
25 నుంచి ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటన
న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి 27 వరకు ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటించనుంది. గత నెలలో సంభవించిన హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఈ బృందం పర్యటిస్తుంది.
9 మంది సభ్యులతో కూడిన ఈ బృందం రెండుగా విడిపోయి తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తుంది. తుపాను నష్టం అంచనాలను ఈ బృందం రూపొందిస్తుంది.
**