హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షణి తమిళనాడు వరకూ ఏర్పడింది. అలాగే తెలంగాణ, రాయలసీమ మీదగా ఈ ద్రోణి విస్తరించటంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రానికి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పాడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి.