పెను తుపాన్గా మారిన హుదూద్ | Hudhud turns as super cyclone | Sakshi
Sakshi News home page

పెను తుపాన్గా మారిన హుదూద్

Published Fri, Oct 10 2014 6:29 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

పెను తుపాన్గా మారిన హుదూద్

పెను తుపాన్గా మారిన హుదూద్

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ హుదూద్ తుపాన్ పెను తుపాన్గా మారింది. దీనివల్ల ఉత్తర ఆంధ్రప్రదేశ్కు ముప్పు పొంచి ఉంది. విశాఖపట్నం జిల్లాలో 57  గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచిఉందని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. 30 వేలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.

తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. 220 మంది సైనికులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుందని తెలిపారు. విశాఖలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సహాయ కార్యక్రమాల కోసం నౌకలు, హెలీకాప్టర్లను సిద్దంగా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement