హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.
నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.
టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment