
83339 99999 నంబర్ నుంచి కాల్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై టీడీపీ కాల్ సెంటర్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆదివారం 83339 99999 ఫోన్ నంబర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు ఫోన్ చేసి సర్వే చేస్తోంది.
కురుపాం, ఎస్ కోట, పార్వతీపురం నియోజకవర్గాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయి. కురుపాంలో భర్త ఉన్న మహిళకు వితంతు కోటాలో ఉద్యోగం ఇచ్చినట్టు వెల్లడైంది. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీపై కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోనూ అంగన్వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, పలువురు ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం జిల్లాలో ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.