విశాఖ : విశాఖ జిల్లా వ్యాప్తంగా దీపావళి మందుగుండు సామాగ్రి, బాణాసంచా దుకాణాల లైసెన్స్లను రద్దు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ యువరాజ్ హెచ్చరించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీపావళికి విశాఖ ప్రజలు బాణాసంచా కాల్చవద్దని సూచించిన విషయం తెలిసిందే. హుదూద్ బీభత్సంతో ఎక్కడికక్కడ చెట్లు కూలటంతో పాటు, నగరంలో చెత్త కూడా పెద్ద ఎత్తున పేరుకుపోవటంతో బాణాసంచా కాల్చితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు దీపాలు పెట్టి పండుగ జరుపుకోవాలని ఆయన తెలిపారు.
బాణాసంచా దుకాణాల లైసెన్స్ల రద్దు
Published Sat, Oct 18 2014 12:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement