
సాక్షి,విశాఖపట్నం: నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు,దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉంది. తర్వాతి 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉత్తరం దిశగా పయనించే ఛాన్సుంది.
రానున్న మూడు రోజులు పాటు ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి ఒకటి రెండు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.రాబోయే మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
