deep depression
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి,హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం బలపడి శనివారం(ఆగస్టు31) వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. రాజధాని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. -
బంగాళాఖాతంలో వాయుగుండం! తుపానుగా బలపడే అవకాశం?
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత దిశ గమనం బట్టి ఏపీపై కురిసే వర్షాలపై అంచనా. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని, మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. చదవండి: దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు -
28 ఏళ్ల తర్వాత మార్చిలో వాయుగుండం
సాక్షి, అమరావతి బ్యూరో: నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజనులోను, ఈ సీజన్లకు ముందు, తర్వాత అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడడం సర్వసాధారణం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. అలాగే, నైరుతి రుతు పవనాల సీజనుకు ముందు ప్రారంభమయ్యే ప్రీ మాన్సూన్ సీజను (ఏప్రిల్, మే)లోను, ఈశాన్య రుతుపవనాలు ముగిసే పోస్ట్ మాన్సూన్ సీజనుగా పేర్కొనే జనవరిలోనూ అడపాదడపా వాయుగుండాలు, తుపాన్లు సంభవిస్తాయి. కానీ, మార్చి ఆరంభంలోనే అల్పపీడనం, వాయుగుండం వంటివి ఏర్పడడం అరుదైన విషయమే. ఇలాంటి ప్రత్యేకత సంతరించుకునేలా ఈనెల 2న దక్షిణ మధ్య బంగాళాఖాతం, భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగానూ మారనుంది. ఇటీవల కాలంలో మార్చి ఆరంభంలో ఇలాంటివి ఏర్పడిన దాఖలాల్లేవు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1994 మార్చి 21న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఆపై వాయుగుండంగా మారింది. ఆ తర్వాత అంటే గత 28 ఏళ్లలో ఇప్పటివరకు మార్చిలో అల్పపీడనం గాని, వాయుగుండంగానీ ఏర్పడిన పరిస్థితిలేదు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటాన్ని వాతావరణ నిపుణులు అరుదైనదిగా పేర్కొంటున్నారు. ‘నైరుతి’ సీజన్లో మంచి వర్షాలు ఇక సాధారణంగా ఏప్రిల్ నుంచి సముద్ర ఉపరితల జలాలు వేడెక్కుతుంటాయి. ఫలితంగా అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడటానికి దోహదపడతాయి. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇవి నైరుతి రుతుపవనాల సీజనులో మంచి వర్షాలు కురవడానికి సానుకూల సంకేతంగా భావిస్తారు. వీటిని లానినా పరిస్థితులుగా పేర్కొంటారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో లానినా పరిస్థితులుండడమే అకాల అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా బలపడటానికి ఒక కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరాన్ని తాకి రీకర్వ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భూమధ్య రేఖకు సమీపంలో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. మార్చి ఆరంభంలోనే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడం అరుదైన పరిణామమని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. -
జూన్ 5న నైరుతి రుతుపవనాల రాక
సాక్షి, న్యూఢిల్లీ: కేరళకు నైరుతి రుతపవనాలు ఈ ఏడాది నాలుగైదు రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. జూన్ 5న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ఈ ఏడాది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతములో మే 16 వ తేదీ సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రారంభంలో మే 17 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, తరువాత మే 18 నుండి 20 వ తేదీలలో ఉత్తర ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. రాగల 48 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ (శుక్రవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 కిలో) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40కిలోమీటర్ల) తో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. -
తెలంగాణ, రాయలసీమ మీదగా అల్పపీడన ద్రోణి
హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షణి తమిళనాడు వరకూ ఏర్పడింది. అలాగే తెలంగాణ, రాయలసీమ మీదగా ఈ ద్రోణి విస్తరించటంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పాడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. -
రాష్ట్రానికి పొంచి ఉన్న లెహర్ తుఫాను గండం!!
పై-లీన్ వచ్చింది, సర్వనాశనం చేసింది. హెలెన్ వచ్చింది. తీవ్ర నష్టాలు మిగిల్చి వెళ్లింది. ఈ రెండూ సరిపోవన్నట్లు ఇప్పుడు కొత్తగా మరో తుఫాను వస్తోంది. అవును.. రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ కొత్త తుఫానుకు 'లెహర్' అని పేరు పెట్టారు. ఇది మంగళవారంలోగా వాయవ్య దిశగా మన రాష్ట్రంవైపు పయనించే అవకాశం ఉంది. గురువారం నాడు ఇది తీరాన్ని దాటొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం నాడు తీరాన్ని దాటిన హెలెన్ తుఫాను కన్నా ఈ లెహర్ తుఫాను మరింత ప్రమాదకరమైందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోర్ట్బ్లెయిర్కు దక్షిణ ఆగ్నేయంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం, ఈ రాత్రికే తుఫానుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
తీవ్రవాయుగుండంగా మారనున్న వాయుగుండం
-
తీవ్రవాయుగుండంగా మారనున్న వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రేపు చెన్నై - ఒంగోలు మధ్య తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయిని, అలాగే గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్ల వద్దని మత్స్యకారులకు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని నౌకాశ్రయాల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో తీవ్రతుఫాను కేంద్రీకృతం
పై-లీన్ ఇప్పటికీ పెను తుఫానుగానే ఉంది. గడిచిన ఆరు గంటలుగా ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరింత ఉత్తరదిశగా పయనించి, ఈరోజు మధ్యాహ్నానికి తుఫానుగాను, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగాను మారుతుందని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించిన వాతావరణ సూచనలో తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రం మీద ఉత్తర కోస్తాలో తీవ్రంగా ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గాలుల వేగం తగ్గింది. ఉత్తరాంధ్ర, ఒడిశాలలో ప్రస్తుతం గాలుల వేగం గంటకు 110-120 కిలోమీటర్లుగా ఉంది. ఇది ఈరోజు మధ్యాహ్నానికి గంటకు 80-90 కిలోమీటర్లకు తగ్గుతుంది. విశాఖలో సముద్రం ఇంకా రఫ్ గానే ఉన్నా, నిన్నటితో పోలిస్తే బాగా తగ్గింది. మధ్యాహ్నానికి ఇంకా శాంతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల పాటు ఈ ప్రభావం ఇంకా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గాలుల వేగం, వర్షాలు అన్నీ తగ్గుతాయి.