చెప్పిన టైమ్కు రాకుంటే పోలీసుల్ని పంపిస్తా | chandrababu naidu reviews hudhud cyclone affected areas | Sakshi
Sakshi News home page

చెప్పిన టైమ్కు రాకుంటే పోలీసుల్ని పంపిస్తా

Published Tue, Oct 14 2014 11:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

చెప్పిన టైమ్కు రాకుంటే పోలీసుల్ని పంపిస్తా

చెప్పిన టైమ్కు రాకుంటే పోలీసుల్ని పంపిస్తా

విశాఖ : హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నేవీ, ఎయిర్ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  పెట్రోల్, డీజిల్ తక్షణమే సరఫరా చేయాలని చంద్రబాబు పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. అలాగే శిబిరాల్లో ఉన్నవారికి మంచినీరు, ఆహారం అందిస్తున్నట్లు చెప్పారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రానికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన తెలిపారు. రేపు ఉదయానికి రహదారులను పునరుద్ధరిస్తామన్నారు.  నిత్యావసర వస్తువుల కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాడార్ దెబ్బతినటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని చంద్రబాబు తెలిపారు. పక్క జిల్లాల నుంచి మంచినీటిని తెప్పిస్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా రోడ్లపై కూలిన చెట్లను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే కేజీ ఉల్లిగడ్డ అయిదు రూపాయలకే అందిస్తామన్నారు.

చంద్రబాబు నాయుడు మరోసారి అధికారులపై మండిపడ్డారు. సహాయక చర్యల్లో అలక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. తన మీటింగ్కు  అధికారులు చెప్పిన సమయానికి రాకుంటే పోలీసుల్ని పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement