రిపేర్లలో ‘వసతి’
► విడుదల చేసిన నిధుల వినియోగానికి ఓపెన్ చేయని టెండర్లు
► బీసీ సంక్షేమ వసతి గృహాల మెరుగులకు కానరాని దిక్కు దివాణం
విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్ సమయంలో పాడైన జిల్లాలోని వసతి గృహాలకు మరమ్మతులు చేయాలని కొన్నాళ్ల క్రితం మంజూరైన నిధులను ఇంకా ఉపయోగించకపోవడం విచారకరం. ఇందుకోసం జిల్లాకు కేటారుుంచిన రూ. 81.20 లక్షల నిధులను వినియోగించకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో సౌకర్యాల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏడు బాలికలు, ఒక బాలుర వసతి గృహాల కోసం రూ. 81.20లక్షలు మూడు నెలల క్రితం మంజూరయ్యారుు. వీటికి టెండర్లు పిలిచి వాటిని అట్టేపెట్టారు తప్ప నేటికీ తెరవలేదు. కొన్ని చోట్ల తెరిచినా ఆ పనులు జరగలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లాలోని దేవుపల్లి, చీపురుపల్లి, మెరకముడిదాం, కొత్తవలస, గోవిందపురం, విజయనగరం, ముక్కాం, చీపురుపల్లి ఇంటిగ్రేటెడ్ వసతి గృహాలకు రూ.లక్షా 50వేల నుంచి రూ. 16లక్షల వరకూ మరమ్మతులకు నిధులు మంజూరయ్యారుు. వీటిలో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, ఇతర మరమ్మతులను వెంటనే బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా నేటికీ వాటి గురించి పట్టించుకోలేదు. వసతి గృహాల్లో విద్యార్థులకు కేటారుుంచిన అల్మరాలు, కప్‌బోర్డులు ఎప్పుడో పాడైపోయారుు. దీంతో వాటిని వినిపయోగిస్తున్న విద్యార్థులు గోనెసంచులను వాటికి అడ్డంగా పెట్టుకున్నారు. అలాగే మైనర్ రిపేర్ల కోసం జిల్లాలోని పది వసతి గృహాలకు రూ.8.70లక్షల నిధులు మంజూరయ్యారుు. వీటిని కూడా అదేవిధంగా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇప్పటికీ ఆయా వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టలేదు. విజయనగరం లో కాట వీధిలోని బీసీ వసతి గృహంలో మోటారు లేక మరుగుదొడ్లకు ఆరుబయట నుంచి నీటిని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక బోరు పాడైపోరుుంది. వాటర్ ట్యాంకు కూలిపోరుు రెండున్నరేళ్లు కావస్తోంది.
అలాగే ద్వారబందాలు పాడయ్యారుు. తలుపులు ఊడిపోయారుు. ఇంకుడు గుంతకున్న పైపులైన్లను పాడు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. చిన్న మరమ్మతులకు నిధులు మంజూరైన వసతిగృహాల్లో నెల్లిమర్ల, పూసపాటిరేగ, బొబ్బిలి, బాడంగి, దత్తిరాజేరు, పార్వతీపురం, విజయనగరం, జొన్నవలస, గరుగుబిల్లి, గంట్యాడ తదితర వసతి గృహాలున్నారుు. కానీ నేటికీ ఈ మరమ్మతులను చేపట్టలేదు.
త్వరలోనే ప్రారంభిస్తాం
మరమ్మతులకు నిధులు మంజూరయ్యారుు. ఈ నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేరుుంచి మిగతా మరమ్మతులకు ఆ తరువాత ప్రాధాన్యమిస్తాం. ఆయా ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతున్నాం. మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభించి వసతి గృహాల్లో మరమ్మతులు పూర్తి చేరుుస్తాం - సీహెచ్ హరిప్రసాద్, డీబీసీడబ్ల్యూ ఓ