేరు జలశిఖ’ అంటూ హుద్‌హుద్ తనను తాను పరిచయం చేసుకుని, ‘ప్రకృతి యుద్ధ ప్రాతిపదిక ముందు/ మీదెప్పుడూ/ మందకొడి వృద్ధ ప్రాతిపదిక’ అంటూ నగరానికి సవాల్ విసురుతుంది. కళ్లెదుటే కూలిపోతున్న పెద్దచెట్లనూ, ఒక పైశాచిక తెరలా వచ్చి కొబ్బరిచెట్ల శిరస్సులను ఉత్తరించేసి పోతున్న గాలినీ చూస్తూ ఆవేదనతో, ‘చెట్టు పడిపోయిన ప్రతిచోటా/ఒక కవితను నిలబెడదాం/చెట్టు కూలిన వేళను/మళ్లీ ఒక మొక్క నాటి రద్దు చేద్దాం’ అంటూ చెట్లు మానవాళి మనుగడకు ఆకుపచ్చని ఊపిరితిత్తులని చెబుతాడు కవి. కేవలం ప్రకృతి బీభత్సాన్నే కాదు, ఆ సమయంలో బయటపడిన మానవస్వభావాన్ని, స్వీయానుభవాల్ని కూడా కవి అందించాడు. పదినెలల తర్వాత కవితలో మళ్లీ ప్రసవ శ్రమతో పత్రహరితాన్ని ప్రసవించి పచ్చి బాలింతలా కళకళలాడుతున్న విశాఖను ‘అంతరాయాలుంటాయి/అంతరించి పోవడం ఉండదు’ అని ప్రస్తుతిస్తాడు. - జగద్ధాత్రి 8712293994 -
అందని సాయం.. మానని గాయం
అకౌంట్.. ఆధార్ నెంబర్లు లేవని.. వేలాదిమందికి నేటికీ దక్కని తుపాను పరిహారం చిరునామాలు దొరకలేదంటూ తొలగింపు హుద్‌హుద్.. ఈ పేరు వింటే చాలు జిల్లావాసులు ఉలిక్కిపడతారు. కలలో కూడా నాటి చేదు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు. నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా పరిహారం అందని వారు వేలల్లో ఉన్నారు. చిరునామాలు దొరకడం లేదనే సాకుతో వేలాదిమంది పేర్లను జాబితాల నుంచి తొలగించేశారు. అకౌంట్లు, ఆధార్ నెంబర్లు సరిగా లేవనే సాకుతో మరికొంతమందికి మొండిచేయి చూపారు. విశాఖపట్నం : హుద్‌హుద్ తుపాను సాయం అందక ప్రతి వారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు అందుతున్న అర్జీలు వందల్లో ఉంటున్నాయి. నాటి దుర్ఘటనలో 49మంది చనిపోగా అందులో నలుగురికి రూ.2 లక్షలు వంతున కేంద్ర సాయం అందాల్సి ఉంది. పూర్తిగా, పాక్షికంగా మొత్తం 1.46,799 ఇళ్లు దెబ్బతిన్నట్టుగా లెక్కతేల్చారు. కానీ కేవలం 1,30,993 ఇళ్లకు మాత్రమే పరిహారం ఇచ్చారు. చిరునామాలు దొరకడం లేదనే సాకుతో 12,010 ఇళ్లను తొలగించగా, ఆధార్ అకౌంట్లు సరిగా లేవనే సాకుతో మరో 3,156 మందిని జాబితాల నుంచి తొలగించారు. ఇంకా 640 మందికి మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందని అధికారులు లెక్కతేల్చారు. బట్టలు, సామాన్లు కోల్పోయిన బాధితుల్లో ఇంకా 631మందికి పరిహారం అందాల్సివుంది. అతలాకుతలమైన వ్యవసాయం జిల్లాలో 32,167.756 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిగా, 1,52,806 మందికి పరిహారం చెల్లించాల్సి ఉంది. 581 మంది రైతుల పేర్లను చిరునామాలు దొరకలేదనే సాకుతో తొలగించారు. మరో 593 మంది రైతులకు ఇంకా 30.03 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది.ఉద్యాన పంటలు కోల్పోయిన 9656 మందికి రూ.18 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది.పశువులు, కోళ్లు చనిపోయిన 223 మందికి పరిహారం అందలేదు.886 మైక్రో ఇండస్ట్రీస్, 514 స్మాల్ ఇండస్ట్రీస్‌కు రూ.4.78 కోట్ల నష్టం వాటిల్లగా ఇప్పటి వరకు ఏ ఒక్క సంస్థకు ఒక్క రూపాయి పరిహారం అందజేయలేదు. ఏజెన్సీలోనూ అదే పరిస్థితి ఏజెన్సీలో వ్యవసాయ పంటలకు ప్రభుత్వ సాయం నామమాత్రంగానే అందింది. పలుచోట్ల కొండచరియలు, కొండవాగులు కొట్టుకు వచ్చి పొలాల్లో మేటలు వేయడంతో వరి పంటకు ఎక్కువ నష్టం కలిగింది. రాజ్మా, చోడి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ భూములు కూడా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 38,174 మంది రైతులకు వివిధ వ్యవసాయ పంటల నష్టంపై రూ.769.91 లక్షలు సాయం అందించింది. వరి పంటకు పరిహారం చెల్లించలేదు ఎకరం భూమిలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఇంత వరకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. పంట దిగుబడి లేకపోవడంతో ఈ ఏడాది తిండిగింజలు కరువయ్యాయి. -పూజారి సూర్యనారాయణ, గిరి రైతు, గురుపల్లి గ్రామం ఈ ఏడాది పంట వదిలేశాం ఇసుక మేటలు వేయడంతో వరి పొలం పూర్తిగా పాడైంది. ఎకరానికి రూ.700 నష్టపరిహారం ఇస్తామన్నారు. నేటికీ సాయం అందలేదు. భూమి బాగు చేసుకోవడానికి కూడా సాయం అందక ఈ ఏడాది పంట వేయలేకపోయాం. -వారం ఈశ్వరమ్మ, గురుపల్లి గ్రామం -
బీమా లేదు..ధీమా లేదు
ఎకరాకూ దక్కని వైనం ముగిసిన పంట బీమా గడువు అధికారుల వైఫల్యం ఆందోళనలో అన్నదాతలు విశాఖపట్నం: అన్నదాతలకు ధీమా లేకుండా పోతుంది. ఏటా విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలు..కరువు కాటకాల బారినపడే పంటలకు బీమా లేకుండా పోతుంది. ప్రభుత్వ ఉదాశీనత, శాఖల మధ్య సమన్వయ లోపం..ముఖం చాటేస్తున్న బ్యాంకర్ల పుణ్యమాని ఏ ఒక్క రైతు బీమా పొందలేని పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు బీమా పథకం నేడు అక్కరకు రాకుండా పోతోంది. గతేడాది హుద్‌హుద్ వల్ల సర్వం తుడుచుకుపెట్టుకుపోయినా ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చిందే కానీ బీమా రాలేదు. ఈ పథకం పట్ల రైతుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత ఖరీఫ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క ఎకరానికీ బీమా వర్తించలేదు. ఏరైతూ బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,12,285 ఎకరాలు. ఇందులో 2,57,670 ఎకరాల్లో వరి, 94,570 ఎకరాల్లో చెరుకు, 56,535 ఎకరాల్లో రాగి పంటలు సాగు చేస్తుండగా, ఇతర పంటలన్నీ మరో 1,3,510 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చెరకుతో పాటు వరిపంటలకు మాత్రమే పంట బీమా వర్తిస్తుంది. ఈ రెండింటి విస్తీర్ణమే మూడొంతులుంటుంది. 80 శాతం మంది ఈ పంటలే పండిస్తుంటారు. అయినా సర్కార్ పంట బీమా పథకం అమలు పట్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. నాలుగేళ్లుగా కవరైన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. 2014-15లో అతి కష్టమ్మీద 3 వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే బీమా కల్పించారు. ఈ ఏడాది ఒక్క ఎకరాకు కూడా బీమా కల్పించ లేదు. ఒక్క రైతు కూడా ఒక్కరూపాయి ప్రీమియం చెల్లించలేదు. వరికైతే ఎకరాకు పెద్దరైతు రూ.522లు, సన్నకారు రైతు 470లు, చెరకుకైతే రూ.2806, రూ.2229, మొక్క జొన్న కైతే రూ.277లు, రూ.249 చొప్పున ప్రీమియం చెల్లించాలి. జూలై-31తో గడువు ముగిసినా ఎవరూ ప్రీమియం చెల్లించిన వైనం లేదు. హుద్‌హుద్ విరుచుకుపడిన గతేడాదితో సహా గడిచిన నాలుగేళ్లలో బీమా చేయించుకున్న ఏ ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు కూడా బీమా సొమ్ము విడుదల కాలేదు. 2012-2014 మధ్య పంటల బీమా చేయించుకున్న రైతులకు సుమారు రూ.8కోట్ల మేర బీమా మొత్తం రావాల్సి ఉంది. ఒక్క పైసా విడుదల కాకపోవడం కూడా రైతుల్లో ఈపథకం పట్ల నిరాశ కలిగించింది. రైతులను చైతన్య పర్చడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎకరాకు ఎంత కట్టాలి..ఎప్పటిలోగా చెల్లించాలి అనేది ఏ వ్యవసాయాధికారి మా వద్దకు వచ్చి చెప్పిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. కరువుఛాయలు తరుముకొస్తున్నాయి. మరొక పక్క రోజుకో వాయుగుండం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటువంటి తరుణంలో ఏ దశలో పంట ను కోల్పోవల్సి వస్తుందో తెలియని పరిస్థితి. -
కోటి ఆశల ఖరీఫ్
ఖరీఫ్ సీజన్ మొదలైంది. కోటి ఆశలతో రైతన్న సన్నద్ధమవుతున్నాడు. అయినా సవాలక్ష సమస్యలు... తొలకరి పలకరించినా... రాబోయే కాలంలో తలెత్తే వర్షాభావాన్ని తట్టుకోవాలి. విత్తనాలను సకాలంలో సిద్ధం చేసుకోవాలి. అవసరమైన ఎరువును సమకూర్చుకోవాలి. గత రుణాలు మాఫీకాకున్నా... కొత్తగా అప్పులు చేయాలి. ఇవన్నీ కర్షకుని ముందున్న సవాళ్లు. వీటన్నింటినీ తట్టుకుని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. శ్రీకాకుళం రూరల్: ఖరీఫ్ సీజన్ వస్తుందంటే చాలు రైతన్న కోటి ఆశలతో సన్నద్ధమవుతాడు. జిల్లాలో ఎక్కువమంది రైతులు సాగు చేసేది వరే. గత ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగా సాగినా పలుమార్లు కురిసిన అకాల భారీ వర్షాలు, తుఫాన్లు అన్నదాతను నిండా ముంచాయి. అక్టోబర్‌లో హుద్‌హుద్ అన్నదాత వెన్నువిరిచింది. గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటంతా నీటి పాలైంది. రైతులవద్ద ఒక్క విత్తనం గింజా మిగలలేదు. దీని ప్రభావం ఈ ఏడాది కనిపించే అవకాశం లేకపోలేదు. విత్తన కొరత ఏర్పడకపోదు. జిల్లాలో 2.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉండగా 2.05 లక్షల హెక్టార్లలో వరి, 10 వేల హెక్టార్లల్లో వేరుశనగ, మిగిలిన విస్తీర్ణంలో గోగు, పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది 2,05,300 హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట సాగయింది. వరి సాధారణ విస్తీర్ణమైన 2.05 లక్షల హెక్టార్లకు సుమారు 1.50 లక్షల క్వింటాళ్ళ వరి విత్తనాలు అవసరమవుతాయి. సాధారణంగా 30 శాతం అంటే సుమారు 60 వేల క్వింటాళ్ళ విత్తనాలను ప్రభుత్వం అందిస్తుంది. గత ఏడాదే విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. గత ఏడాది సాగైన విస్తీర్ణం ప్రకారం మరో 15వేల క్వింటాళ్ళు విత్తనాలు అదనంగా అవసరం అవుతాయి. వ్యవసాయ శాఖ అధికారులు గత అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ కారణంగా రైతులు విత్తనాలు సొంతంగా సమకూర్చుకోలేకపోవడంతో మరో 11,400 క్వింటాళ్లు కావాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. కానీ వారు 53,593 క్వింటాళ్లే పంపిస్తున్నారు. అంటే మొత్తం సాగుకు అవసరమైన విత్తనాల్లో మూడోవంతు మాత్రమే వస్తాయి. ఇక మిగిలిన విత్తనాలకోసం రైతులు తంటాలు పడాల్సిందే. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కంపెనీలు విత్తనాల ధరలను ఇష్టారాజ్యం పెంచే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. అందులో నకిలీవి వస్తే ఇక తాము తేరుకోలేమని భయపడుతున్నారు. పెట్టుబడుల భారం ఖరీఫ్ మొదలైందంటే పెట్టుబడులు సిద్ధం చేసుకోవాల్సిందే. గతంలో బ్యాంకులనుంచి రుణం తీసుకున్నవారు ఎన్నికలసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు మాఫీ అవుతుందని ఆశపడ్డారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అదికాస్తా నీరుగారిపోవడంతో కొత్త రుణాలు మంజూరు కాలేదు. ఫలితంగా ఖరీఫ్ మదుపులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదేళ్లుగా పంటలు పాడవడం, గతేడాది హుద్‌హుద్ విలయతాండవం రైతుల్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టింది. రుణమాఫీ ఆశ తీరకపోవడంతో పెట్టుబడులకోసం తంటాలు పడుతున్నారు. తొలకరి పలకరించినా... తొలకరి ఆశాజనకంగానే ఉంది. అయితే రాబోయే కాలంలో వర్షాభావ పరిస్థితులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పటినుంచే రైతన్నలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందనడంలో సందేహం లేదు. -
ని‘బంధనా’లు
అడ్డంకిగా మారిన ని‘బంధనా’లు..శాఖల మధ్య సమన్వయ లోపం..అధికారుల్లో కొర వడిన చిత్తశుద్ధి.. బ్యాంకర్ల చిన్నచూపు వెరసి మత్స్యకారులకు శాపంగా మారింది. రూ.కోట్లు కళ్లెదుట ఉన్నా ఉపాధినిచ్చే ఆసరా లేక విలవిల్లాడిపోతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఒక్క యూనిట్గ్రౌండ్ చేయలేని పరిస్థితితో ప్రభుత్వం మంజూరుచేసిన రూ.6కోట్లు వెనక్కి మళ్లిపోయే దుస్థితి దాపురించింది. సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ ధాటికి మత్స్యకారులకు అపార నష్టం వాటిల్లింది. మెకనైజ్డ్ బోట్లతో వందలాది ఫైబర్‌బోట్లు, తెప్పలు, వలలు కొట్టుకుపోయాయి. సర్వేల అనంతరం 62 మెకమనైజ్డ్ బోట్లతో పాటు 2415 తెప్పలు, పడవలు, వలలకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు.మత్స్యశాఖ పరిధిలో రూ.38.07 కోట్ల నష్టమొచ్చినట్టు లెక్కతేల్చారు. మత్స్యకారులకు జరిగిన నష్టానికి రూ.8.07 కోట్ల పరిహారం ప్రభుత్వం విడుదల చేస్తే విడతల వారీ ఇప్పటి వరకు రూ.ఐదుకోట్ల వరకు పంపిణీ చేయగలిగింది. మరమ్మతు చేసుకునేందుకు కూడా వీలు లేని విధంగా బోట్లు దెబ్బతిన్న మత్స్యకారులకు కొత్త బోట్ల కొనుగోలు కోసం డిసెంబర్లో ప్రభుత్వం రూ.6కోట్లు మంజూరు చేసింది. ఒక్కొక్క యూనిట్ విలువ రూ.4లక్షలు కాగా, అందులో సబ్సిడీ మొత్తం రూ.2 లక్షలు. బ్యాంకు రుణం రూ.2లక్షలుగా నిర్ణయించారు. ఇంజన్ బోటు నిర్మించుకోవాలంటే కనీసం ఆరు ఏడులక్షలకు పైగా ఖర్చవుతుంది. కనీసం 50శాతం సబ్సిడీతో ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున మంజూరు చేస్తే మిగిలిన మొత్తాన్ని అప్పులు చేసైనా సమకూర్చుకుని బోటు నిర్మించు కోవచ్చనిమత్స్యకారులు ఆశించారు. కానీ ఆచరణలో మాత్రం వారికి రిక్తహస్తమే మిగిలింది. నిధులుండీ కొత్త బోట్లు నిర్మించుకోలేని దుస్థితిలో వారుకొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కయూనిట్ గ్రౌండ్ కాలేదు గడచిన మూడు నెలల్లో ఎంతగా ఒత్తిడి తెచ్చినా అతికష్టమ్మీద 11 యూనిట్లకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం..శాఖల మధ్య సమన్వయం లోపం.. మరీ ముఖ్యంగా బ్యాంకర్ల నిరాసక్తత వల్ల కనీసం 300యూనిట్లు గ్రౌండ్ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఏ ఒక్కటీ గ్రౌండ్ చేయలేకపోయారు. రెండురోజుల క్రితం జరిగిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఇదే అంశంపై చర్చించారు. హుద్‌హుద్ వల్ల బోట్లు పూర్తిగా దెబ్బతిని ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు 50 శాతం రాయితీతో ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను ఎందుకు గ్రౌండ్ చేయలేక పోయారని ప్రశ్నిస్తే అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. తుఫాన్ వల్ల దెబ్బ తిన్న లబ్ధిదారుల వద్ద ష్యూరిటీ పెట్టేందుకు ఏమీ లేవని..ష్యూరిటీ లేకుండా బ్యాంకర్ల రుణం ఇవ్వ లేమని తెగేసి చెబుతున్నారని, అందువలనే ఈ యూనిట్లు గ్రౌండ్ చేయలేకపోతున్నామని అధికారులు చె ప్పారు. ఇది సరైన పద్ధతి కాదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మీ పనితీరు వల్ల నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకార లబ్ధిదారులకు యూనిట్లు మంజూరులో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని క్లాస్ తీసుకున్నారు. ఏమిటా ఆ మెలికలు? ఈ రుణం మంజూరుకు బ్యాంకర్ల నుంచి అంగీకారపత్రం పొందిన తర్వాతే ప్రతిపాదనలను ప్రాజెక్టు అధికారి, యూసీడీ, ఎమ్డీవోలకు సమర్పించాలని మెలిక పెట్టారు. పైగా తమకు నచ్చిన చోట బోటు నిర్మాణం చేయించుకోడానికి వీల్లేదని, మత్స్యశాఖ కమిషనర్ సిఫారసు చేసే బోటుయార్డులోనే పడవలను కట్టించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. బోటు నిర్మాణానికి అయ్యే యూనిట్ విలువ, ఓబీఎంల రేట్లను మత్స్యశాఖ కమిషనర్ నిరా్ధారణ చేస్తారని..వాటికి అభ్యర్థులు అంగీకారం మాత్రమే తెలియ జేయాలని షరతు పెట్టారు. పైగా రుణం మంజూరుకు బ్యాంకరు అడిగిన మేరకు ఆస్తులను చూపించాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని తేల్చిచెప్పారు. ఈ ప్రతిపాదనతో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, మత్స్య శాఖాధికారి జారీ చేసే ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అంగీకారపత్రం, గ్రామసభ తీర్మానం నకలు కాపీలు విధిగా ఉండాలంటూ పెట్టిన నిబంధనలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. మరికొంతకాలం పొడిగించాలని కోరాం నిజమే..ఒక్కటంటే ఒక్కయూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు. నిబంధనల వల్ల ఆశించిన స్థాయిలో ప్రతిపాదనలు పంపలేకపోయాం. నిధులు మురుగిపోకుండా ఈ పథకానికి మరికొంత గడువు కావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవలే జిల్లా కలెక్టర్ యువరాజ్ నివేదిక పంపారు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తుందని భావిస్తున్నాం. - కోటేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ -
రానున్న నెలా అరకొరే..
రూ.100కోట్లే చెల్లింపులు మరో రూ.90 కోట్లకు బ్రేకులు హుద్‌హుద్ సాయంపై ప్రభావం అడ్వాన్స్ జీతభత్యాలకు నో పేరుకుపోయిన వెయ్యికి పైగా బిల్లులు.. ట్రెజరీలో కొనసాగుతున్న ఆంక్షలు ఆర్థికలోటు సాకుగా చూపి ట్రెజరీ ద్వారా చెల్లింపులపై విధించిన నిషేధం అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. చెల్లింపులపై ఫ్రీజింగ్ ఉంది ఏం చేయలేం అంటూ ట్రెజరీ అధికారుల చేతులెత్తేస్తుండడంతో వందల్లో బిల్లులు పేరుకు పోతున్నాయి.. వందల కోట్ల చెల్లింపు లకు బ్రేకులు పడుతున్నాయి. విశాఖపట్నం: ట్రెజరీ ద్వారా చెల్లింపులపై గతనెల 26న ప్రభుత్వం నిషేధం విధించింది. ఫిబ్రవరి మొదటి వారంలో జీతభత్యాలు, ఫింఛన్ల చెల్లింపులకు మినహాయింపు ఇచ్చినా.. వచ్చిన ప్రతీ బిల్లుకూ ఏదో ఒక సాకుతో చె ల్లింపులకు బ్రేకులేస్తూనే ఉన్నారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యా యులు 40వేలమంది ఉండగా, 12వేల మంది వరకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. సుమారు 25వేల మంది పింఛన్ దారులున్నారు. జీతభత్యాల రూపంలో ఉద్యోగులకు రూ.115కోట్లు, అవుట్సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందికి రూ.15కోట్లు చెల్లిస్తుండగా, పింఛన్ దారులకు రూ.60కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. అంటే సుమారు రూ.190కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉండగా, నిషేధం సడలించినప్పటికీ జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు కేవలం రూ.100కోట్ల లోపే. మరో 90కోట్ల చెల్లింపులకు బ్రేకులుపడ్డాయి. ఇక హుద్‌హుద్ సాయం కింద రూ.320కోట్ల మేర పరిహారం విడుదల కాగా, ఇప్పటి వరకు 80శాతం వరకు బ్యాంకులకు జమయ్యాయి. రూ.30కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. వీటిలో గృహాల డామేజ్ కింద మంజూరైన సొమ్ములో రూ.17కోట్లు, మత్స్యశాఖ పరిధిలో రూ.3.50కోట్లు, పశుసంవర్ధకశాఖ పరిధిలో మరో రూ.10కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. పంపిణీ సమయంలోనే నిషేధం అమలులోకి రావడంతో ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. 13వ ఆర్థిక సంఘ నిధులతో పాటు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతీనెలా రూ.150కోట్ల మేర చెల్లింపులు జరుగుతుంటాయి. వీటి విషయంలోనూ నిషేధం ఆంక్షలు ప్రతిబంధకంగా మారాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే హుద్‌హుద్ సమయంలో రేయింబవళ్లు శ్రమించిన జిల్లా పరిధిలోని వివిధశాఖల ఉద్యోగులకు అడ్వాన్స్ బేసిక్‌పే ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. ఈమేరకు జీవో కూడా జారీ చేసింది. దీంతో ఉద్యోగుల బేసిక్ ప్రకారం రూ.27కోట్ల మేర చెల్లింపుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి నివేదించగా జీవో జారీ చేసిన ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. డబ్బులున్నప్పుడు చూద్దాంలే అంటూ పక్కన పెట్టేసిందని అధికార వర్గాలే చెబుతున్నాయి. జీతభత్యాలు, పింఛన్లు, పే అలవెన్సెస్, గ్రాట్యుటీ, పింఛన్‌దారుల మెడికల్ రీయింబర్సుమెంట్,ఎ్ఫ్టీఏ కన్వీనియన్స్, కాస్మోటిక్స్, సీక్రెట్ సర్వీసెస్ ఖర్చులు(పోలీస్), ప్యూనరల్ చెల్లింపులకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఏదో ఒక వంకతో చెల్లింపులకు బ్రేకులేస్తూనేఉన్నారు. జిల్లా ట్రెజరీలోనే ఏకంగా 300కుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉండగా, ఇక సబ్ ట్రెజరీకార్యాలయాల్లో పేరుకుపోయిన చెల్లింపులన్నీ కలుపుకుంటే వెయ్యికిపైగానే ఉంటాయని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిశాక చెల్లింపులపై విధించిన నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందా అంటే అదే డౌటేనని అధికారులంటున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కనుగుణంగా జరిపే చెల్లింపులను బట్టీ నిషేధం ఎత్తివేత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా మార్చిలో కూడా ఇదే రీతిలో నిషేధం కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది కూడా అరకొర గానే జీతాల చెల్లింపులు జరుగుతాయన్న వాదన వ్యక్తమవుతోంది. -
చిక్కిపోయిన రబీ
నిండుకున్న నీటి నిల్వలు రుణాలివ్వని బ్యాంకర్లు అప్పులు పుట్టక అవస్థలు సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం బోర్ల కింద ఆయకట్టు సాగుకు దూరం 10 వేల ఎకరాలకు మించని వరి అపరాల పరిస్థితీ అంతే అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. ఒక వైపు హుద్‌హుద్ రూపంలో విరుచుకుపడింది. చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. మరో పక్క వరుణుడు ముఖం చాటేయడంతో చుక్కనీరు లేని పరిస్థితి. దీనికి తోడు ప్రభుత్వం చిన్నచూపు, బ్యాంకర్ల వివక్షతల కారణంగా చిల్లగవ్వ కూడా అప్పు పుట్టని పరిస్థితి. ఇలా ముప్పే టి దాడితో రైతన్నలు రబీకి సాగుకు రాంరాం చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఈసారి రబీ జాడ కనుమరుగైపోయింది. విశాఖపట్నం: జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం1.35లక్షల ఎకరాలు. వీటిలో 35వేల ఎకరాల్లో వరి సాగవుతుంటే, 70వేల ఎకరాల్లో అపరాలు, 10వేల ఎకరాల్లో వేరుశనగ, 10వేల ఎకరాల్లో మొక్క జొన్న, 5వేల ఎకరాల్లో నువ్వులు సాగవుతుంటాయి. మరో ఐదారువేల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తుంటారు. ఏటా సుమారు 50వేల మందికి పైగా రైతులు రెండవ పంట వేస్తుంటారు. సీజన్ ముగుస్తున్నా.. సాధారణంగా అక్టోబర్ 15 తర్వాత ప్రారంభమయ్యే రబీ సీజన్ ఫిబ్రవరితో ముగుస్తుంది. వరైతే డిసెంబర్లో నారుమళ్లు పోసి జనవరిలో ఊడుస్తారు. ప్రస్తుతం ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా కనీసం 30 శాతం వరి ఊడ్పులు కూడా పూర్తి కాలేదు. అపరాల మాత్రమే 65 శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఇక ఇతర పంటలసాగు ఎక్కడా కనిపించడం లేదు. రబీలో 35 వేలఎకరాలకుపైగా వరిసాగవ్వాల్సి ఉండగా ప్రస్తుతం అతికష్టమ్మీద 10వేల ఎకరాలు కూడా దాటలేదు. ఇక అపరాలైతే 70వేల ఎకరాలకు 40వేల ఎకరాల వరకు సాగవుతున్నాయి. మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు పంటలైతే రబీ సీజన్లో 40వేల ఎకరాలకు 15వేల ఎకరాలకు మించలేదు. మొత్తంమీద లక్షా 25 వేల ఎకరాలకు 65వేల ఎకరాలకు మించి రబీ సాగు జరగడం లేదు. ముఖ్యంగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ సరఫరా లేకే.. జిల్లాలో 20 వేలకు పైగా ఇరిగేషన్ బోర్‌వెల్స్ ఉన్నాయి. వీటి కిందే ఏకంగా లక్ష ఎకరాల వరకు సాగవుతుంటుంది. హుద్‌హుద్ తుఫాన్ కారణంగా జనవరి వరకు వీటికి విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో వీటి కింద సాగయ్యే ఆయకట్టు ప్రస్తుతం రెండవ పంటసాగుకు దూరమైపోయింది. మరో పక్క అక్టోబర్ తర్వాత కనీస వర్షపాతం కూడా నమోదుకాలేదు. రెండవ పంట పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేస్తుంటారు. మిగులు నీరు ఉంటేనే రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు అనుమతిస్తారు. ముఖం చాటేసిన బ్యాంకర్లు ఒక పక్క హుద్‌హుద్ దెబ్బకు గ్రోయిన్లు, స్లూయిజ్‌లు, చెక్ డామ్లు, కాలువలు, చెరువుల గట్లు దెబ్బతినడంతో రబీసాగుకు సరిపడా నీటి నిల్వలు నిండుకున్నాయి. మరో వైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోలేని పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా రుణమాఫీ పుణ్యమాని బ్యాంకర్లు పూర్తిగా ముఖం చాటేయడంతో అప్పుపుట్టడం లేదు. దీంతో రబీ సాగుకు దూరంగా ఉండడమే మేలని మెజార్టీ రైతులు నిర్ణయించుకున్నారు. -
గుడ్లు తేలేసిన పౌల్ట్రీ
పరిశ్రమదారులకు అందని పరిహారం నడిరోడ్డున వేలాది మంది కార్మికులు అప్పులు పుట్టక అల్లాడుతున్న రైతులు గణనీయంగా తగ్గిన గుడ్లు, కోళ్ల ఉత్పత్తి పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. హుద్‌హుద్ దెబ్బకు కనివినీ ఎరుగని రీతిలో నష్టపోయిన పౌల్ట్రీ రైతులునష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. పూర్తిస్థాయిలో పరిహారమందక..నేలమట్టమైన ఫారాలను నిలబెట్టుకునేందుకు అప్పులు పుట్టక అల్లాడిపోతున్నారు. వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయి వలస బాట పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ ధాటికి జిల్లాలో మూడువందలకు పైగా కోళ్లఫారాలు నేలమట్టమయ్యాయి. 16.17లక్షల బ్రా యిలర్, 15.21లక్షల లేయర్ కోళ్లు చనిపోయినట్టు అధికారులే లెక్క తేల్చారు. వీటిలో ఏ ఒక్క ఫారానికి సరైన బీమా సౌకర్యం లేకపోవడంతో ఏఒక్కరూ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోతున్నారు. చనిపోయిన కోడికి రూ.500 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా, గుడ్డుపెట్టే కోడికి రూ.150లు, బ్రాయిలర్ కోడికి రూ.75ల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. లేయర్ కోళ్ల ఫారానికి గరిష్టంగా రూ.15లక్షలు, బ్రాయిలర్ కోళ్ల ఫారానికి రూ.7.5లక్షల చొప్పున సీలింగ్ విధించారు. ఈ విధంగా రూ.120కోట్లు మంజూరు చేశారు. ఈమొత్తంలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే రైతుల అకౌంట్లకు జమయింది. మిగిలిన 50శాతం మంది బాధిత రైతులు పరిహారం కోసం కళ్లల్లో ఒత్తులేకుసుని ఎదురు చూస్తున్నారు. పరిహారంవిషయంలో చాలా మంది అర్హులైన రైతులకు అన్యాయమే జరిగింది. ఈ పరిహారం 25 శాతం నష్టాన్ని కూడా పూడ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ పరిహారం అందితే కాస్త కుదుటపడవచ్చునని రైతులు ఆశిస్తున్నారు. మళ్లీ నిలదొక్కుకునేందుకు అప్పుల కోసం ప్రైవేటు వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. నేలమట్టమైన ఫారాల్లో కేవలం 50 శాతమే తిరిగి నిలదొక్కుకోగలిగాయి. అదీ కూడా తాత్కాలిక షెడ్లలో రూ.10ల వడ్డీకి అప్పులు చేసి మరీ పెట్టుబడులతో ఫారాలను నిలబెట్టుకోగలిగారు. మిగిలినవి తుఫాన్‌కు సాక్ష్యాలుగానే నేటికీ దర్శనమిస్తున్నాయి. తుఫాన్ దెబ్బకు జిల్లాలో గుడ్లు, కోళ్ల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో సాధారణంగా రోజుకు 60 లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం 35లక్షల నుంచి 40లక్షలకు మించడం లేదు. ఇక జిల్లాలో 20లక్షల వరకు బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి జరిగేది. తుఫాన్ తర్వాత అది 13లక్షల నుంచి 15లక్షలకు పడిపోయింది. ఈ పరిశ్రమ టర్నో వర్ కూడా సగానికి పైగా తగ్గిపోయిందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో జిల్లా అవసరాల కోసం ఉభయగోదావరి జిల్లాల నుంచి గుడ్లు,కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫారం పునర్నిర్మాణం కోసం ఉపయోగించే ముడిసరుకుపై 14 శాతం వ్యాట్‌ను రద్దు చేయాలని, ఉమ్మడి రాష్ర్టంలో జారీ చేసిన జీవో మేరకు పౌల్ట్రీ పరిశ్రమకు యూనిట్ రూ.3.88లకే విద్యుత్ సరఫరా చేయాలని, టర్మ్, వర్కింగ్ కాపిటల్ రుణాలపై వడ్డీరాయితీ ఇవ్వాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రూపాయి పరిహారం ఇవ్వలేదు నా కోళ్ల ఫారం తుఫాన్ దెబ్బకు నేలమట్టమైంది. 13వేల కోళ్లు చనిపోయాయి. షెడ్లు పూర్తిగా ధ్వంసమైంది. రూ.15లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇందులో రూ.10 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చాను. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి నా ఫారాన్ని చూసిన పాపాన పోలేదు. దెబ్బతిన్న రైతుల జాబితాలో నా పేరు లేదు. ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. అప్పు ఏ విధంగా తీర్చా లో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఫారం మూసి వేశాను. కుటుంబ పోషణ కష్టంగా ఉంది. - జాన్, పౌల్ట్రీ రైతు పెదపీనార్ల, నక్కపల్లి మండలం -
కలిసిరాని రాజ్మా
ఏటా విపత్తుల బెడద విత్తనాలు దక్కని వైనం చింతపల్లి: మన్యం సిరుల పంట రాజ్మా రాను రాను కనుమరుగవుతోంది. నాలుగేళ్లుగా ప్రకృతి విపత్తుల కారణంగా ఈ పంట దెబ్బతింటూనే ఉంది. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా ఉందనుకున్న దశలో హుద్‌హుద్ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. విత్తనాలు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రానున్న కాలంలో ఈ పంట కనుమరుగైపోతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏజెన్సీలో కాఫీ తరువాత గిరిజన రైతులు రాజ్మా పిక్కలనే ప్రధాన వాణిజ్యపంటగా సాగు చేస్తున్నారు. గతంలో ఒక్క చింతపల్లి, జీకేవీధి మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేసేవారు. ప్రతి ఏటా దాదాపు రూ.30 కోట్లు వ్యాపారం జరిగేది. మన్యంలో పండిన రాజ్మాను ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, పూణే, కోల్‌కత వంటి ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. మంచి పోషక విలువలు కలిగిన రాజ్మా చిక్కుళ్లకు ప్రతి ఏటా ధరలు పెరుగుతునే వచ్చాయి. గతేడాది కిలో రూ.45తో ప్రారంభమైన రాజ్మా రూ.60 వరకు ధర పలికింది. నాలుగేళ్లుగా నీలం, జల్, లైలా, హుదూద్ తుఫాన్లతో రాజ్మా పంట 90 శాతం నాశనమైంది. ఐటీడీఏ ద్వారా విత్తనాల పంపిణీ గగనమైపోయింది. కొద్దో, గొప్పో చేతికి అందిన పంటను రైతులు విత్తనాల కోసం నిల్వ చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది 50 శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా పంటలు దెబ్బతినడంతో రైతులు రాజ్మాను వదిలేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించినా ఆశ్ఛర్య పోవలసిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం వర్షాలపై ఆధారపడి పండించే రాజ్మా అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా నష్టాలు తప్పడం లేదు. కాఫీతోటలు కూడా తుఫాన్ కారణంగా దెబ్బతినడంతో ప్రధాన వాణిజ్య పంటలు సాగు అనుమానాస్పదంగా మారింది. విత్తనాలు దక్కలేదు నాలుగేళ్లుగా ఎకరా భూమిలో రాజ్మా సాగు చేపడుతున్నాను. గతంలో 6 బస్తాలు దిగుబడి వచ్చేది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా విత్తనాలు దక్కడం లేదు. వచ్చే ఏడాది ఈ పంటను చేపట్టకూడదని నిర్ణయించుకున్నాను. -కొర్రా రామ్మూర్తి, బలపం. అప్పులపాలైపోతున్నాం రాజ్మా పంటపై ఆశలు పెట్టుకొని వ్యాపారుల ద గ్గర అప్పులు చేస్తున్నాం. తీరా పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో నష్టపోతున్నాం. పెట్టుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి. -వంతల సీతమ్మ, వంచుల -
పార్లమెంట్ బృందం పైనే ఆశలు
నేడు సుబ్రహ్మణ్య కాలనీలో పర్యటన కష్టాలు తీర్చుతారని స్థానికుల ఎదురుచూపు అనకాపల్లి: అనకాపల్లి మండలంలో పార్లమెంట్ బృందం పర్యటనపై స్థానికులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. 31 మందితో కూడిన పార్లమెంట్ సభ్యుల బృందం ఆదివారం ఉదయం హుద్‌హుద్‌కు నష్టపోయిన ఏఎమ్ఏఎల్ కళాశాలను, సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని సుబ్రహ్మణ్యకాలనీని సందర్శించనున్నారు. తుఫాన్ కారణంగా అనకాపల్లి మండలంలోని సుబ్రహ్మణ్య కాలనీ తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలోనే అక్కడ స్థిరపడిన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వగా, అధికారులు సైతం ఇదే తరహా సంకేతాలు పంపించారు. తుఫాన్ పోయి మూడు నెలలు అవుతున్న తరుణంలో పార్లమెంట్ బృందం చేపట్టనున్న పర్యటన బడుగు, బలహీన వర్గాలలో ఆశలు రేపుతోంది. 11 ఏళ్ల క్రితం సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని 388/2 సర్వే నెంబర్లో సుబ్రహ్మణ్య కాలనీ దశలవారీగా ఏర్పడింది. 22 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వందలాది మంది ఆవాసాలను ఏర్పరుచుకున్నారు. వీరంతా రోజువారీ కూలీ పనులు చేసుకోవడంతోపాటు వలస కుటుంబాలకు చెందినవారే. తుఫాన్ తరువాత అందరి దృష్టి సుబ్రహ్మణ్య కాలనీవాసులపైనే పడింది. ప్రస్తుతమిది వాగు పోరంబోకు స్థలంలో ఉందని ఇటీవల పర్యటించిన ఇతర జిల్లాల ప్రతినిధులు నివేదించారు. కాని 11 ఏళ్లుగా స్థిర నివాసమేర్పరుచుకున్న సుమారు 400 కుటుంబాలకు ఎల్పీసీలు ఇచ్చే విషయంలో రెవెన్యూ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనుకంజ వేస్తున్నారు. సుబ్రహ్మణ్య కాలనీలో నివాసముంటున్న వారంతా తెల్లవారుజామునే సమీపంలోని అనకాపల్లి పరిసర ప్రాంతాలలో పనులు చేసుకునేవారే. వాగు పోరంబోకు కావడంతో అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సుబ్రహ్మణ్యం కాలనీలోనే పక్కా ఇళ్లు నిర్మించడం ఒక ప్రతిపాదన. సమీపంలోని సంపత్‌పురం 2/2 సర్వే నెంబర్లో ఐదెకరాల స్థలంలో పక్కా ఇళ్లు నిర్మించడం మరో ప్రతిపాదన. సుమారు 412 ఇళ్లు నిర్మించాలని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఆదివారం పర్యటించనున్న పార్లమెంటరీ బృందం స్థానికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు. తహసీల్దార్ పర్యటన సుబ్రహ్మణ్య కాలనీలో ఆదివారం పార్లమెంట్ బృందం పర్యటించనున్న నేపధ్యంలో తహశీల్దార్ భాస్కరరెడ్డి, ఆర్ఐ సుభాకర్, గాయత్రి, హౌసింగ్ డీఈ ధనుంజయ్ తదితరులు శనివారం ఎఎమ్ఎఎల్ కళాశాల, సుబ్రహ్మణ్యం కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. -
ఈ మరణం దారుణం..
అప్పుల బాధలు తాళలేక యవరైతు ఆత్మహత్య హుద్‌హుద్ తుపానుకు నాలుగున్నర ఎకరాల పత్తిపంట, ఎకరా వరి పంట మునక... ప్రైవేటు ఫైనాన్స్‌తోపాటు ఇతరత్రా అప్పులు... పురుగు మందు తాగి కోమాలోకి... చికిత్స అందిస్తుండగా మృత్యు ఒడిలోకి... అనాథలైన భార్యా, పిల్లలు... ఆరుగాలం శ్రమ ఒక్క రోజులో ఊడ్చిపెట్టుకుపోయింది...ఆదుకుంటుందని భావించిన ప్రభుత్వం పట్టించుకోలేదు...చేసిన అప్పులు తీర్చలేక, అప్పులు ఇచ్చేవారి ఒత్తిడి భరించలే క, కనీసం పండుగ కూడా చేసుకోడానికి ఖర్చుకు డబ్బులు లేక దిక్కుతోచని దయనీయ స్థితిలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సర్కార్ నిర్లక్ష్యానికి, రాకాసి పిట్ట (హుద్‌హుద్) బీభత్సానికి బలైపోయాడు. పార్వతీపురం: ఓ వైపు హుద్‌హుద్ దెబ్బతో చేతికి రాని పంట...మరో వైపు వేధిస్తున్న అప్పులు...ఇంకో వైపు ఆదుకోని ప్రభుత్వం ఈ తరుణంలో ఏం చేయాలో పాలుపోక కొమరాడ మండలం కొరిశీల గ్రామానికి చెందిన బడే చంద్ర పాత్రుడు(26) అనే శుక్రవారం పత్తిచేలకు వేసే పురుగు ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు చంద్ర పాత్రుడును హుటా హుటీన పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు చికిత్స అందిస్తుండగా...కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. దీనికి సంబంధించి ఆతని కుటుంబ సభ్యులు బడే నరేష్, సీహెచ్ నూకరాజు, జమ్మల పోలారావు, బడే తిరుపతి పాత్రుడు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి... కొమరాడ మండలంలోని గుణదతీలేసు పంచాయతీ కొరిశిల గ్రామానికి చెందిన బడే చంద్ర పాత్రుడు గ్రామంలోని ఊర చెరువు పక్కన సుమారు నాలుగున్నర ఎకరాల్లో పత్తి పంటను వేశాడు. విత్తనాలు మొదలుకొని, పురుగుమందుల వరకూ అన్నింటికీ అప్పు చేసి పంటకు మదుపు పెట్టాడు. పంట చేతికొస్తుందనుకునే సమయంలో విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాను పంటను మట్టిపాలు చేసింది. చెరువు పక్కనే ఉన్న చంద్రపాత్రుడు పొలం యావత్తూ మునిగిపోయింది. నాలుగున్నర ఎకరాలకు కనీసం రెండు క్వింటాళ్ల పత్తి కూడా రాలేదు. ఓ ఎక రంలో వేసిన వరి చేనుకూడా నీట మునిగి మొత్తం పాడైపోయింది. కనీసం కోసేందుకు కూడా పనికిరాకుండా పోయింది. ఈ తరుణంలో పండుగ దగ్గరపడుతుండడంతోపాటు అప్పులోళ్లు ఒత్తిడితో గత కొద్ది రోజులుగా మానసికంగా ఆందోళనకు గురై చిరాకుగా ఉండేవాడు. పంట కోసం ప్రైవేటు ఫైనాన్స్‌తోపాటు, గ్రామానికి చెందని సాదర సొమ్ము, ఇతరుల వద్ద పలు అప్పులు చేశాడు. ఇప్పుడు ఆ అప్పులు తీర్చేందుకు మార్గం కనిపించకపోవడంతో శుక్రవారం పొలంలో పత్తి చేలకు వాడే పురుగు మందు తాగి ఇంటికొచ్చాడు. మాట తడబడడంతో విషయం అడిగితే తాను పురుగుల మందు తాగినట్లు చెప్పడంతో మండలంలోని కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స చేసిన వైద్యులు, పరిస్థితి విషమించడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. అనాథలైన భార్యా, పిల్లలు... బడే చంద్ర పాత్రుడుకు భార్య భాగ్యలక్ష్మి, మూడేళ్ల కూతురు సంజన, ఆరు నెలల బాబు షణ్ముఖ్ ఉన్నారు. ఇంటిని నడపాల్సిన వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబం అనాథయ్యిందని ఆ గ్రామస్తులు తెలిపారు. చిన్న వ యసులో మృత్యువాత పడడంతో ఆ గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పండని జీవితం.
కలిసిరాని తమలపాకుల పంట ఏటేటా తగ్గుతున్నసాగు విస్తీర్ణం హుద్‌హుద్‌తో తీరని కష్టం రూ.15కోట్లకు పైగా రైతులకు నష్టం తమలపాకు రైతు బతుకు పండలేదు. హుద్‌హుద్ కక్కిన విషంతో జీవనం ఆర్థికంగా దుర్భరమైంది. పెట్టుబడి వాయువేగానికి కొట్టుకుపోయింది. అంది వచ్చిన పంటతో అప్పులు తీర్చేద్దామని ఆశించిన రైతు చేతికి చిల్లిగవ్వ దక్కని దుస్థితి. జిల్లాలో ఏ తమలపాకు రైతును కదిపినా కన్నీటి వెతలే. మారిన బతుకు చిత్రం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. విశాఖపట్నం : హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, పూనే, చెన్నై ప్రాంతాలకు నిత్యం జరిగే తమలపాకుల ఎగుమతులు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట కేంద్రంగా రోజూ ఐదు నుంచి పది లారీల తమలపాకులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం ఒక్క లారీకూడా ఎగుమతయ్యే పరిస్థితి లేకుండా పోయింది. కోస్తాలోని విశాఖజిల్లాలో 1750ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 350 ఎకరాల్లో తమలపాకు (దేశవాళీ రకం) సాగవుతోంది. నీలం తుఫాన్ దెబ్బకు 2012లో రెండు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా హుద్‌హుద్ ధాటికి విశాఖ జిల్లాలో 1350 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. మిగిలి ఎకరాల్లో కూడా పంట నాసిరకంగా మారడంతో పెట్టుబడి కూడా రాని దుస్థితి. ఈ తుఫాన్‌తో పాటు గోదావరికి పోటెత్తిన వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో సగం పంట ధ్వంసమైంది. దీంతో దిగుబడులు ఊహించని రీతిలో పడిపోయాయి. ఎకరాకు లక్షన్నర వరకు ఖర్చు చేస్తుండగా.. 30 వేలనుంచి 40వేల పంతాలు(మోదులు) (పంతాకు రూ.150 ఆకుల చొప్పున) దిగు బడి ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తమలపాకుల సీజన్. ఈ సీజన్లో రావులపాలెం, తుని, పాయకరావుపేట, యలమంచిలి, అడ్డురోడ్డుల నుంచి రోజూ 15కు పైగా లారీలతో పాటు పెద్ద సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాల్లో సుమారు రూ.70లక్షల విలువైన తమలపాకులు ఎగుమతయ్యేవి. ప్రస్తుతం అతికష్టం మీద తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి ఒకటి రెండు లోడులు మాత్రమే రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సీజన్లో ఒక్క విశాఖ జిల్లా నుంచి రోజూ రూ.50లక్షలకు పైగా ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క లారీ కూడా ఎగుమతి కాని పరిస్థితి. ఒక్క డిసెంబర్లోనే దిగుబడులు పతనమైపోవడంతో ఎగుమతుల్లేక రూ.15కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లినట్టు అంచనా . కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రెండుసార్లు తుఫాన్ల దెబ్బకు చేతికంది వచ్చిన పంట సర్వనాశనమై పోవడంతో రైతులు కోలుకోలేక పోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఈ పంటసాగుకు రైతులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. హుద్‌హుద్‌కు దెబ్బతిన్న పంటల జాబితాలో తమలపాకులకు చోటుదక్కకపోవడంతో పరిహారం కూడా అందే అవకాశం లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి దక్కక పాలుపోని స్థితిలో రైతులున్నారు. బహిరంగ మార్కెట్లో కిళ్లీలకు ఉపయోగించే ఈ దేశవాళీరకం తమల పాకుల దిగుబడి లేకపోవడంతో వాటికి గిరాకీపెరిగింది. పెట్టుబడులు దక్కడం లేదు నాది పాయకరావుపేట మండలం సత్యవరం. ఎకరాకు లక్షన్నర వంతున పెట్టుబడితో రెండు ఎకరాల్లో తమలపాకుల పంట చేపట్టాను. హుద్‌హుద్ ధాటికి అంతా పాడైపోయింది. ఏటా ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతూనే ఉన్నాయి. కనీసం పెట్టుబడి కూడా దక్కడం లేదు. ప్రస్తుతం మిగిలిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో కోత చేపట్టినా కూలీ ఖర్చు దక్కదు. 2012 నీలం తుఫాన్ సాయం నేటికీ అంద లేదు. ఇప్పుడు హుద్‌హుద్ నష్టాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు -టి.గంగారావు, తమలపాకురైతు -
స్మార్ట్‌గా అడుగులు
కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం హుద్‌హుద్ వంటి విషాదాలకు వీడ్కోలు విశాఖ నగరంలో నింగినంటిన వేడుకలు సాక్షి, విశాఖపట్నం: ఎన్నో కష్టాలు.. మరెన్నో కన్నీళ్లు.. ఆటుపోట్ల నడుమ 2014లో నలిగిపోయిన నగరవాసులు.. కోటి ఆశలతో 2015కి స్వాగతం పలికారు.. పగబట్టిన ప్రకృతిని ఎదిరించి, పాలకుల వంచనను భరించి గతించిన కాలాన్ని చేదు జ్ఞాపకంలా, రానున్న రోజులను అందంగా భావించి వేడుకలు జరుపుకున్నారు. నగరం నడిబొడ్డు నుంచి శివారు గ్రామాల వరకూ నూతన సంవత్సర సంబరాలు హోరెత్తించారు. ప్రశాంత విశాఖలో భారీ సంచలనాలు, పెను సవాళ్లు కొత్త కాదు. గడిచిన ఏడాదిలోనూ అలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. వాటిని అధిగమించి నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక రాజధానిగా విరాజిల్లడంతోపాటు రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీగా నగరం మారబోతోందనే సంతోషం నగరవాసుల్లో తొణికిసలాడింది. 2014లో భారీ విషాదం హుద్‌హుద్ రూపంలో వచ్చింది. ప్రాణాలు తీసింది. ఆస్తులను ధ్వంసం చేసింది. ప్రకృతి విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూపించింది. అయినా నగరం వణికిపోలేదు. నిలువెల్లా గాయాలైనా బెదిరిపోలేదు. జనం మనోధైర్యం ముందు విపత్తు చిన్నబోయింది. తలలు తెగిపడ్డ వృక్షాలు కొత్త చిగుళ్లు తొడిగాయి. అదే స్ఫూర్తి నూతన సంవత్సర వేడుకల్లో ఆవిష్కృతమైంది. కెవ్వు కేక నూతనోత్సాహంతో నగరవాసులు 2015కు స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నివాదాలతో నగరం మారుమోగింది. చలిని లెక్క చేయక, ముసురును పట్టించుకోక, చిరుజల్లుల్లో తడుస్తూనే జనం సంబరాల్లో మునిగితేలారు. ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటలు, పాటలకు విదేశీ స్వదేశీ కళాకారులను రప్పించారు. సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, యాంకర్లు నూతన సంవత్సర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నగర శివారులోని ఓ రిసార్ట్‌లో దర్శకుడు కె.రాఘవేంద్రంరావు, సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో ‘సాగర సంగమం’ అనే పేరుతో నిర్వహించిన సంగీవ విభావరి యువతను ఉర్రూతలూగించింది. పాత కొత్త పాటల మేలు కలయికతో నిర్వహించిన ఈ కార్యక్రమం న్యూ ఇయర్ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచింది. బీచ్ రోడ్డులో అర్ధరాత్రి 12 గంటలకు వేడుకలు మిన్నంటాయి. కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి న్యూ ఇయర్‌కి స్వాగతం పలికారు. పోలీసు శాఖ ముందుగానే ఆంక్షలు విధించడంతో ఆకతాయిలకు కళ్లెం పడింది. వాహనాలు అనుమతించిన మార్గాల్లోనే నడవాలని చెప్పినప్పటికీ అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. దేవాలయాల్లోనూ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, భక్తి గీతాలతో భక్తులు పండుగ జరుపుకున్నారు. ఇక ఫుడ్ కోర్టులకు, రెస్టారెంట్లు భారీ అమ్మకాలు జరిపాయి. ఆఫర్లతో ఆకర్షించి బిర్యానీ, ఫాస్ట్ఫుడ్లను నగరవాసులకు అందించాయి. బేకరీల్లో కేకులకు కొరత ఏర్పడింది. చేదును మర్చిపోయి, తీపిని ఆస్వాదిస్తూ చిన్నా, పెద్ద తేడా లేకుండా నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. అధిక శాతం జనం వీధుల్లోకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. కొందరు ఇళ్లల్లోనే బంధుమిత్రులతో కేకులు కోసి సంతోషాలు పంచుకున్నారు. యువతరం చిందులతో కొత్త ఏడాది సంబరాలకు కళ తెచ్చారు. -
ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతూ..
అసెంబ్లీ సమావేశాల్లో గొంతు విప్పిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హుద్‌హుద్‌సాయం పంపిణీలో వివక్షపై నిలదీత ఆదుకోవడంలో పాలకుల వైఫల్యంపై విరుచుకుపడ్డ నేతలు విశాఖపట్నం: ప్రభుత్వాన్ని నిలదీస్తూ..ప్రజల పక్షాన పోరాడుతూ వైఎస్సార్సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడులు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గొంతు విప్పారు. హుద్‌హుద్ తుఫాన్‌కు జిల్లాలో ప్రజానీకం అతలాకుతలమైతే నామమాత్రపు చర్యలతో అందరినీ ఆదుకున్నామని తప్పుడు ప్రకటనలు చేయడం సరి కాదని అధికార పక్షాన్ని కడిగిపాడేశారు. తుఫాన్ సాయం పంపిణీలో వివక్ష చూపారని, టీడీపీ వారికే అందేలా వ్యవహరించారంటూ నిలదీశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా తుఫాన్ బాధితులందరికీ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయినా కనికరించరా? పాడేరు నియోజకవర్గంలో నలుగురు గిరిజనులు హుదూద్‌కు నలుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి కనిపించలేదా?అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అసెంబ్లీలో ప్రశ్నించారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుదూద్ తుఫానుతో గిరిజనులకు అన్ని విధాల తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించిందని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. విలువైన కాఫీ తోటలు ధ్వంసమైనా మొక్కుబడిగానే ప్రభుత్వం స్పందించిందని పూర్తిస్థాయిలో పరిహారం కూడా పంపిణీ చేయకపోవడం దారుణమంటు మండిపడ్డారు. గిరిజనులపై ప్రభుత్వం వివక్ష చూపడం తగదన్నారు. గిరిజనులంటే చులకనా? తుఫాన్ ముగిసిన నాలుగు రోజుల వరకూ గిరిజనులు చచ్చారో బతికారో చూడ్డానికి కూడా ఒక్క అధికారిగానీ, పాలకులు గానీ అరకు నియోజకవర్గానికి ఎందుకు రాలేదని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. నాలుగు రోజుల తర్వాత ఆహార పొట్లాలు అందించామంటున్న ప్రభుత్వం ఆ నాలుగు రోజులు గిరిజనులు ఏం తిని బతికారో చూశారా అని నిలదీశారు. గిరిజనులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని పాలకపక్షాన్ని దుయ్యబట్టారు. గిరిజనులను కనీసం పలకరించే తీరిక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకపోవడం విచారకరమని, కేవలం జగన్మోహన్రెడ్డి ఒక్కరే రాత్రి వేళలో సైతం వచ్చి బాధితుల కన్నీరు తుడిచారని గుర్తుచేశారు. పరిహారం ఎవరికిచ్చారు? తుఫాన్ వల్ల నిజంగా నష్టపోయిన వారిని పరిహారం జాబితాలో చేర్చకుండా, కనీసం నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి కూడా రాకుండా ఎవరికి పరిహారం అందించారో చెప్పాలని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. తన నియోజకవర్గంతో పాటు జిల్లాలో తుఫాన్ వల్ల చనిపోయిన మూగజీవాలు, కూలిపోయిన పశువుల పాకలను నష్టపరిహారం జాబితాలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. కేవలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సూచించిన వారి పేర్లు రాసుకుని అధికారులు వెళ్లిపోయారని, పాడైన పంటలను చూడ కుండా అధికారులు చేసిన సర్వే అస్తవ్యస్తంగా జరిగిందని దీని వల్ల బాధితులకు ఒరిగిందేమీ లేదంటూ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. -
హుదూద్‌పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
-
గుబాళించని కాఫీ
హుద్‌హుద్ ధాటికి పంట నాశనం భారీగా ధరలు పతనం కిలో గింజలు రూ.150 పాడేరు: ఏటా గిరిజన రైతులను ఆదుకుంటున్న కాఫీకి ఈ ఏడాది మన్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. హుద్‌హుద్ ధాటికి ఈ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కాఫీ గింజలకు రెట్టింపు ధర లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. రెండేళ్లుగా బ్రెజిల్, వియత్నాం దేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడంతో ఏజెన్సీలో సేంద్రియ పద్ధతిలో పండించిన కాఫీకి బెంగళూరు మార్కెట్లో డిమాండ్ ఉండేది. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఆ రెండు దేశాల్లో దిగుబడులు పెరిగాయి. బెంగళూరు మార్కెట్లోని పెద్ద వ్యాపారులంతా విదేశాల్లో కాఫీ గింజల కొనుగోలుపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.150లకు మించి విజయవాడ వ్యాపారులు ఏజెన్సీలో కాఫీ గింజలను కొనుగోలు చేయడం లేదు. ఏజెన్సీలో లక్షా 40 వేల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. 96 వేల ఎకరాల్లోని వాటి నుంచి ప్రస్తుతం ఫలసాయం వస్తోంది. గతేడాది 6 వేల టన్నుల కాఫీ గింజల దిగుబడితో రూ.11.40 కోట్ల వ్యాపారం జరిగింది. కిలో రూ.190 నుంచి రూ.210లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది పూత బాగా వచ్చింది. సుమారు 7 వేల టన్నుల దిగుబడి ఉంటుందని ఐటీడీఏ కాఫీ విభాగం, కేంద్ర కాఫీబోర్డు అధికారులు అంచనా వేశారు. ఈ తరుణంలో హుద్‌హుద్ కారణంగా 30 వేల ఎకరాల్లోని తోటలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం 4,800 టన్నుల దిగుబడి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెండు వారాలుగా కాఫీ గింజల లావాదేవీలు సాగుతున్నాయి. కిలో రూ.140 నుంచి రూ. 150లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గడంతో ధర రూ.200 నుంచి రూ.250 మధ్య ఉంటుందని ఆశపడిన గిరిజన రైతులకు నిరాశే మిగిలింది. -
హూదూద్పై సభలో సీఎం చంద్రబాబు
-
వైఎస్ జగన్ లక్ష్యంగా టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అధికార పార్టీ సభ్యుడు కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. మిడిమిడి జ్ఞానంతో సభ్యుడు మాట్లాడుతున్నారని ఆయన శనివారం అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. హుద్‌హుద్ తుపాను చర్చలోనూ టీడీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగటంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో కరవుతో అల్లాడిపోయిన ప్రజలకు 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక కేంద్రం నుంచి బుందేల్‌ఖండ్ తరహాలో ప్యాకేజీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎప్పుడూలేని రీతిలో రైతులకు వడ్డీని మాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదని వైఎస్ జగన్ అన్నారు. రూ.1150 కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తూ వైఎస్ఆర్ మొట్టమొదటి సంతకం చేశారన్నారు. విషయాలు తెలుసుకుని అధికార సభ్యులు మాట్లాడితే బాగుంటుందన్నారు. విషయాలను తెలుసుకోకుండా రాళ్లు, బండలు వేస్తున్నారని మండిపడ్డారు. హుద్హుద్పై ఎమ్మెల్యేల ప్రసంగాలు ఆత్మస్తుతి - పరనింద మాదిరిగా సాగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. టెక్నాలజీ గురించి పదేపదే ప్రభుత్వం చెప్తోంది కానీ 61మంది ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు. అదే తుఫాను కారణంగా ఒడిశాలో మృతుల సంఖ్య 5-6కు మించి లేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం చెప్తున్న నష్టం అంచనాలో...పెట్టే ఖర్చు ఒక్క శాతం కూడా లేదన్నారు. -
చేదు గీతం
పడిపోయిన పంచదార ధర నష్టాలు దిశగా చక్కెర మిల్లులు ఉత్పత్తి ఖర్చులు రాని వైనం గగ్గోలు పెడుతున్న యాజమాన్యాలు వ్యాట్‌తో నిండా మునిగిపోతున్న పరిశ్రమ చోడవరం: జిల్లాలోని నాలుగు సుగర్ ఫ్యాక్టరీలు నష్టాలతో సతమతమవుతున్నాయి. రోజురోజుకు పంచదార ధరలు తగ్గిపోవడంతోపాటు ఇటీవల వచ్చిన హుద్‌హుద్‌కు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వ్యాట్ చా ర్జీలు లేకపోవడంతో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చక్కెర మన రాష్ట్రంలోకి తక్కువ ధరకు దిగుమతి అవుతోంది. రాష్ట్రంలో చక్కెర కొనాలంటే క్వింటాకు రూ.150 వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పరిస్థితిలో వ్యాట్ ఛార్జి కూడా కొనుగోలుదారులపైనే ఫ్యాక్టరీలు సహకార రంగంలోని చక్కెర మిల్లులు చేదుగీతం ఆలపిస్తున్నాయి. రోజు రోజుకు మార్కెట్లోపంచదార ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఫ్యాక్టరీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అసలే హుదుహుద్ తుఫాన్ దెబ్బ..ఆపై తగ్గిన చెరకు దిగుబడి..గతేడాది బకాయిలు ఇప్పటికీ రైతులకు చెల్లించని కొన్ని ఫ్యాక్టరీలు.. దీనికి తోడు పిడుగులాంటి వ్యాట్‌తో జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు నష్టాల బాట పడుతున్నాయి. దీనివల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అదనంగా క్వింటా దగ్గర రూ.150 పెరుగుతోంది. అంతర్జాతీయంగా పంచదారకు డిమాండ్ తగ్గడంతో రాష్ట్రీయ చక్కెర ఎగుమతులు నామమాత్రంగాగానే జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం క్వింటా పంచదార ధర రూ.2450కి పడిపోయింది. 2013-14క్రషింగ్ సీజన్ ముగిసే నాటికి అంటే ఈ ఏడాది మార్చినెలలో క్వింటా రూ3050కు అమ్మగా క్రమేణా రూ. 2900, 2700లకు అమ్మింది. ఈ ధరకే ఫ్యాక్టరీలు గగ్గోలు పెడుతుంటే వారం రోజుల నుంచి ఏకంగా 2550, 2450కి ధర పడిపోవడంతో సహకార చక్కెర కర్మాగారాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. పెరిగిన ముడిసరుకుల ధరలు, ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులు, రైతులకు చెల్లించేధర కలుపుకుంటే క్వింటా పంచదార ఉత్పత్తికి ఫ్యాక్టరీలకు రూ.3వేలు వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం ధర చూస్తే అసలుకే ఎసరు వచ్చేటట్టు ఉంది. ఇక లాభాలు మాట దేవుడెరుగు ఉత్పత్తి వ్యయమైనా గిట్టుబాటైతే చాలని అంటున్నాయి యాజమాన్యాలు. జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలే లాభనష్టాలు లేకుండా నడుస్తున్నాయి. వీటికి కూడా ఈ ఏడాది నష్టాలు తప్పవంటున్నారు. రెండునెలల కిందట సంభవించిన హుదుహుద్ తుఫాన్‌కు గోవాడ, అనకాపల్లి. ఏటికొప్పాక ఫ్యాక్టరీలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్యాక్టరీ మిల్లుహౌస్లు, గోడౌన్లలో నిల్వ ఉంచిన పంచదార బస్తాలు కూడా తడిసి నష్టాలబారిన పడ్డాయి. ఈ క్రమంలో గోవాడ ఫ్యాక్టరీ చాలా ఎక్కువగా నష్టపోయింది. రూ.2700ధరలోనైనా ఉన్న నిల్వలను అమ్ముడుపోకపోవడం, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సుగర్స్ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోపక్క పాత నిల్వలే ఇంకా పూర్తిగా అమ్మకం కాకపోగా ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభం కావడంతో కొత్త పంచదార కూడా గోడౌన్లకు వచ్చి చేరనుంది. తగ్గుముఖం పట్టిన పంచదార ధరతో యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాక్!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. హుదూద్ నష్టం చంద్రబాబు సర్కార్ చెప్పినంతగా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నష్టం సుమారు రూ.680 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని పేర్కొంది. తాము ఈ విషయంలో ఇంతకన్నా ఎలాంటి సాయం చేయలేమని స్పష్టం చేసింది. ఈ విషయమై మాట్లాడేందుకు ఈ నెల 15న ఢిల్లీ రావాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కబురు పంపింది. హుద్ హుద్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 21,908 కోట్లు ఆర్ధిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. విశాఖలో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటివరకూ రూ.400 కోట్లు విడుదల చేశారు. కాగా హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించలేమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటిస్తారు... కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో సాయం అందుతుందని ఆశలు పెట్టుకున్న చంద్రబాబు సర్కార్‌కు ఇది ఊహించని దెబ్బే. -
తుపాను సాయమంతా.. టీడీపీ నేతలకే!
-
హుదూద్ నష్టం 680 కోట్లే(నట)..!
-
తుపానును జయించింది.. సిలిండర్ కబళించింది!
హుద్‌హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన రోజునే పుట్టిందా పసికందు. తుపాను గాలులను, అంతటి ప్రళయాన్ని కూడా తట్టుకుని నిలబడింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఈ భూమ్మీదకు వచ్చింది. కానీ.. మంగళవారం నాటి గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో ఎంతోమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కానీ ఆ ఒక్క చిన్నారి మాత్రం ప్రాణాలు వదిలేసింది. దేవీప్రసాద్, భవానీ దంపతులు విశాఖ నగరం రంగిరీజు వీధిలో ఉంటున్నారు. వారికి అక్టోబర్ 12న.. హుద్‌హుద్ తుపాను చెలరేగిన రోజున.. ఆడపిల్ల పుట్టింది. కానీ, వారి ఆనందం అంతే త్వరగా ఆవిరైపోయింది. వారి ఇంటి ఎదుటే కోట సత్యనారాయణ కుటుంబం ఉంది. ఆయన భార్య టీ పెట్టడానికి ప్రయత్నించగా గ్యాస్ పొయ్యి వెలగలేదు. వాళ్లూ వీళ్లు వచ్చి చూశారు. వాళ్లలో ఒకరు పిన్‌తో గ్యాస్ సిలిండర్ పై భాగంలో తుడవడం మొదలుపెట్టారు. అంతే.. ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. సత్యనారాయణ ఇల్లంతా మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో ఎదురింట్లో పాప ఆడుకుంటోంది. తల్లి ఇంట్లో పని చేసుకుంటూ పాపను ఇంట్లో పడుకోబెట్టింది. పేలుడు ధాటికి పాప ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం బయటకు వచ్చింది. ఇంతలో ఇంటి పై కప్పు నుంచి ఒక పెంకు సరిగ్గా పాప ముఖంపై పడింది. ఆ మరుక్షణమే పాప ప్రాణం పోయింది!! -
ఒలికిన కాఫీ
తగ్గిన దిగుబడులు గిట్టుబాటు ధరపైనే రైతుల ఆశలు ఏజెన్సీలో కొనుగోలు మొదలు {పారంభ ధర రూ.110లు పాడేరు : ఏజెన్సీలో గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న కాఫీ పంటను ఈ ఏడాది హుద్‌హుద్ తీవ్రంగా నష్టపరిచింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఏజెన్సీవ్యాప్తంగా 1.46 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిలో 96 వేల ఎకరాల్లోని పంట ఫలాశయాన్ని ఇస్తున్నది. ఏటా 6వేల నుంచి 6,500 టన్నుల వరకు క్లీన్ కాఫీ గింజలను గిరిజన రైతులు సేకరించి అమ్ముతున్నారు. అయితే ఈ ఏడాది 15,066 హెక్టార్లలో పంట ధ్వంసమైనట్లు అధికారులు నిర్ధారించారు. 50 శాతం లోపు నాశనమైన కాఫీ పంట మరో 5 వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఈ కారణంగా దిగుబడులు భారీగా తగ్గాయి. మన్యమంతటా 3వేల టన్నుల లోపే దిగుబడులు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ అంతటా కాఫీ పండ్ల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. పల్పింగ్ పూర్తయి బాగా ఎండాక కాఫీ గింజలు అమ్ముతారు. అప్పుడే కొందరు గింజలను వారపు సంతలకు తెస్తున్నారు. కిలో రూ.100 నుంచి రూ. 110లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు తగ్గినందున రెట్టింపు ధర లభిస్తుందని ఆశించిన ఆదివాసీలకు నిరాశే ఎదురవుతోంది. బెంగళూరు మార్కెట్లో కాఫీ ధరలు బాగా తగ్గిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. బ్రెజిల్, వియత్నాం దేశాల్లో దిగుబడులు బాగుండటంతో విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు డిమాండ్ కూడా తక్కువగా ఉందని వి.మాడుగులకు చెందిన కాఫీ వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాది ప్రారంభంలో కిలో రూ.100లకు కొనుగోలు చేశారు. అప్పట్లో బెంగళూరు మార్కెట్లో డిమాండ్ మేరకు సీజన్ చివరిలో కిలో రూ.200లకు అమ్ముడుపోయాయి. ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థలు కాఫీ గింజలను గిట్టుబాటు ధరకు ఏర్పాట్లు చేయాలని, దళారుల మోసాల నుంచి కాపాడాలని గిరిజన కాఫీ రైతులు కోరుతున్నారు. -
కోటా బియ్యానికి కోటింగ్!
సన్న బియ్యం పేరుతో కోటా బియ్యం విక్రయాలు దండిగా లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు కన్నెత్తి చూడని పౌరసరఫరాల శాఖ నక్కపల్లి/ నక్కపల్లి రూరల్ : మిల్లర్లకు కాలం కలిసొచ్చింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ఈ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ట్రేడింగ్ మిల్లుల్లో తక్కువ ధరకు సన్నబియ్యం విక్రయించవచ్చన్న ఆదేశం మిల్లర్లను మరిన్ని అక్రమాలకు పురిగొల్పినట్టయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యంలో రేషన్ బియ్యం కలిపేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల హుద్‌హుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఉచితంగా 25, 50కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది. జిల్లావ్యాప్తంగా వేలాది టన్నుల కోటాబియ్యం పంపిణీ జరిగింది. ఈ బియ్యాన్ని కార్డుహోల్డర్ల నుంచి కొంతమంది అక్రమవ్యాపారులు, రైసుమిల్లర్లు కొనుగోలు చేశారు. ఇవే బియ్యాన్ని రీ సైక్లింగ్‌తో సన్నబియ్యం, సాంబమసూరు, సోనామసూరు, ఆర్జీఎల్ తదితర రకాలపేరుతో సంచులు మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రేడింగ్ మిల్లుల నుంచి లెవీ తగ్గించి రు.30లకే సన్న అమ్మాలనే ప్రభుత్వ ఆదేశాలతో మిల్లర్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. సన్నబియ్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి మా ర్కెట్లో సాధారణ బియ్యం మాదిరిగా విక్రయిస్తున్న మిల్లర్లకు సన్నబియ్యం అమ్మకాలు చేయమన్న ప్రభుత్వ ఆదేశాలు కొండంత అండనిస్తున్నాయి. ప్రస్తుతం నాణ్యమైన సాంబమసూరి, సోనామసూరి, బీపీటీ సన్నాల బియ్యం ధరలు మార్కెట్లో క్వింటా రు.4వేల వరకు అమ్ముతున్నారు. మిల్లర్లు రైతుల వద్ద సాంబమసూరి, ఆర్జీఎల్ తదితర రకాల 75కిలోల బస్తారూ.1400నుంచి 1500లకు కొనుగోలుచేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా సేకరించిన బియ్యాన్ని సన్నబియ్యంతో కలిపి విక్రయించడంతో మిల్లర్లకు దండిగా లాభాలు వస్తున్నాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రూ. 30లకే సన్నబియ్యం సాధ్యమేనా... మిల్లర్లు, వ్యాపారస్తులు రైతుల నుంచి సాంబమసూరి, సోనామసూరి ఆర్జీఎల్ తదితర ధాన్యం రకాలను 75 కేజీల బస్తాను రు.1500ల వరకు కొనుగోలుచేస్తున్నారు. సన్నబియ్యం రకాల దిగుబడి ట్రేడింగ్ మిల్లుల్లో 150 కేజీల ధాన్యంకు 85 నుంచి 90 కేజీల వరకు బియ్యం దిగుబడి ఉంటోంది. క్వింటాలు సన్నబియ్యం ఉత్పత్తికి మిల్లర్లకు, వ్యాపారస్తులకు రు.3500ల నుంచి4వేలు వరకు (కొనుగోలు, మిల్లింగ్‌కు కలిపి) ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యాపారస్తులు, మిల్లర్లు కేజీ రు.30లకే (క్వింటా రు.3వేలు) సన్నబియ్యం అమ్మకాలు ఏవిధంగా చేస్తున్నారన్న ప్రశ్నలకు రేషన్ బియ్యమే సమాధానమిస్తున్నాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యంలో కల్తీ ఏవిధంగా అంటే.... సన్నబియ్యం ధాన్యం రకాలను 6బస్తాలను మిల్లింగ్‌చేసి ఒక లేయర్ (గీటర్) తొలగిస్తారు. ఈ బియ్యాన్ని ఒక నెట్టెగా వేసి 5రోజులపాటు నిల్వ ఉంచుతారు. కొద్దిగా ముక్కిన తర్వాత ఒక రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కలిపి మళ్లీ మిల్లింగ్ చేసి పాలిష్పెడతారు. ఈ విధంగా పాలిష్‌చేసిన బియ్యాన్ని సన్నబియ్యంగా అమ్మకానికి ఉంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పరోక్షంగా రేషన్ బియ్యాన్నే సన్నబియ్యంగా ప్రజలచే కొనుగోలుచేయిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యవేక్షణ లేదు... సన్నబియ్యం అమ్మకాలు ప్రారంభించిన అధికారులు పర్యవేక్షణ విషయాన్ని పక్కనబెట్టారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు ఏ బియ్యాన్ని అమ్ముతున్నారన్న విషయమై తనిఖీలు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం మిల్లర్లు అమ్ముతున్న సన్నబియ్యం రకాలను తేమ, నూకల శాతం పరీక్షించినట్టయితే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పౌర సరఫరా శాఖ అధికారులు, రెవిన్యూ పర్యవేక్షణలో మిల్లింగ్‌చేసి సన్నబియ్యాన్ని విక్రయించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం జరిగే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాన్ట్రేడి ంగ్ మిల్లుల్లో ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు. 500కు పైగా రైసు మిల్లులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నాన్‌ట్రేడింగ్ మిల్లులే. ఈ మిల్లుల్లో కేవలం రైతువారీ ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలి. వీటిలోచాలా చోట్ల ట్రేడింగ్ (మిల్లింగ్, విక్రయాలు) జరుగుతున్నా పౌరసరఫరా శాఖ అధికారులు పట్టించుకోకపోవడవం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా మిల్లర్ల నుంచి లక్షలాది రూపాయల మామూళ్లు అందడంవల్లే అధికారులు ఈ అక్రమాలపై కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. -
'తుపాను నిధుల్లో సగం బాబు జేబులోకే!'
-
హుద్‌హుద్ నష్టం రూ.3వేల కోట్లు
విజయనగరం కంటోన్మెంట్: అక్టోబర్ 12న విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో వివిధ శాఖలు, పబ్లిక్ ప్రాపర్టీకి రూ. 2995 కోట్ల నష్టం జరిగిందని కలెక్టర్ ఎం.ఎం నాయక్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళినిలు వివరించారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎం నాయక్ అధికారులతో కలసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నష్టం వివరాలను వివరించారు. గ్రామాల్లో సభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలను నివేదించామన్నారు. తుపాను వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 15,303 గృహాలు నష్టపోగా రూ.8.42 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించారు. విద్యుత్ శాఖకు రూ.438 కోట్ల నష్టం జరిగిందనీ, వ్యవసాయ శాఖకు రూ.91 కోట్లు, ఉద్యాన వన శాఖకు రూ.11.83 కోట్లు, మత్స్య శాఖకు రూ.28.37 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. 685 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లు దెబ్బతిన్నాయనీ, దీని వల్ల 91,656 ఎకరాల ఆయకట్టుకు నష్టం వాటిల్లిందన్నారు. 376 మధ్య తరహా ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. దీని వల్ల రూ.59 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఆర్‌అండ్‌బీకి 20,890 లక్షల నష్టాన్ని అంచనా వేసినట్లు వివరించారు. పీఆర్, మున్సిపాలిటీలు, వైద్యం, ఫారెస్టు తదితర శాఖలకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. ఈ నష్టాలను మండలాల వారీగా నివేదికలు అందజేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో జేసీ బి.రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మున్సిపల్ చైర్మన్ ప్సాదుల రామకృష్ణ, జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణమూర్తి, ఏజేసీ నాగేశ్వరరావు, డీఆర్వో వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ‘తీరప్రాంతాల్లో గృహ నిర్మాణ యూని ట్లకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షలు’జిల్లాలో తీరప్రాంత మండలాల్లో గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి రూ.3.50 లక్షల రూపాయలందేలా యూనిట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు చేశామని రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రూ.4లక్షల వరకూ తీరప్రాంత మండలాల్లో తుపాన్లను తట్టుకునేలా ఇళ్లను నిర్మించే ఆలోచన ఉందని, సీఎం దీన్ని ఆమోదించాల్సి ఉందని తెలిపారు. -
చంద్రబాబును కలసిన నీతూ అంబానీ
-
హుద్‌హుద్, తుపానుకు నెల
-
విలయానికి... నెల
* ఇంకా కళ్లముందే కనిపిస్తున్న బీభత్సం * సాగుతున్న ఎన్యుమరేషన్ * నష్టాల బేరీజులో అధికారులు * నేటికి రూ.2వేల కోట్లు దాటిన నష్టం సాక్షి ప్రతినిధి, విజయనగరం: సరిగ్గా ముప్పై రోజుల కిందట రాకాసి గాలి సుడులు తిరుగుతూ జి ల్లాను వణికించేసింది. నేటికి నెలనాళ్లవుతున్నా ఆ విలయం ఆనవాళ్లు ఇంకా మాయలేదు. అధికారు ల అంచనాలు కూడా ఇంకా సా...గుతూనే ఉ న్నా యి. ఇప్పటికే రూ.2వేల కోట్ల మేర నష్టం జరిగినట్టు తేలింది. ఇంకెంత తేలనుందో తెలి యని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి విపత్తు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నష్టం సంభవించింది. ఈ నష్టం అధికార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. తుపాను గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న జిల్లా ప్రజలకు అది మిగిల్చిన నష్టాన్ని చూసి బెంబెలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. పునరుద్ధరణ పనులు ఇంకా సాగుతున్నాయి. పడిపోయిన చెట్లు, కూలి పోయిన ఇళ్లు ఎక్కడికక్కడ అలానే ఉన్నాయి. ఉద్యానవన తోటలైతే దిక్కుతోచని స్థితిలో ఉన్నా యి. తుపాను వెలిశాక నిత్యావసర సరుకులిచ్చి చేతులు దులుపుకున్న సర్కార్ పునరుద్ధరణ, పరి హారానికి సంబంధించి ఇంతవరకు పైసా కూడా విడుదల చేయలేదు. ఒకవైపు నష్టం అంచనాలకు అందని విధంగా ఉంది. అంతకంతకు పెరిగిపోతోంది. నెలరోజులగా ఎన్యుమరేషన్ చేస్తున్నా కొ లిక్కి రావడం లేదు. ఇదొక ప్రహసనంలా సాగిపోతోంది. ఇదెప్పటికి పూర్తవుతుందో? పునరుద్ధరణ జరిగేదెప్పుడో? పరిహారం వచ్చేదెప్పుడో? ప్రజ ల నష్టం తీరెదెప్పుడో తెలియని దుస్థితి నెల కొంది. ఇప్పటివరకైతే సుమారు రూ.2వేల కోట్ల నష్టం తేలింది. ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఎన్యుమరేషన్ అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి హుద్‌హుద్ బీభత్సం ఎంత మేర సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ నష్టాల వివరాలివి. ఊవ్యవసాయ శాఖ పరిధిలోకి వచ్చే 5,923.5హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతినగా 83.38 కోట్లు మేర నష్టం సంభవించింది. * 42,348హెక్టార్లలో ఉద్యానవన పంటలు నాశనమవ్వగా 21.23కోట్ల మేర నష్టం వాటిల్లింది. * పట్టు పరిశ్రమకు 11.90లక్షల నష్టం జరిగింది. * 15,991ఇళ్లు దెబ్బతినగా 8.70కోట్లు నష్టం ఏర్పడింది. * 23.96కోట్ల విలువైన జీవాలు చనిపోయాయి. * 77.69కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. * 11.44కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ ఆస్తులు దెబ్బతిన్నాయి. * 22.01కోట్ల మేర ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లింది. * ఆర్అండ్బీ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 194.73కోట్ల నష్టం సంభవించింది. * పరిశ్రమలకు రూ.874కోట్లు నష్టం జరిగింది. * ఐటీడీఏ పరిధిలో రూ.3.69కోట్ల నష్టం ఏర్పడింది. * పంచాయతీరాజ్ రోడ్లు, ఇతరత్రా ఆస్తులకు 183కోట్ల నష్టం వాటిల్లింది. * పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖకు 23. 99కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మున్సిపాలిటీల పరిధిలో 279.33కోట్ల మేర నష్టం జరిగింది. * చిన్న నీటిపారుదల శాఖకు 40.32కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. * గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగానికి 6.05కోట్ల నష్టాన్ని మిగిల్చింది. * మత్స్యశాఖ పరిధిలోకి వచ్చే వాటికి 28.37కోట్ల నష్టం ఏర్పడింది. * వైద్య ఆరోగ్య శాఖకు 29.62కోట్లు నష్టం జరిగింది. * ట్రాన్స్‌కోకు 41.48కోట్ల నష్టం సంభవించింది. -
ఇద్దరూ ఆ తానులో ముక్కలే.....
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభం, రుణమాఫీ అమలు కాకపోవటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఒక తాను ముక్కలేనని వ్యాఖ్యానించారు. వారి వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని నారాయణ అన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తన వైఫల్యాలకు చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని నారాయణ అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావాలంటే 50 సంవత్సరాలు పడుతుందని నారాయణ అన్నారు. హుదూద్ తుఫాను నష్టంలో అన్ని రాజకీయ పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. -
బియ్యం, పంచదార పక్కదారి
-
టేకు చెట్టుకు రూ.500.. కొబ్బరి చెట్టుకు రూ.1000
-
హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం హైదరాబాద్ బయల్దేరారు. చంద్రబాబు అంతకుముందు విశాఖపట్నం జిల్లాలో పర్యటించి హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించారు. వరదలు, తుపానుల దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతంలో స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. తుపాన్ వల్ల దెబ్బతిన్న గ్రామాలను చంద్రబాబు సందర్శించి బాధితులను పరామర్శించారు. విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరించనందున కిరోసిన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తుపాన్ వల్ల దెబ్బతిన్న టేకు చెట్టుకు 500, కొబ్బరిచెట్టుకు 1000, జీడి మామిడి ఎకరాకు 25 వేలు, వరి ఎకరాకు 15 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. కొన్ని చోట్ల రోడ్డు షోలు నిర్వహించారు. బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. -
ఒడిశాలో రాహుల్ పర్యటన
భువనేశ్వర్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఒడిశాలో పర్యటిస్తున్నారు. హుదూద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని, సాధారణ జనజీవనం ఏర్పడే వరకు పార్టీ తరపున సాయం చేస్తామని రాహుల్ చెప్పారు. కొరాపుట్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాన్ తీవ్రత, సహాయక చర్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తానని రాహుల్ చెప్పారు. ఆదివారం రాహుల్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించి తుపాన్ బాధితులను పరామర్శించారు. -
విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన
విజయనగరం : హదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం భోగాపురం మండలం ఏ రావివలస నుంచి తన పర్యటనను ప్రారంభించారు. తుఫాను బాధితులు, రైతులను పరామర్శించిన ఆయన అనంతరం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్ పూసపాటిరేగ మండలంలోని కోనాడ, తిప్పలవలసలో పర్యటించి మత్స్యకారులు, రూతులను ఓదార్చి వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. -
రుణమాఫీ లేక పంటలకు ఇన్సూరెన్స్ కూడా రాని స్థితి
-
వారంరోజులవుతున్నా అందని సర్కారు సాయం
-
ప్రతి కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలి: వైఎస్ జగన్
విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శిస్తున్నారు. విజయనగరం జిల్లా కోరుకోండలో దెబ్బతిన్ని మామాడి, టేకు, చెరుకు పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరిగినా ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ నెల పేదలకు ఉచితంగా ఇస్తామన్న బియ్యాన్ని ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు ప్రతి కుటుంబానికి తక్షణం 5 వేల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం, పూర్తిగా ధ్వంసమైన వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు రీ షెడ్యూల్ కూడా చేయలేదని, దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా వచ్చే అవకాశం లేదని జగన్ ఆరోపించారు. -
భీమిలిలో పర్యటించిన వైఎస్ జగన్
-
వైఎస్ఆర్ సీపీ నేత తోట చంద్రశేఖర్ విరాళం
హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోట చంద్రశేఖర్ రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. తుపాను బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునివ్వడంతో ఆ పార్టీకి చెందిన నేతలు స్పందించారు. ఆ మేరకు తోట చంద్రశేఖర్ శనివారం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి పదిహేను లక్షల చెక్కును అందించారు. కాగా హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలంటూ వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆపార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు తమ రెండు నెలల వేతనాన్ని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలరోజుల జీతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తుపాను బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్-సాక్షి మీడియా గ్రూపు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన నిధికి తొలి విరాళంగా జగన్ రూ.50 లక్షలు ప్రకటించారు. -
చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖకు వచ్చి ఏం చేస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు సీఎం స్థాయికి సరికావని ఆయన అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్నవారిని పరామర్శించటం పార్టీ నేతల బాధ్యత అని శైలజానాథ్ శనివారమిక్కడ అన్నారు. గతంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకోవటానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెను తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని శైలజానాథ్ విమర్శించారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు నిమగ్నమయ్యారే తప్ప...తుఫాను ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టలేదన్నారు. అందుకే తీవ్ర నష్టం వాటిల్లిందని శైలజానాథ్ అన్నారు. ఒడిశా ప్రభుత్వం మాదిరిగా బాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆయన తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తుఫాను అంశాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. -
బాణాసంచా దుకాణాల లైసెన్స్‌ల రద్దు
విశాఖ : విశాఖ జిల్లా వ్యాప్తంగా దీపావళి మందుగుండు సామాగ్రి, బాణాసంచా దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ యువరాజ్ హెచ్చరించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీపావళికి విశాఖ ప్రజలు బాణాసంచా కాల్చవద్దని సూచించిన విషయం తెలిసిందే. హుదూద్ బీభత్సంతో ఎక్కడికక్కడ చెట్లు కూలటంతో పాటు, నగరంలో చెత్త కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవటంతో బాణాసంచా కాల్చితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు దీపాలు పెట్టి పండుగ జరుపుకోవాలని ఆయన తెలిపారు. -
దీపావళికి బాణాసంచా కాల్చొద్దు: చంద్రబాబు
-
దీపావళికి బాణాసంచా కాల్చొద్దు: చంద్రబాబు
విశాఖ : దీపావళికి ఎవరూ బాణాసంచా కాల్చవద్దని, దీపాలు పెట్టి పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ చెత్త ఉన్నందున, బాణాసంచా కాల్చితే అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారముందన్నారు. ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలని, అవసరమైతే అందరికీ దీపాలు సరఫరా చేస్తామన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొంటూ పండుగ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీపావళి కంటే ముందే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల సహకారం మరువలేనిదని చంద్రబాబు అన్నారు. నిన్న విశాఖలో 40 నిమిషాల పాటు తాగునీరు ఇచ్చామని, శనివారం గంటసేపు ఇవ్వాలని చెప్పామని ఆయన తెలిపారు. విద్యుత్ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందన్నారు. డీజిల్, పెట్రోల్‌పై ఎక్కడా ఫిర్యాదులు లేవన్నారు. ఇంకా చాలాచోట్ల చెట్లను తొలగించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో తనకు ఇంకా సంతృప్తి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందిరతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లతో నిరంతరం సమీక్షలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఒక వెబ్సైట్ ద్వారా చెట్ల తొలగింపు, ఇతర కార్యక్రమాలకు కావల్సిన కార్మికులను అందిస్తామని, ఎవరైనా వెబ్సైట్లోకి లాగిన్ అయితే వారికి వృత్తి కార్మికులను అందిస్తామని చంద్రబాబు తెలిపారు. విశాఖను పునర్ నిర్మించడానికి అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత అంతా ముందుకు రావాలని కోరారు. విరాళాలు ఇస్తారా? లేక శ్రమదానం చేస్తారా అనేది వారి ఇష్టమన్నారు. హుదూద్ కూడా అసూయ పడేలా విశాఖ నగరాన్ని గతంలో కంటే సుందరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. విద్యుత్, గ్యాస్, తాగునీరు ... వీటన్నింటిని అండర్ గ్రౌండ్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. దీనికోసం కన్సల్టెన్సీలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. ఇన్ఫోసిస్ రూ.5 కోట్లు విరాళం ఇచ్చిందని, ఒక గ్రామాన్ని కట్టడానికి ముందుకు వచ్చినట్లు బాబు తెలిపారు. తుఫానులను తట్టుకునే విధంగా కాలనీల నిర్మాణం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
రూ.10 లక్షలు, పదివేల చీరలు విరాళం
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ హుదూద్ తుఫాను బాధితులకు నగదుతో పాటు, చీరలను విరాళంగా ప్రకటించింది. రూ. పది లక్షల నగదుతో పాటు, పదివేల చీరలను బాధితులకు అందించనుంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదగా ఆదివారం బాధితులకు అందచేయనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారమిక్కడ తెలిపారు. కాగా తుఫాను బాధితులను పరామర్శించేందుకు పొన్నాల నేడు విజయనగరం వెళుతున్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి, సినీనటుడు చిరంజీవి రాజమండ్రి నుంచి విశాఖ బయల్దేరి వెళ్లారు. తుఫాను బాధితులను ఆయన పరామర్శించనున్నారు. -
రైతు బజార్ల వద్ద క్యూ కట్టిన జనాలు
విజయనగరం : విజయనగరం జిల్లాలో నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. నిత్యావసరాల వస్తువులు, కూరగాయల కోసం జనాలు రైతు బజార్ల వద్ద బారులు తీరారు. మరోవైపు బాధితుల అవసరాలను పలువురు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. నిత్యావసరాలను బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయించి అడ్డగోలుగా సొమ్ము చేసుకున్నారు. విజయనగరంలో ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. కేవలం 25 శాతమే విద్యుత్‌ను పునరుద్ధరించారు. దాంతో చాలా గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. ఇక తుఫాను విధ్వంసం ముగిసి ఏడు రోజులు గడుస్తున్నా బాధితులకు మాత్రం సాయం అంతంత మాత్రంగానే ఉంది. తుపాను బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం బియ్యం కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. మొదట్లో 5 లక్షల బాధిత కుటుంబాలకు నిర్ణయించిన మేరకు సరుకులన్నీ ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించినా ఆ మేరకే సేకరణ చేయలేదు. ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించ కపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
విశాఖ : హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అనకాపల్లి నర్సింగరావు పేటలో ఆయన శనివారం ఉదయం పర్యటించారు. తుఫానుకు ధ్వంసమైన ఇళ్లను వైఎస్ జగన్ పరిశీలించారు. బాధితులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. తుఫాను వచ్చి ఏడు రోజులు అయినా ఏ అధికారి తమ వద్దకు రాలేదని ప్రజలు ఈ సందర్భంగా తమ గోడు వెలిబుచ్చారు. తమను పట్టించుకున్న వారే లేరని వారు ఫిర్యాదు చేశారు. -
ఇదేనా మీరు చేస్తున్న సహాయం ?!
-
ఒక విలయం మిగిల్చిన నిశ్చబ్దం
-
గంగపుత్రులకు జగన్ భరోసా
-
3రోజుల్లో వైజాగ్‌కు పూర్తి స్థాయిలో విద్యుత్
-
మత్స్యకారుల తరపున పోరాడతాం: వైఎస్ జగన్
-
మత్స్యకారుల తరపున పోరాడతాం: వైఎస్ జగన్
విశాఖ : హదూద్ తుఫానులో నష్టపోయిన మత్స్యకారుల తరపున గట్టిగా పోరాడతామని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ దాదాపు 400 మరబోట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు చెబుతున్నారని, ఆ నష్టపరిహారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్‌పై 20వేల కుటుంబాలు బతుకుతున్నాయని, ప్రతి ఇంటి పైకప్పులతో పాటు శ్లాబులు కూడా ఎగిరిపోయాని వైఎస్ జగన్ అన్నారు. అయితే నష్టాన్ని అంచనా వేయడానికి ఎవరూ ఇంతవరకూ రాలేదని మత్స్యకారులు చెబుతున్నారని, వెంటనే అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. తక్షణమే ఒక్కో ఇంటికి రూ.5వేలు సాయాన్ని అందించాలన్నారు. అలాగే, చేపల వేటకు వెళ్లే బోటు ఒక్కొక్కటి ఎనిమిది మందిని పోషిస్తుందని, అవన్నీ బాగా పాడైపోయినందున బోటు మరమ్మతుల కోసం కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మత్స్యకారులకు నాలుగు రోజుల్లో ఒక్కపూటే పులిహోర పొట్లాలు అందాయన్నారు. -
విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ
విశాఖ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన మంగళవారం మధ్యాహ్నం సైనిక విమానం ఐఎన్ఎస్ డేగాలో నగరానికి వచ్చారు. తుఫానుకు దెబ్బతిన్న విమానాశ్రయాన్ని మోడీ పరిశీలించారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా విశాఖ కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. కలెక్టరేట్లో మోడీ తుఫాను సహాయక కార్యక్రమాలు, నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. రోడ్డు ప్రాంతంలో ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. మోడీ సుమారు రెండు గంటల పాటు విశాఖలో ఉంటారు. మధ్యాహ్నం 3.20కి ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారు. -
చెప్పిన టైమ్‌కు రాకుంటే పోలీసుల్ని పంపిస్తా
-
చెప్పిన టైమ్‌కు రాకుంటే పోలీసుల్ని పంపిస్తా
విశాఖ : హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ తక్షణమే సరఫరా చేయాలని చంద్రబాబు పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. అలాగే శిబిరాల్లో ఉన్నవారికి మంచినీరు, ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన తెలిపారు. రేపు ఉదయానికి రహదారులను పునరుద్ధరిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాడార్ దెబ్బతినటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చంద్రబాబు తెలిపారు. పక్క జిల్లాల నుంచి మంచినీటిని తెప్పిస్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా రోడ్లపై కూలిన చెట్లను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే కేజీ ఉల్లిగడ్డ అయిదు రూపాయలకే అందిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి అధికారులపై మండిపడ్డారు. సహాయక చర్యల్లో అలక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. తన మీటింగ్‌కు అధికారులు చెప్పిన సమయానికి రాకుంటే పోలీసుల్ని పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. -
విశాఖకు 30000ఆహార పొట్లాల పంపిణి
-
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
-
హుదూద్ దెబ్బకు ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర!
-
రోడ్డు మార్గంలో విశాఖకు చంద్రబాబు
-
విశాఖపై తుపాన్ ప్రభావం తీవ్రం
-
దయచేసి ఎవ్వరూ బయటకు రావొద్దు!
-
మధ్యాహ్నం తీరాన్ని దాటనున్న హుదూద్
-
హుదూద్ తుపాన్ తరుముకొస్తోంది!
-
ప్రయాణికుల కోసం రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 40 రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ హైల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. వివరాలిలా ఉన్నాయి. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు రాజమండ్రి- 0883 - 2420541, 2420543, 2420780, 2420790 విజయవాడ - 0866- 1072, 0866- 2576796,.. -2576796, 2767233, 2767070, 2767040 అనకాపల్లి: 08924- 221698 తుని: 08854-252172 కాకినాడ: 0884-2340592, 0884-2374227 సామర్లకోట: 0884-232882 తాడేపల్లిగూడెం: 08818-226162 ఏలూరు: 08812-232267 నిడదవోలు: 08813-210325 -
37 రైలు సర్వీసులు రద్దు
హైదరాబాద్: హుదూద్ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్‌కోస్ట్ పరిధిలో 37 రైలు సర్వీసులను రద్దు చేయగా, మరో 31 రైలు సర్వీసులను దారి మళ్లించారు. ఈ నెల 11, 12 తేదీల్లో బెంగళూరు-భువనేశ్వర్- ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను, 12వ తేదీ బెంగళూరు-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. రద్దయిన మరికొన్ని రైళ్ల వివరాలు.. రేపు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన తిరుపతి-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్ రేపు రాత్రి 8.30 ని.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన సికింద్రాబాద్-విశాఖపట్న దురంతో ఎక్స్ ప్రెస్ రేపు రాత్రి 8.15 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన సికింద్రాబాద్-విశాఖపట్నం గరీభ్ రధ్ ఎక్స్ ప్రెస్ రేపు రాత్రి 8.30 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన తిరుపతి-విశాఖపట్నం తిరుమల ఎక్స్ ప్రెస్ రేపు రాత్రి 9 గం.లకు విజయవాడ నుంచి బయలుదేరాల్సిన విజయవాడ-రాయగఢ్ పాసెంజర్ రేపు రాత్రి 9.15 గం.లకు మచిలీపట్నం నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం పాసెంజర్ రేపు రాత్రి 11.05 గం.లకు నర్సాపురం నుంచి బయలుదేరాల్సిన నర్సాపూర్-భీమవరం పాసెంజర్ -
హుదూద్ కారణంగా రైలు సర్వీసులు రద్దు?
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్‌గా మారడంతో రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్నం మీదుగా పలు రైళ్లను రద్దు చేసే అవకాశముంది. ఈ నెల 11 నుంచి 13 వరకు పలు రైలు సర్వీసులను పాక్షికంగా లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశముందని రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికులకు ఈ మేరకు సూచనలు చేసింది. -
పెను తుపాన్‌గా మారిన హుదూద్
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ హుదూద్ తుపాన్ పెను తుపాన్‌గా మారింది. దీనివల్ల ఉత్తర ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు పొంచి ఉంది. విశాఖపట్నం జిల్లాలో 57 గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచిఉందని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. 30 వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. 220 మంది సైనికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుందని తెలిపారు. విశాఖలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సహాయ కార్యక్రమాల కోసం నౌకలు, హెలీకాప్టర్లను సిద్దంగా ఉంచారు. -
హుదూద్.. శాంతించుమా?
విశాఖపట్నం: రాష్ట్రాన్ని వణికిస్తున్న హుదూద్ తుఫాన్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను భయపెడుతోంది. తుఫాన్ కారణంగా తాము టీమిండియా-వెస్టిండీస్ మ్యాచ్ చూస్తామో, లేదోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హుదూద్ తుపాన్ శాంతిస్తే బాగుండునని అనుకుంటున్నారు. ఈ నెల 14న విశాఖపట్నంలో వెస్టిండీస్-భారత్‌ల మధ్య మూడో వన్డే జరగనుంది. హుదూద్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మ్యాచ్ పై సందిగ్దం నెలకొంది. 14వ తేదీ ఒక్క రోజు వర్షం లేకపోయినా మ్యాచ్‌ను నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారులు చెబుతున్నారు. ఆ ఒక్క రోజు వర్షం రాకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. -
ఓ పక్షి పేరు మీద.. హుదూద్ తుఫాను!
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాలను వణికిస్తున్న హుదూద్ తుఫానుకు ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ప్రళయ భీకరంగా దూసుకొస్తున్న ఈ తుఫానుకు వాస్తవానికి ఒక అందమైన పక్షి పేరు పెట్టారు. ఈ పక్షి సాధారణంగా ఒమన్, ఇతర గల్ఫ్ దేశాల్లో కనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం ఈసారి తుఫానుకు పేరుపెట్టే అవకాశం ఒమన్‌కు లభించింది. బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రంలో వచ్చే తుఫాన్లకు ఆసియా దేశాలు పేర్లు పెడతాయి. ఒకేసారి రెండు సముద్రాలలోను తుఫాను ఏర్పడితే అప్పటికే ఇచ్చిన పేర్లలోంచి ఒకదాన్ని ఎంచుకుంటారు. అలా ఈసారి ఒమన్‌కు అవకాశం రావడంతో, ఆ దేశం ఇప్పటికే సూచించిన హుదూద్ పేరును ఖరారు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా తుఫాన్లకు పేర్లు పెడుతూనే ఉంటారు. దాన్ని త్వరగా గుర్తుపట్టి, హెచ్చరికలను అర్థం చేసుకోడానికి వీలుగా ఉంటుందనే వీటికి పేర్లు పెడతారు. దాదాపు ఒక శతాబ్దం క్రితం కరేబియన్ దీవుల్లో ఇలా తుఫాన్లకు పేర్లు పెట్టడం మొదలైంది. అయితే, ఆసియా దేశాల్లో మాత్రం 2000 సంవత్సరం వరకు తుఫాన్లకు పేర్లు పెట్టలేదు. అందుకే 1996 నవంబర్ 6వ తేదీన కోనసీమను వణికించిన తుఫానుకు గానీ, అలాగే 1999 అక్టోబర్ 29న ఒడిశా తీరాన్ని అతలాకుతలం చేసిన తుఫానుకు గానీ పేర్లు లేవు. -
హుదూద్ తుఫాన్ ఏలా ఉండబోతుంది?