North andhra
-
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
‘నైరుతి’ మందగమనం!
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో ప్రభావం చూపుతున్న నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒకింత మందగమనంలో ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కోసారి ఉపరితలంలో అధిక పీడన ద్రోణి (రిడ్జ్) ఏర్పడుతుంటుంది. ఇది అల్పపీడన ద్రోణికి విరుద్ధం. అంటే అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడు ఉపరితలంలో గాలులు గడియారపు ముల్లు తిరిగే దిశ (క్లాక్ వైజ్ డైరెక్షన్)లో తిరుగుతూ మేఘాలు, వర్షాలకు కారణమవుతాయి. అదే అధిక పీడన ద్రోణి ఏర్పడితే గాలులు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఫలితంగా అరకొర మేఘాలు ఏర్పడడమే కాకుండా సూర్యరశ్మి నేరుగా కిందకు ప్రసరిస్తుంది. దీంతో ఉష్ణతీవ్రత పెరగడంతో పాటు వర్షాలకు అడ్డంకులేర్పడతాయి. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రా విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఓఎస్ఆర్యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల విజయనగరం వరకు విస్తరించిన రుతుపవనాలు చురుకుదనం సంతరించుకోకుండా స్తబ్దుగా ఉన్నాయన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా.. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులే పడుతున్నాయని తెలిపారు. పైగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. మరో రెండు మూడు రోజుల్లో అధిక పీడన ద్రోణి బలహీనపడుతుందని చెప్పారు. ఆ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటాయని.. దీంతో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వివరించారు. మూడు రోజులపాటు వర్షాలు..మరోవైపు రానున్న మూడు రోజులు రాయలసీమ, కోస్తాంధ్రల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే బుధవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే అల్లూరి, పల్నాడు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. -
ఉత్తరాంధ్రలో అధికారుల వసతి ఏర్పాట్లకు కమిటీ
సాక్షి, అమరావతి: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినందువల్ల అధికార యంత్రాంగం కూడా ఇందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో ముఖ్యమంత్రి, మంత్రులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల అమలు తీరును నిరంతరం సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. రాత్రి పూటఆయన అక్కడే బస చేయనున్నారు. వివిధ శాఖలపై విశాఖలోనే సమీక్షలు చేసే అవకాశం ఉంది. అందువల్ల సీనియర్ అధికారులు, జిల్లా పరిపాలన అధికారులు సీఎంకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాల్సి వస్తుంది. కొంతమంది సీనియర్ అధికారులను రాత్రి పూట కూడా విశాఖలో బస చేయమని కోరవచ్చు. ఈ కారణంగా వీలైనంత త్వరగా తగిన వసతిని గుర్తించి నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్–హెఆర్‌ఎం) కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా తగిన వసతి గుర్తించి సాధారణ పరిపాలన శాఖకు నివేదికను సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి పూట తగిన రవాణా, వసతి ఉండేలా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో బస చేయడానికి తగ్గ ప్రాంతాలను గుర్తించాలని పేర్కొన్నారు. అభివృద్ధికి అవసరం.. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలను ఉత్తరాంధ్రగా పిలుస్తారు. ఈ ప్రాంతం ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, కనెక్టివిటి మొదలైన సూచికల్లో వెనుకబడి ఉంది. గిరిజన జనాభా అత్యధికంగా ఉంది. ఉత్తరాంధ్రలో నాలుగు జిల్లాలను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు కింద కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా నీతి ఆయోగ్ గుర్తించింది. ఉత్తరాంధ్ర చారిత్రకంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక అభివృద్ధి ప్రోత్సహకాలను పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం, సమీక్షించడంతో పాటు స్థానిక అవసరాలను తెలుసుకోవడం వంటివి అధికారయంత్రాంగం చేయాల్సి ఉంటుంది. రాత్రి పూట బస చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రవాణా, వసతి చూసుకోవాల్సిందిగా ఆయా శాఖలు, శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఎట్టకేలకు వానలు!
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల రోజులుగా హిమాలయాల్లోనే తిష్ట వేసిన రుతుపవన ద్రోణి అక్కడి నుంచి దక్షిణాదికి మారడం, విదర్భ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి, దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా శనివారం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని తెలిపింది. సాధారణంగా ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉండి, వర్షాలు విస్తారంగా కురుస్తాయి. అయితే, ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. ఒకట్రెండు చోట్ల అదీ స్వల్పంగానే వర్షాలు కురిశాయి. వర్షాలు కురవాలంటే అల్పపీడన ద్రోణులు గానీ, ఉపరితల ఆవర్తనాలు గానీ, బంగాళాఖాతంలో అల్పపీడనాలు గానీ ఏర్పడాలి. వాటివల్ల నైరుతి రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయి. కానీ దాదాపు నెల రోజులుగా ద్రోణులు, ఆవర్తనాల జాడ లేదు. వర్షాలకు దోహదపడే నైరుతి రుతుపవనాల ద్రోణి కూడా మూడు వారాలకు పైగా దక్షిణాది వైపునకు రాకుండా హిమాలయాల ప్రాంతంలోనే ఉండిపోయింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఆగస్టు నెల వర్షపాతం సాధారణంకంటే 54 శాతం, నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభం నుంచి ఆగస్టు ఆఖరు వరకు చూస్తే 25 శాతం తక్కువగా నమోదైంది. ఈ తరుణంలో రుతుపవన ద్రోణిలో కదలిక రావడం, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురిసేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. దాదాపు నెలరోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలకు ఈ వానలు ఎంతగానో ఊరట కలిగించనున్నాయి. -
బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. బుధవారానికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం మధ్యలో పయనిస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో మూడురోజులు కొనసాగుతాయని ఐఎండీ మంగళవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, పశి్చమ గోదావరి, ఎనీ్టఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, ఎస్పీఎస్సార్ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు, తీరం వెంబడి 45 నుంచి 55.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మూడురోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మంగళవారం భారీవర్షాలు కురిశాయి. ఎనీ్టఆర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండలో అత్యధికంగా 10.2, విశాఖ రూరల్‌లో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
మూడు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి.. ఒడిశా సరిహద్దు తీర ప్రాంతాల్లో విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించింది. మరోవైపు రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 23న అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. -
విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు
సొంత ప్రాంతంపై ఎటువంటి వారికైనా మమకారం ఉంటుంది. తమ ప్రాంత ప్రగతికి అవకాశం వస్తే హర్షిస్తారు.. స్వాగతిస్తారు.. సహకరిస్తారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిలో అవేవీ మచ్చుకైనా లేవు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప తన ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదన్నట్లు విర్రవీగుతున్నారు. పదవులు ఇచ్చిన అధినేత మోచేతి నీళ్లు తాగుతూ.. వారి పన్నాగాలకు వంతపాడుతూ సొంత ప్రాంతానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి బాటలు వేసే విశాఖ రాజధానికి అడ్డం పడుతూ.. విషం కక్కుతున్నారు. అమరావతే అజెండాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెగేసి చెబుతూ ఉత్తరాంధ్రకు ద్రోహం తలపెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలు బాగు కోరకుండా.. విశాఖ రాజధాని వద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలు మండి పడుతున్నారు. గడిచిన ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని గెలిపించి తప్పు చేశామని టెక్కలి నియోజకవర్గ ఓటర్లు అంతర్మథనం చెందుతున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిగానే తాను ఎన్నికలకు వెళ్తానని అచ్చెన్నాయుడు ఓటర్లకు సవాల్ విసురుతున్నారు. ప్రజల కంటే తమ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, అమరావతిలో వారికున్న భూములే ముఖ్యమని చెప్పకనే చెబుతున్నారు. విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కోరుతున్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి తమ గళం విప్పుతున్నారు. కానీ టీడీపీ నేతలకు మాత్రం ఇది రుచించడం లేదు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడానికైనా సిద్ధమవుతున్నారే తప్ప అమరావతిని వదులుకునేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ రైతుల యాత్రకు మద్దతునిస్తూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. జిల్లాలో అచ్చెన్నాయుడు అండ్ కో తమ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. దద్దమ్మలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా మూడు రాజధానుల కోసం తాము రాజీనామా చేస్తాం.. అమరావతి కోసమని రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడుకు సవాల్ కూడా విసురుతున్నారు. (క్లిక్: జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి) ఓట్లేసిన ప్రజలు దద్దమ్మలా... మీకు ఓటేసినందుకు ప్రజలు దద్దమ్మలా కన్పిస్తున్నారా.. అచ్చెన్నాయుడు? చంద్రబాబు పంచన చేరి ఆయన చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెలుగుదేశం నాయకులంతా ప్రయత్నిస్తున్నారా? ఇంతకాలం వివిధ సందర్భాల్లో రాజధాని పేరిట జరిగిన ఏర్పాటులో చాలా కోల్పోయాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉత్తరాంధ్ర ద్రోహులే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర పట్టభధ్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజలే బుద్ధి చెబుతారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖను పాలనా రాజధానిగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి ఇక్కడి టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించాల్సింది పోయి వ్యతిరేకించడం దారుణం. చంద్రబాబుతో సహా ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులంతా అభివృద్ధి నిరోధకులు. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. నరసన్నపేట: మూడో రోజు రిలే దీక్షలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రజల మనోభావాలతో అచ్చెన్న ఆటలు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అచ్చెన్నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కాకుండా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అచ్చెన్నాయుడు తాపత్రయపడుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే విశాఖలో పరిపాలనా రాజధాని వద్దని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలడా..! టెక్కలి: వికేంద్రీకరణకు మద్ధతుగా నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆత్మ సాక్షిగా ముందుకు సాగాలి.. ఉత్తరాంధ్ర నాయకులు ఆత్మసాక్షిగా ముందుకు సాగాలి. ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలి. విశాఖపట్నం రాజధానిగా అవకాశం లభించింది. ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్, పూర్వపు వైస్ చాన్స్‌లర్, ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ అభిమానం అందరికీ ఉంటుంది మన ప్రాంతం అన్న అభిమానం అందరికీ ఉంటుంది. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతున్నారు. పార్టీకి సైతం నచ్చజెప్పేలా నాయకులు ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రగతికి విశాఖపట్నం రాజధాని కావటం మంచి అవకాశం. దీన్ని స్వాగతించాలి. – ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం పూర్వపు రిజిస్ట్రార్ -
ఇది ఉత్తరాంధ్ర మనోభావాలపై దండయాత్ర!
అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలు. ఏ కారణంతో రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించినా సారంలో అది అప్రజాస్వామికం. గ్రామస్థాయి నుంచి కేంద్రం దాకా అధికార వికేంద్రీకరణ రాజ్యాంగ నిర్దేశనమే (అదెంత సజావుగా అమలవుతున్నదనేది వేరే చర్చనీయాంశం). ఒకానొక తొందరపాటు, తప్పుడు నిర్ణయం కారణంగా మన తెలుగునేల విభజన జరగాల్సినంత సజావుగా, సశాస్త్రీయంగా జరగలేదు. నదీజలాల పంపిణీ, ఆస్తుల పంపిణీ వంటి అనేకాంశాలను ఇరుపక్షాలతో విస్తృత చర్చలు జరిపి వారి అంగీకారంతో విభజన కార్యక్రమం పూర్తి చేయాల్సివుండగా అలా జరగలేదు. అలా జరిగితే ఇప్పటి స్థితి రెండు రాష్ట్రాలకూ వుండేది కాదు. అందులో ఆంధ్రప్రదేశ్‌గా మిగిలిన మన రాష్ట్రానికి తొలినాటి నుండీ అన్యాయం జరిగింది. అలా జరగటానికి నాటి కేంద్రపాలకు లెంత కారణమో... విభజనను వ్యతిరేకిస్తున్నామంటూ డ్రామాలాడిన రాజకీయ పార్టీలన్నీ అంతే కారణం! విభజన జరుగుతున్న సమయంలోనూ మన నేతలు... విభజన జరిగితే డిమాండ్ చేయాల్సిన అంశాలను గురించి ఆలోచించలేదు. ఆనాటికి రాజకీయంగా పలుకుబడి కలిగిన చంద్రబాబయితే విభజన రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావటం గురించే ఆలోచించారు తప్ప, రాష్ట్రానికి రావాల్సిన వాటిగురించి ఆలోచించలేదు. చివరికి ఆయనాశించినట్టే ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిపోయారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో వుంటూ రాజధాని నిర్మించాల్సి నది పోయి, హఠాత్తుగా హైదరాబాద్ వదిలేసి తాత్కాలిక రాజధానిని నిర్మించి... శాశ్వత రాజధానిని ప్రపంచానికే ఆదర్శంగా నిర్మిస్తానన్నాడు. చంద్రబాబు రాజకీయనేత రూపంలో వున్న కార్పొరేట్ వ్యాపారి! ఆయనకు గల ఈ లక్షణ ఫలితాలే అమరావతి రాజధాని పేరిట భారీ భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలతో బేరసారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ! రాజధాని ఎంత పెట్టుబడితో ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పూర్తవుతుందో, పూర్తయితే ఎవరికి ప్రయోజనం అనేవి ప్రజలందరిలో కలిగిన ప్రశ్నలు! వాటికి జవాబు దొరక్కే వైసీపీ ప్రభుత్వాన్ని పజలు ఎన్నుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తనదైన పంథాలో గత ప్రభుత్వ విధానాలన్నీటినీ పునః పరిశీలన చేస్తూనే, కొత్తవాటిని ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గానీ, సచివాలయాలుగానీ, వలంటీర్ వ్యవస్ధగానీ, ఇచ్చిన ఉద్యోగాలుగానీ (లోపాలుంటే సరిదిద్దే ఉద్యమాలు చేయొచ్చు) ప్రజావ్యతిరేకం అనగలమా? గ్రామస్థాయికి పాలనా వ్యవస్థను తీసుకొచ్చిన నేపథ్యమే రాజధానిని వికేంద్రీకరించి.. పాలనా కేంద్రాలను వెనుకబడిన రాయలసీమకూ, ఉత్తరాంధ్రకూ దగ్గర చెయ్యాలనే ఆలోచనకు తెరలేపింది. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ విశాఖపట్టణం దగ్గరగా ఉంటుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి సులువుగా తమ అవసరాలను నివేదించుకోగలరు. అలాగే నిరసనగళాలు విన్పించగలరు. ఇందుకోసం సుదూర అమరావతికి పోనవసరం ఉండదు. పాలనా కేంద్రం ఒకటి వస్తోందంటే కేవలం పాలనా భవంతులే కావుగా, అనుబంధ శాఖలు కూడా వస్తాయిగా. అప్పటిదాకా లేనటువంటి అనేకానేక కార్యాలయాలు, వాటి అనుబంధ శాఖలు, వాటితో వాణిజ్య సంబంధ రంగాలు అనేకం కొత్తగా చేరుతాయి. వెనుకబాటుకు గురికాబడిన ఉత్తరాంధ్ర ముఖచిత్రానికి రూపుదిద్దుకోబోయే నూతన సౌభాగ్యరేఖను ఇవన్నీ నిర్దేశించేవే కదా! ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం పాలనాకేంద్రం కావటమనేది ఒక వరం లాంటిది. ఏ కారణంతో అయినా దీనిని వ్యతిరే కించడం ఉత్తరాంధ్రకు అన్యాయం చేయడమే. రాబోయే పాలనాకేంద్రం పనితీరును లాభదాయకం చేసుకోడానికీ, ప్రజాప్రయోజనకారి చేసుకోడానికీ నివేదనల నుంచి నిరసనలదాకా అన్నింటినీ వినియోగించే వీలు ఎలాగూ ఉత్తరాంధ్రులకు వుంటుంది. ఇంటి ముంగిటకు పాలనా కేంద్రం వస్తోన్న సమయంలో.. దీనిని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు అంగీకరించరు. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటు కాదది, వారి కమిట్మెంట్! ఈ సందర్భంలో అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర (అందులో నిజమైన రైతులెందరు? ఆసాములెందరు? వెనకున్న రాజకీయపార్టీ యేమిటి అన్న ప్రశ్నలు వేరే చర్చ) ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచే యాత్ర అవుతుందే తప్ప వేరు కాదు. అమరావతిలో భూములిచ్చిన రైతులు తమకు నష్టం లేకుండా (ఇచ్చిన భూములకు తగ్గ విలువ) గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేయొచ్చు తప్ప, మరే ప్రాంతానికీ రాజధానినీ, పాలనా కేంద్రాలనూ వికేంద్రీకరించకూడదని అనగూడదు. రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ పాలనా కేంద్రాలకు చేరువగా వుండకూడదని అనకూడదు. ఇప్పటికే ప్రాంతాల మధ్య పాలకుల పుణ్యాన అసమానతలు ఏర్పడ్డాయి (ఇవే తెలంగాణ వేర్పాటుకూ కారణాలు). ఇంకా అదే నమూనా రాజకీయాలు నడపడం వెనుకబడిన ప్రాంతాల ఆందోళనలకు దారితీస్తాయి. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) అమరావతి రైతులు కోర్టులకు వెళ్లారు, మంచిదే. తాత్కాలిక రాజధాని దగ్గర నిరసనోద్యమాలు నడిపారు. తమ ఆందోళనలను లోకానికి వెల్లడించారు. అది వారి హక్కు. కానీ, ఇప్పుడు అరసవిల్లి యాత్ర ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల మీద దండయాత్ర! ఉత్తరాంధ్రులు కోరుకునే పాలనా కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర నేల మీద నినదిస్తూ యాత్ర నిర్వహించడం ఎవరి రాజకీయ క్రీడలో భాగమో కానీ... అది ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రేపడమే కాక ఎటువంటి విధ్వంసానికి దారి తీస్తుందోనని భయపడాల్సిన అవసరముంది. విఙ్ఞతతో నడవాల్సిన ఉద్యమాలు ఇతరేతర ప్రయోజనాలతో నడవడం విషాదకరం! (క్లిక్: అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!) - అట్టాడ అప్పల్నాయుడు ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక అధ్యక్షులు -
ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
-
ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు.. టీడీపీ ద్రోహం
సాక్షి, అమరావతి: వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు గత తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నాయో వివరిస్తూ ఐదేళ్ల కాలంలో రూ.24,350 కోట్లు ఇవ్వాలని అధికారులు సవివరమైన నివేదికను కేంద్రానికి సమర్పించారు. కానీ, నాటి ముఖ్యమంత్రి ఈ నిధుల సాధనలో పూర్తిగా చతికిలపడ్డారు. స్వయాన కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రే ఇటీవల రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో ఈ విషయం తేటతెల్లమైంది. అధికారులు రూపొందించిన లెక్కల ప్రకారం నిధులు సాధించాల్సిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. జిల్లాకు ఏడాదికి కేవలం రూ.50 కోట్లు ఇస్తామంటే ఆయన ఓకే చెప్పారు. అంటే ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు కేంద్రం ఇస్తానంటే చంద్రబాబు అందుకు సరేనన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మూడేళ్లపాటు రూ.350 కోట్ల చొప్పున విడుదల చేయగా ఆ నిధులనూ టీడీపీ సర్కారు సక్రమంగా వినియోగించలేదు. వాటి వినియోగ పత్రాలు సమర్పిస్తేనే తదుపరి నిధులు ఇస్తామని స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం.. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి వాటి విడుదలను నిలుపుదల చేసింది. అలాగే.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కూడా పైసా ఇవ్వలేదు. ఒక రకంగా వేల కోట్ల రూపాయలు ఆ జిల్లాలకు రాకుండా చేయడమే కాక, కేంద్రం ఇస్తానన్న అరకొర నిధులు కూడా రాకుండా చంద్రబాబు ఆ ప్రాంతాలకు తీరని ద్రోహం చేశారు. ఈ జిల్లాల్లో అక్షరాస్యత పెంచడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులను వినియోగించాల్సి ఉండగా అప్పటి టీడీపీ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యహరించింది. టీడీపీకి భిన్నంగా వైఎస్సార్సీపీ.. అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 2019–20లోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.350 కోట్లను కేంద్రం నుంచి సాధించింది. అలాగే.. 2020–21 ఆర్థిక ఏడాదిలో కూడా మరో రూ.350 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించింది. అంతేకాక.. సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సమయంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్ల మేర ఆర్థిక సాయం అందించాలని కోరిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదిరి వెనుకబడిన జిల్లాల నిధుల విడుదల వివరాలను వెల్లడించారు. -
ఉత్తర కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశావైపు అల్పపీడనం కదులుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రకు రెండ్రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
వణికించిన ఫొని పెనుతుపాన్
-
ఉత్తరాంధ్ర వెనుకబాటుకు టీడీపీయే కారణం
-
మార్చి 4న కొవ్వొత్తులతో నిరసన
సాక్షి, విశాఖపట్నం : రాష్ర్ట విభజన హామీల అమలు కోసం మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శ నిర్వహించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక తలపెట్టింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు ముందు విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ కొవ్వొత్తుల మహా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ర్టంలోని అన్ని పార్టీల నాయకులను స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని కొణతాల యోచిస్తున్నారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్, రాయలసీమ అభివృద్ధి మండలి ఏర్పాటు, ఎయిమ్స్ ఆసుపత్రి, విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, విశాఖ మెట్రో రైలు, ఒడిశాతో ఉన్న జలవివాదాల పరిష్కారం వంటి హామీల సాధనే లక్ష్యంగా మహా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రాష్ర్ట విభజన హామీల అమలు కోసం అన్ని పార్టీలను ఒకే తాటిపై తెచ్చేందుకు ఉత్తరాంధ్ర చర్చావేదిక ఆహ్వానం పంపుతుందని తెలిపింది. కొవ్వొత్తుల మహా ప్రదర్శనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేస్తున్నప్పటికీ ఆయా పార్టీలేవీ తమ జెండాలను ప్రదర్శించకూడదనే షరతులు విధించింది. ఈ కొవ్వొత్తుల మహా ప్రదర్శనలో పాల్గొనే వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా కొవ్వొత్తులు తెచ్చుకునేలా పిలుపునివ్వాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక నిర్ణయించింది. కేంద్ర హామీల అమలుతో పాటు రాష్ర్ట వార్షిక బడ్జెట్లోనూ ఉత్తరాంధ్ర వాటా కోసం ఈ ప్రదర్శన ద్వారా ఒత్తిడి తేవాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక నాయకులు భావిస్తున్నారు. -
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
-
కొవ్వాడ అణుప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు ముప్పు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రణస్థలం మండలం కొవ్వాడలో నిర్మించనున్న అణువిద్యుత్ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు ముప్పు తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి హెచ్చరించారు. అణువిద్యుత్ కర్మాగారం వల్ల తలెత్తే అనర్థాలు, ప్రమాదాలను వివరిస్తూ శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణుప్లాంట్ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించడంతో ప్రధానమంత్రి మోదీ అణుప్లాంట్ నిర్మాణాన్నివ్యతిరేకించారన్నారు. ఇప్పుడు అదే మోదీ శ్రీకాకుళం జిల్లాలో అణుప్లాంట్‌ను పెట్టి అమాయకులైన ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలను పణంగాపెడుతుంటే సీఎం చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీల జెండాల్లో రంగులు, గుర్తులు తేడా తప్ప విధానాల్లో మార్పులేదని గుర్తు చేశారు. కొవ్వాడలో అణురియాక్టర్ల ఏర్పాటుకు రూ.2.80 లక్షల కోట్లు వెచ్చించి కాంట్రాక్టర్లు, పాలకులు జేబులు నింపుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం సమకూరదన్నారు. అణుప్లాంట్‌కి పెట్టే ఖర్చుతో రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాల సమస్య తీర్చవచ్చన్నారు. అణుప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలు చెబుతున్నా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు వినిపించుకోకపోవడం విచారకకరమన్నారు. ప్లాంట్‌కు వ్యతిరేకంగా పోరాటాలే శరణ్యమన్నారు. ప్రజలంతా ఉద్యమానికి సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చౌదరి తేజేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు వీజీకే మూర్తి, కె.నారాయణరావు, ఎం.తిరుపతిరావు, వై.చలపతిరావు, టి.తిరుపతిరావు, కె.సూరమ్మ, కె.హేమసూధన్‌లు పాల్గొన్నారు. -
తీవ్ర రూపం దాల్చనున్న తుఫాన్!
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో 'రోను' తుఫాన్ ఉంది. నేడు తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అందింది. తీరం వెంబడి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చిరించారు. వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారి శుక్రవారం ఒడిశా వైపుగా వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్‌లో తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం డివిజన్ లో అత్యధికంగా 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత మండలాల రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ అప్రమత్తం చేశారు. సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. -
తెలంగాణ, ఉత్తర కోస్తాకు వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ, రాయలసీమల్లో సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా వడగాడ్పుల తీవ్రత తగ్గింది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఎండల ప్రభావం కనిపిస్తూనే ఉంది. బుధవారం కర్నూలు, అనంతపురంలలో 42, రామగుండంలో 41, హైదరాబాద్, తిరుపతి, రెంటచింతలలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు గాలుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నైరుతి నుంచి గాలులు వీస్తున్నాయి. తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం తెలిపారు. రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని చెప్పారు. -
83339 99999 నంబర్ నుంచి కాల్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై టీడీపీ కాల్ సెంటర్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆదివారం 83339 99999 ఫోన్ నంబర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు ఫోన్ చేసి సర్వే చేస్తోంది. కురుపాం, ఎస్ కోట, పార్వతీపురం నియోజకవర్గాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయి. కురుపాంలో భర్త ఉన్న మహిళకు వితంతు కోటాలో ఉద్యోగం ఇచ్చినట్టు వెల్లడైంది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, పలువురు ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం జిల్లాలో ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. -
83339 99999 నంబర్ నుంచి కాల్స్
-
కోస్తాలో కుండపోత
* ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వానలు * చింతూరులో 26, విశాఖలో 17 సెం.మీల వర్షపాతం * అధికారులు అప్రమత్తం.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు సాక్షి నెట్వర్క్: కోస్తా జిల్లాలను వర్షం ముంచెత్తుతోంది. రుతుపవనాలకు, అల్పపీడనం తోడు కావడంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గత రెండురోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు కాగా అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరో రెండురోజులు భారీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి. పలు జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 233.8 మి.మీలు వర్షం కురవగా, శనివారం 734 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. విశాఖపట్నం జిల్లాలో మూడురోజుల నుంచి కరువు తీరా వర్షం కురుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విశాఖలో 17 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా చింతూరులో 26 సెం.మీ నమోదైంది. ఆచూకీ లేకుండా పోయిన 24 పడవలు తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 4 రోజుల క్రితం 161 మంది మత్స్యకారులతో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 23 బోట్ల ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు శనివారం కాకినాడలో మత్స్యకార నాయకులు, బోట్లు యజమానులు, అధికారులతో చర్చించారు. ఇదే విధంగా కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారుల, నెల్లూరు జిల్లాకుచెందినవారు మరో ఆరుగురు గల్లంతయ్యారు. -
ఉత్తరాంధ్రలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
జామి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన అన్ని రైలు సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ బోగీలు పడిపోవడంతో పాటు ఐదు విద్యుత్ స్తంబాలు కూడా నేలకూలాయి. దీంతో రైల్వే అధికారులు విశాఖ-పలాస, విశాఖ-విజయనగరం లోకల్ రైలు సర్వీసులను రద్దు చేశారు. ఇక హౌరా-చెన్నై, కోరాపుట్, కోర్బా, కోణార్క్ తదితర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లను దారి మళ్లించడంతో సర్వీసులు ఆలస్యం అవుతన్నాయి. -
ఉత్తరాంధ్ర తెలుగుతేజం యు.ఎ. నర్సింహమూర్తి
ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి యు.ఎ. నర్సింహమూర్తిగా ఉత్త రాంధ్ర గర్వించదగ్గ సాహి త్య కృషి చేసిన నిరంతర సాహిత్య చైతన్యశీలి. తెలు గు భాషా విషయమై ప్ర ముఖ పత్రికలలో పలు వ్యాసాలు రాసిన ఈ భా షా ప్రేమికులు 27.04.2015 సాయంత్రం అయిదు గంటలకు, విజయనగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలుగు విమర్శ రం గంలో సైతం ఎనలేని కృషిచేసిన యు.ఎ నరసింహ మూర్తి 1944 డిసెంబర్ 10న విజయనగరం జిల్లా లింగాలవలసలో జన్మించారు. విద్యాభ్యాసం, పట్ట భద్రత, అనంతర ఉద్యోగ జీవితం (మహారాజా కళాశాలలో తెలుగు విభాగాధ్యక్షులుగా పదవీ విర మణ) యావత్తు విజయనగరంలోనే గడిచాయి. పిం గళి సూరన ఔచిత్య ప్రస్థానంపై ఆచార్య యస్వీ జోగారావు గారి పర్యవేక్షణలో పీహెచ్డీ పట్టాను పొందారు. కథాశిల్పి చాసో, శ్రీరంగం నారాయణ బాబు కవితా వైశిష్ట్యం, యశోధర వారి దీర్ఘ కవితల వలన యుజీసీ ప్రాజెక్టుల కమిటీ దృష్టికి నరసింహమూర్తి గారి ప్రతిభ గోచరమైంది. మన ఆధునిక తెలుగు సాహిత్యం గర్వపడేలా ‘కన్యాశు ల్కం-పందొమ్మిదో శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు’ పేరిట దేశ మంతటా నాటక విషయంపై పర్య టించి, భారతీయ భాషా నాటకా లలో 19వ శతాబ్దపు కన్యాశుల్కం నాటకపు విశిష్టతను తులనాత్మక పరిశీలన చేశారు. ఇరుగు పొరుగు సాహిత్యం నుంచి జయంత మహపత్ర రచనలు, కవిత్వం అనువాదం చేసి, భాషల సాన్నిహిత్యం పెంపొందించారు. ‘తెలుగు వచన శైలి’ పేరిట ఒక విశ్లేషణను బృహత్తర రచనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణగా వెలువరించి, నరసింహమూర్తి గారిని గౌరవించింది. నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీతల పుర స్కార ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసి ప్రచురణ చేశారు. ‘విశ్వనాథ సౌందర్య దర్శనం’, గిడుగు రామ్మూర్తి రచనలను సరళ భాషలో తిరిగి రాశారు. నరసింహ మూర్తి గారు రచించిన ‘నన్నెచో డుడి కుమార సంభవం’ ఉత్తమ విమర్శకునిగా గుర్తింపు తెచ్చింది. గురజాడ 150వ జయంతి రాష్ట్ర వ్యాప్త ఉత్సవాల్లో భాగంగా గుర జాడ పురస్కారం పేరిట లక్ష రూపా యల నగదు పురస్కారం పొందా రు. అజో-విభో సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందించి, మాస్టారి సేవలను సమున్నతంగా గౌర వించింది. విజయభావన ‘అధ్యయన భారతి’ బిరుదాన్ని సమర్పించి సత్కరించింది. గత కొంతకాలంగా యు.ఎ.నర్సింహమూర్తి ‘పరిణత భారతి’ పేరిట 1958 ముందరి విజయ నగరం పండితుల, సాహిత్యవేత్తల వ్యాసాలను సంకలనం తీసుకువచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. టాగూర్ ఫెలోషిప్‌ను పొందిన మొదటి తెలుగు సాహిత్యవేత్త యు.ఎ.ఎన్. అయితే ఇందుకు సంబం ధించిన కృషి పూర్తిగా జరుగకుండానే వారు కన్ను మూయడం, తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆయన డెబ్బయ్యో జన్మదినోత్సవాలు ఘనంగా జర గాల్సి ఉండగా, అనారోగ్యం వల్ల వాయిదా పడ్డా యి గత సంవత్సరం విశాఖలో సప్ధర్ హష్మీ కవితల సంపుటి (రామతీర్థ, జగద్ధాత్రిల అనువాదం) బుక్ ఫెస్ట్‌లో ఆవిష్కరించి, తెలుగు సాహిత్యం గురించి ఏప్రిల్ 17న ఇచ్చిన ప్రసంగం, హైదరాబాద్‌లో ఏప్రిల్ 23న శ్రీపాద వారి సమగ్ర రచనల ఆవిష్క రణ సభలో పాల్గొనడం వారు కడసారిగా సభలలో కనిపించిన సందర్భాలు. తన జీవితకాలం యావ త్తూ అభ్యుదయ సాహిత్య స్ఫూర్తితో, నిష్కర్ష అయిన అక్షర సంపన్నతతో, ప్రగతిశీల శక్తులకు చేదోడుగా నిలిచిన ఉత్తమ శ్రేణి సాహిత్య వేత్తను, ఇవాళ తెలుగు సాహిత్యం కోల్పోయింది. వారు వదిలి వెళ్లిన సాహిత్య రాశి, ఆ జిజ్ఞాస గొప్పవి. అవి ముందు తరాల వారికి ఆదర్శం కావాలి. రామతీర్థ, వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత మొబైల్: 98492 00385 -
ఉత్తరాంధ్రలో కదంతొక్కిన జనం
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలపై రైతులు, డ్వాక్రా మహిళలు పోరుబాటపట్టారు. రుణమాఫీ అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లో రైతులు, మహిళలు నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో జనం కదంతొక్కారు. ధర్నా విశేషాలు.. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ధర్నా అడ్డుకునేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా ప్రజలు ఖాతరు చేయకుండా వచ్చారు. విశాఖపట్నం రోడ్లు జనసంద్రంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా ధర్నాకు రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు అద్భుత స్పందన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే గాక అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు. -
25 నుంచి ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటన
న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి 27 వరకు ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటించనుంది. గత నెలలో సంభవించిన హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఈ బృందం పర్యటిస్తుంది. 9 మంది సభ్యులతో కూడిన ఈ బృందం రెండుగా విడిపోయి తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తుంది. తుపాను నష్టం అంచనాలను ఈ బృందం రూపొందిస్తుంది. ** -
నిలువ నీడ కోల్పోయిన అడవిబిడ్డలు!
-
విరాళాల సొమ్ములు ఏటైపోనాయి బావూ?
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని హుదూద్ తుఫాను అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు కూడా కూకటివేళ్లతో కూలిపోయాయి. ఎన్ని ఇళ్లు కుప్పకూలాయో లెక్కలేదు. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. జనజీవనం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో తుఫాను బాధితులను ఆదుకోడానికి పెద్ద హృదయంతో చాలామంది ముందుకు వచ్చారు. భారీ విరాళాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో ఇస్తామంటూ గట్టిగానే చెప్పారు. అయితే.. వీటిలో ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయానికి వచ్చినవి మాత్రం ఒకటి.. అర మాత్రమేనట. అవును.. విరాళాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నవాళ్లలో ఎంతమంది నిజంగా ఇస్తున్నారు, ఎంతమంది కేవలం పేరుకు మాత్రమే చదివిస్తున్నారన్న విషయం తెలియడంలేదు. విశాఖలో సహాయ కార్యకలాపాలు చేపట్టడానికి డబ్బుకోసం చూసుకుంటే.. సీఎంఆర్ఎఫ్ ఖాళీగా కనిపిస్తోంది. సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు.. ఇలా చాలామంది పెద్దమొత్తంలో విరాళాలు ప్రకటించినా, వాటిలో చేతికి అందినవి కొన్నిమాత్రమే. కొంతమంది నేరుగా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి చెక్కులు పంపారు. హీరో కృష్ణ, పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటివాళ్లు నేరుగా చంద్రబాబును కలిసి ఆయనకే చెక్కులు అందించారు. మిగిలినవాళ్లు మాత్రం ఇంకా చెక్కులుగానీ, డీడీలు గానీ ఏ రూపంలోనూ విరాళాలు అందించలేదు. ఆ విషయం చెప్పడానికి సీఎంఆర్ఎఫ్ కార్యాలయ అధికారులు మొహమాటపడుతున్నారు. బహుశా ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయనకు చెక్కులు అందిస్తూ ఫొటోలు తీయించుకోడానికి ఇలా ఆలస్యం చేస్తున్నారేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లు ఘనంగా విరాళాలు ప్రకటించి, తర్వాత ఊరుకున్నారేమోనని కూడా అంటున్నారు. -
చలించిపోయిన వైఎస్ జగన్
హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని మారుమూల గ్రామాలలోకి కూడా వెళ్లి ప్రజలు పడుతున్న బాధలను ఆయన దగ్గరగా చూస్తున్నారు. భారీగా నష్టపోయిన మత్స్యకారులను, పేదలను, వృద్ధులను అందరినీ పరామర్శిస్తున్నారు. దెబ్బతిన్న పడవలను, వలలను చూశారు. నీట మునిగిన పొలాలను చూశారు. కూలిపోయిన ఇళ్లను చూశారు. తుపాను వల్ల సర్వం కోల్పోయి ప్రభుత్వ సహాయం అందక బాధితులు పడుతున్న కష్టాలను చూసి జగన్ చలించిపోయారు. అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయం అందేవిధంగా ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఫైబర్ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు 2 లక్షల 50వేల రూపాయలు, వలలు కోల్పోయిన వారికి 50వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. కొబ్బరితోటలు కోల్పోయిన వారికి చెట్టుకు 5 వేలు పరిహారం డిమాండ్ చేశారు. జీడిమామిడి తోటలకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి బాధితుని ఇంటికి తక్షణ సాయంగా 5 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరారు. తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాసితులకు అందించే సాయం ఇదేనా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులు, మత్స్యకారులకు వచ్చే నెల 5వ తేదీలోగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు, డ్వాక్రా మహిళలు ఈ ముట్టడిలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ** -
హుదూద్ దెబ్బకు ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర!
-
హుదూద్ దెబ్బకు ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర!
హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్ర ఉలిక్కి పడింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అల్లకల్లోలం అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంటకు 190 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో వీచిన పెను గాలులు బీభత్సం సృష్టించాయి. తుపాన్ గురించి హెచ్చరికలు అందించే విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం కూడా మూగబోయింది. భారీ వర్షంతో కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. భీకర గాలులకు భవనంలోని కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. తుపాన్ హెచ్చరికల కేంద్రానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. తుపాను ధాటికి విశాఖ హార్బర్ గజగజ వణికింది. 60 పెద్ద పెద్ద బోట్లను సైతం తుపాన్ తిప్పికొట్టింది. మర బోట్లు జెట్టిపైకి కొట్టుకు వచ్చాయి. ఒక్కో మరబోటు విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. ఆర్కే బీచ్ ధ్వంసం అయింది. దీంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. సముద్రంలో ఇంతటి బీభత్సాన్ని తాము ఇంతవరకు చూడలేదని మత్స్యకారులు చెప్పారు. తుపాన్ ధాటికి విశాఖ విలవిల్లాడిపోయింది. భారీ వృక్షాలు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అపార్ట్మెంట్లకు పగుళ్లు వచ్చాయి. తుపాన్ తాకిడికి రోడ్లు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు కోతలకు గురయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తుపాను పూర్తిగా తీరం దాటింది. పూడిమడక గ్రామం వద్ద తుపాను తీరం దాటింది. తీరం దాటుతున్న సమయంలో పూడిమడక గ్రామం వద్ద అల్లకల్లోలం సృష్టించింది. తుపాను బలహీనపడిన తరువాత అల్పపీడనంగా మారుతుందని ఐఎండి తెలిపింది. తూర్పుగోదావరి జిల్లాలోని గాలిమొగ అడవులలలో 16 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. ఈ జిల్లాలోని కర్రపాలెం, లోలూరు, కొత్తూరు గ్రామాలలో ఇళ్లలోకి, ప్రభుత్వ పాఠశాలలలోకి నీరు వచ్చిచేరింది. శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కరెంటు, రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతింది. జిల్లాలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు వేలాది ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. . భారీ వర్షాలకు శ్రీకాకుళంలోని నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. కళింగపట్నం, పొన్నాడలంక, బందరువానిపేట వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. కళింగపట్నం రోడ్లపై చెట్లు కూలాయి. రహదారి మొత్తం మూసుకుపోయింది. శ్రీకాకుళం- పాలకొండ, శ్రీకాకుళం-కళింగపట్నం, శ్రీకాకుళం -రాజాం రహదారులపై కూడా భారీగా చెట్లు నేలకూలాయి. ఈ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సంతబొమ్మాళి మండలం సి.పురంలో తాటిచెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. ఆర్మీ, నేవీ, రక్షణ బలగాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల్లో జొన్న, అరటి, వరి, పత్తి పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ** -
విపత్తు నిర్వహణలో మనం ఎక్కడున్నాం ?
-
తుపానుకు పేరొచ్చేదిలా..!
-
ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు!
-
ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు!
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాను మరింత తీవ్రమైంది. ఈ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు పెనుముప్పు పొంచి ఉంది. విశాఖకు 260 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం తీరం వెంట గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. తుపాను తీరందాటే సమయంలో ఉప్పెన మాదిరిగా అలలు వస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను రేపు ఉదయం విశాఖ పరిసరాలలో తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో తుపాను విధ్వంసం బాగా ఉండే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఇచ్ఛాపురం-కాకినాడ మధ్య జాతీయ రహదారిని మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఐఎన్ఎస్ డేగాలో ఆరు హెలీకాప్ట్ర్లను సిద్ధంగా ఉంచారు. ** -
ఉత్తరాంధ్రలో మారిన లెక్కలు!
ఓటరు నాడి ఓ పట్టాన చిక్కదనడానికి తాజాగా జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని బట్టి విశదమవుతోంది. ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు విలక్షణంగానే ఉంటుందనేది మరోసారి విస్పష్టమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పది, విజయనగరం జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం జిల్లాలోని విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, తూర్పు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల మినహా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేచి చూడగా పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ఉత్తరాంధ్రలోని 29 నియోజకవర్గాల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస, నరసన్నపేటల్లోనే ఆధిక్యం కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందడం గమనార్హం! అయితే, ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన పాతపట్నం, పాలకొండ, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేయడం విశేషం! ఆమదాలవలస పరిధిలో స్థానిక ఎన్నికల్లో 5,229 ఓట్ల ఆధిక్యం కనిపించినా, అసెంబ్లీకి వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి తమ్మినేని సీతారాం (వైఎస్సార్సీపీ)పై ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక నరసన్నపేటలో స్థానిక ఎన్నికల్లో 3,260 ఓట్ల ఆధిక్యాన్ని వైఎస్సార్సీపీ కనబరిచినా, అసెంబ్లీ ఫలితాల్లోకి వచ్చేసరికి ఇక్కడ బగ్గు రమణమూర్తి (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్సీపీ)పై 4,889 ఓట్ల మెజారిటీ సాధించారు. పాతపట్నం పరిధిలో స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, వైఎస్సార్సీపీకి ప్రత్యర్థి టీడీపీ కన్నా 1317 ఓట్లు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ అభ్యర్థి కలమట వెంకటరమణ (వైఎస్సార్సీపీ) తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (టీడీపీ)పై 3,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. పాలకొండలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 3,504 ఓట్ల ఆధిక్యం వచ్చినా, అసెంబ్లీ స్థానాన్ని మాత్రం వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజాంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ 4289 ఓట్ల ఆధిక్యం కనబరిచినా, అసెంబ్లీ ఫలితం వచ్చేసరికి కంబాల జోగులు (వైఎస్సార్ సీపీ) మాజీ స్పీకర్ ప్రతిభాభారతి (టీడీపీ)పై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈ జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం స్థానాలు స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో ఆధిక్యత కనబరిచిన టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. విజయనగరం జిల్లా ఫలితాలను విశ్లేషిస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబరిచిన బొబ్బిలి సెగ్మెంట్లో ఆ పార్టీయే గెలుపొందింది. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీకి 6384 ఓట్ల ఆధిక్యం రాగా.. అసెంబ్లీ అభ్యర్థి సుజయ్ కృష్ణరంగారావు టీడీపీ అభ్యర్థి లక్ష్మునాయుడుపై 7330 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ జిల్లాలో మరోరెండు స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొందింది. కురపాంలో స్థానిక ఎన్నికల ఫలితాల్లో 525 ఓట్లు తగ్గినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి పి.పుష్పశ్రీవాణి టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్‌పై 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం! సాలూరులో స్థానిక ఫలితాల్లో టీడీపీ 1654 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినా, అసెంబ్లీకి వచ్చేసరికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజన్నదొర టీడీపీ అభ్యర్థి భాంజ్దేవ్పై సుమారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ జిల్లాలో మిగిలిన పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట సెగ్మెంట్లలో స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో టీడీపీదే పైచేయిగా ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా ఫలితాల సరళిని చూస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరిచిన పాడేరు (9282), అరకులోయ (21824), మాడుగుల (45) సెగ్మెంట్లలో ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఆధిక్యం కన్నా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పాడేరులో జి.ఈశ్వరి పాతికవేలకు పైగా, అరకులోయలో కిడారి సర్వేశ్వరరావు 33వేల పైగా, మాడుగులలో బూడి ముత్యాలనాయుడు ఐదు వేలపైగా ఓట్ల మెజారితో విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో స్థానిక ఫలితాల సరళిని బట్టి చూస్తే ఆరు నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. -అవ్వారు శ్రీనివాసరావు -
ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు