హైదరాబాద్: హుదూద్ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్ర మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్కోస్ట్ పరిధిలో 37 రైలు సర్వీసులను రద్దు చేయగా, మరో 31 రైలు సర్వీసులను దారి మళ్లించారు. ఈ నెల 11, 12 తేదీల్లో బెంగళూరు-భువనేశ్వర్- ప్రశాంతి ఎక్స్ప్రెస్ను, 12వ తేదీ బెంగళూరు-యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు.
రద్దయిన మరికొన్ని రైళ్ల వివరాలు..
రేపు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన తిరుపతి-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 8.30 ని.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన సికింద్రాబాద్-విశాఖపట్న దురంతో ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 8.15 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన సికింద్రాబాద్-విశాఖపట్నం గరీభ్ రధ్ ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 8.30 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన తిరుపతి-విశాఖపట్నం తిరుమల ఎక్స్ ప్రెస్
రేపు రాత్రి 9 గం.లకు విజయవాడ నుంచి బయలుదేరాల్సిన విజయవాడ-రాయగఢ్ పాసెంజర్
రేపు రాత్రి 9.15 గం.లకు మచిలీపట్నం నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం పాసెంజర్
రేపు రాత్రి 11.05 గం.లకు నర్సాపురం నుంచి బయలుదేరాల్సిన నర్సాపూర్-భీమవరం పాసెంజర్