హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్ర ఉలిక్కి పడింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అల్లకల్లోలం అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంటకు 190 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో వీచిన పెను గాలులు బీభత్సం సృష్టించాయి. తుపాన్ గురించి హెచ్చరికలు అందించే విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం కూడా మూగబోయింది. భారీ వర్షంతో కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. భీకర గాలులకు భవనంలోని కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. తుపాన్ హెచ్చరికల కేంద్రానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి