సాక్షి, హైదరాబాద్: 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. చంద్రబాబు ఏమన్నారంటే..
►కరోనా పోయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలందరిని కలిసి కష్టాలను తీర్చేందుకు నడుం బిగిస్తా.
►పార్టీకి కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది. పార్టీలో కమిటీలన్నింటిని పూర్తిచేస్తున్నాం. యువతకు ప్రాధాన్యమిస్తున్నాం. సమర్థమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తున్నాం.
►పార్టీలో కష్టపడి పనిచేసేవారికి పెద్దపీట వేస్తాం. నూతన నాయకత్వాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే తెలంగాణ కేబినెట్ అంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు.
►టీడీపీ నాయకులను తీసుకుని మనపైనే విమర్శలు చేయిస్తున్నారు.
►ఉపాధి హామీ పథకం బిల్లుల బకాయిలు 24 శాతం వడ్డీతో çఇప్పించే బాధ్యత నాది.
►ఏడాదిన్నరపాటు నామీద అనేక ఆరోపణలు చేశారు. కొండను తవ్వి ఎలుక వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ నేడు చేతగాని పాలనతో చేతులెత్తేశారు.
►రాజోలులో జనసేన నుంచి గెలిచిన వ్యక్తి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ పెడితే కుట్ర పూరితంగా జగన్ బీసీల్లో చీలికలు తీసుకువచ్చారు. నేడు బహిరంగంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వమని చెబుతున్నారు.
►కోర్టులపైనే ఇష్టానుసారంగా జగన్ వర్గం వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు, లా అండ్ అర్డర్ ఎక్కడ తప్పినా కోర్టులు కలుగజేసుకుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. మేము లేకపోతే దేశంలో అరాచకం వస్తుందని హైకోర్టు చెప్పింది.
►దేశంలో మహిళలపై ఎక్కువ దాడులు ఏపీలో జరగటం జగన్ రాక్షస పాలనకు అద్దం పడుతుంది.
►కరోనా నుంచి కాపాడుకోవడానికివెబ్‌సైట్ ప్రారంభిస్తున్నాం.
కరోనా పోయిన తర్వాత రాష్ట్రమంతా తిరుగుతా
Published Sat, Oct 3 2020 6:41 AM | Last Updated on Sat, Oct 3 2020 6:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment