Hudud cyclone
-
ఆదుకోండి ప్లీజ్
సాక్షి, విశాఖపట్నం: ‘హుదూద్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. నాలుగు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తీరం దాటిన చోటైన విశాఖ నగరం అతలాకుతలమైంది. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాలకు అపార నష్టం జరిగింది. ముందస్తు చర్యలు తీసుకోవడం వలన ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం.. రాష్ర్ట యంత్రాంగమంతా స మిష్టిగా కృషి చేయడం వల్ల కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వ్యవస్థలన్నీ పునరుద్ధరించగలిగాం. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ లోటుబడ్జెట్లో ఉంది..జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కానీ..నగరం పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు కానీ కేంద్రమే ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర బృందానికి హుదూద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ ఇచ్చే విధంగా చూడాలని కోరారు. హుదూద్ తుఫాన్ నష్టాలపై అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన ప్రత్యేక ఉన్నతస్థాయి అధికారుల బృందం ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ బృందం తొలుత ఎయిర్పోర్టుకుజరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ డెరైక్టర్ పట్టాభి ఎయిర్‌పోర్టు టెర్మినల్ తుఫాన్ వల్ల ఏ విధంగా దెబ్బతిన్నదో వివరించారు. నాటి విధ్వంస దృశ్యాలను బృందం పరిశీలించింది. అనంతరం నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని తుఫాన్ నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటోఎగ్జిబిషన్ను తిలకించారు. కలెక్టరేట్లో తుఫాన్ నష్టాలపై ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఈసందర్భంగా తుఫాన్‌కు ముందు తీసుకున్న చర్యలు..ఆ తర్వాత చేపట్టిన సహాయ, పునరావాస చర్యల కోసం లోతైన పరిశీలన చేశారు. వారం రోజుల్లోనే పునరుద్దరించగలిగాం జిల్లా కలక్టర్ యువరాజ్ మాట్లాడుతూ వల్ల రూ.65వేల కోట్లకు పైగా నష్టంవాటిల్లిందని రూ.21వేల కోట్ల సాయమైనా అందించకపోతే కోలుకోవడం కష్టమని వివరించారు. పారిశ్రామికంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రైతులను ఆదుకునేందుకు తక్షణ సాయంకింద రూ.4వేల కోట్లు ఇవ్వాలనికోరారు. ఇంత పెద్ద విపత్తుసమయంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకున్నచర్యలు వివరించాలని కేంద్రబృందం సభ్యులు కోరగా, తుఫాన్ అనంతరం భారీ వర్షాలు కురవకపోవడంతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం వలన అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టగలిగామని కలెక్టర్లు వివరించారు. వారం రోజుల్లోనే విద్యుత్‌ను పునరుద్దరించగలిగామని ఏపీఈపీడీసీఎల్ సీఎండి శేషగిరిబాబు వివరించారు. తుఫాన్ వల్ల ఎక్కువగా నష్టపోయింది జీవీఎంసీయేనని..90వేల విద్యుత్ దీపాలు, లక్షలాది చెట్లు ధ్వంసమవడంతో పాటు మంచినీటి వనరులు కూడా దెబ్బతిన్నాయని జీవీఎంసీ కమిషనర్ జా నకీ వివరించారు. 2.20లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఉత్తరాంధ్రలో ఉన్నవారంతా సన్న,చిన్నకారు రైతులేనని, వార్ని వెంటనే ఆదుకోకపోతే కోలుకోలేరని వ్యవసాయశాఖ కమిషనర్ మదుసూదన రావు అన్నారు. తమ జిల్లాల్లో జరిగి న నష్టాలను విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా కలెక్ట ర్లు ఎంఎం నాయక్, సౌరబ్‌గౌర్, నీతూకుమారి ప్రసాద్‌లు వివరించా రు. రాష్ర్ట ప్రభుత్వం తరపున సమర్పించిన నివేదిక పట్ల బృందం సభ్యు లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పునరుద్దరణకు ఎంతఖర్చు పెట్టారు. ఆ నిధులనుఏ విధంగా సమీకరించారో చెప్పాలని సూచించా రు. దీనిపై కలెక్టర్లు సమాధానం చెప్పకపోవడంతో మూడురోజుల్లో సమగ్రనివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
25 నుంచి ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటన
న్యూఢిల్లీ: ఈ నెల 25 నుంచి 27 వరకు ఉత్తరాంధ్రలో కేంద్ర బృందం పర్యటించనుంది. గత నెలలో సంభవించిన హుదూద్ తుపాను కారణంగా ఉత్తరాంధ్ర అతలాకుతలమైన విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఈ బృందం పర్యటిస్తుంది. 9 మంది సభ్యులతో కూడిన ఈ బృందం రెండుగా విడిపోయి తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తుంది. తుపాను నష్టం అంచనాలను ఈ బృందం రూపొందిస్తుంది. ** -
వైజాగ్ కోసం...నేను సైతం!
శ్రీయ మంచి నటి మాత్రమే కాదు.. మంచి చిత్రకారిణి కూడా. ఆ విషయం కొద్దిమందికే తెలుసు. చిన్నప్పుడు సరదాగా ఎన్నో అందమైన బొమ్మలు గీసిన శ్రీయ తాజాగా కుంచె పట్టారు. అయితే ఈసారి సరదా కోసం కాదు.. ఓ బలమైన కారణం కోసం. హుదూద్ తుపాను కారణంగా నిన్నటి విశాఖపట్నం శోభ ఇప్పుడు లేదు. నగరానికి మళ్లీ పాత వైభవాన్ని తీసుకురావడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సహాయం చేస్తున్నారు. శ్రీయ కూడా తన వంతుగా రెండు బొమ్మలు గీశారు. వైజాగ్ పునరుద్ధరణ కోసం నిధి సమకూర్చే దిశలో ఏర్పాటు చేసిన ఒక ‘ఆర్ట్ షో’కు తాను గీసిన కృష్ణుడు, బుద్ధుడి బొమ్మలను పంపించారు శ్రీయ. ఆదివారం హైదరాబాద్‌లో ఈ షో జరగనుంది. ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ -‘‘ఆర్ట్ షోకి ఏదైనా బొమ్మలు గీసివ్వాలని నిర్వాహకులు నన్ను కోరారు. ఓ సత్కార్యం కోసం చేస్తున్నది కాబట్టి, వెంటనే అంగీకరించాను. నా పరిధిలో వైజాగ్ కోసం ఏ సహాయం చేయడానికైనా వెనకాడకూడదనుకున్నాను. విశాఖ నగరంతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. బోల్డన్ని తీపి జ్ఞాపకాలు మిగిల్చిన నగరం అది. నటిగా నా తొలి సన్నివేశం చేసింది అరకులోనే. అలాగే, నౌకాదళంలో పని చేస్తున్న నా కజిన్ ఉండేది ఆ నగరంలోనే. ప్రకృతి సృష్టించిన బీభత్సం గురించి తను చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది’’ అని చెప్పారు. -
హుద్‌హుద్ నష్టం రూ.21,640.63 కోట్లు
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. దీనివల్ల ఏకంగా 3.30 లక్షల హెక్టార్లలో వరి, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పంట నష్టమే రూ.2,287 కోట్లుంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వరి, ఇతర పంటల నష్టం రూ.947.90 కోట్లు కాగా ఉద్యాన పంటల నష్టం రూ.1,339.23 కోట్లుగా వ్యవసాయశాఖ తెలిపింది. 3.09 లక్షల హెక్టార్లలో 50 శాతానికిపైగా పంట నష్టపోయినట్లు పేర్కొంది. మొత్తంమీద హుద్‌హుద్ నష్టం రూ.21,640.63 కోట్లుగా రాష్ట్రప్రభుత్వం లెక్కతేల్చింది. -
సాకేతపురం వాసులకు వైఎస్ జగన్ పరామర్శ
-
సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్
విశాఖపట్నం: హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగోరోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని సాకేతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్‌కు స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ గాజువాక, స్టీల్ ప్లాంట్, బర్మా కాలనీ, హైస్కూల్ రోడ్డు, అశోక్ నగర్, దయాళ్ నగర్లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. -
కోళ్ల ఫారాలకు కోలుకోలేని దెబ్బ!
తుపాన్‌తో ఉత్తరాంధ్రలో 25 లక్షల కోళ్ల మృతి (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఉత్తరాంధ్రలో ఫౌల్ట్రీ పరిశ్రమ హుదూద్ తుపాను దెబ్బకు కోలుకోలేని విధంగా నష్టపోయింది. విషపు గాలుల తీవ్రతకు తుపాను ప్రభావిత నాలుగు జిల్లాల్లో 25 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ కోళ్ల ఫారాలు సుమారు 200 దాకా ఉన్నాయి. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి భోగాపురం వరకూ, విజయనగరంలోని జిల్లాలోని బొబ్బిలి, శృంగవరపుకోట, పూసపాటిరేగ, శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పార్వతీపురం, ఆముదాలవలస ప్రాంతాల్లో ఫౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరూ రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ పెద్ద ఎత్తున కోళ్లు చనిపోయాయి. మేత, నీరు అందక రోగాల బారిన పడ్డాయి. షెడ్లకున్న రేకులు, తాటాకులు గాలుల తీవ్రతకు ఎగిరిపోయి కోళ్లు వర్షంలో తడిసి అనారోగ్యం బారిన పడ్డాయి. తీరని కష్టమిది.... తుపాను వల్ల ఫౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు రావాలి. - జీ రామకృష్ణ చౌదరి, విశాఖ జోనల్ చైర్మన్, నెక్ -
ఏపికి సాయం చేస్తాం:ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: హుదూద్ పెను తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని అధ్యక్షతన తుపానుపై అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, హొంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు, వాతావరణ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ ఏపి, ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుపాను పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ** -
తుపాను బాధితుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ ఉత్తరాంధ్రను వణికించిన నేపథ్యంలో బాధితుల కోసం అధికారులు పలు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తోపాటు తుపాను ప్రభావం పడిన జిల్లాలలో వీటిని ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్లతోపాటు తుపాను కంట్రోల్ రూమ్స్ ఫోన్ నెంబర్లను ఈ దిగువ ఇస్తున్నాం. ఏపీ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ : 1100 ఏపీ సచివాలయం, హైదరాబాద్ : 04023456005, 040 -23450419 రాజమండ్రి కలెక్టరేట్ : 0884 -2359173, 1077 (టోల్ ఫ్రీ) రాజమండ్రి : 0883 -2420541, 2420543, 2420780 విశాఖ కలెక్టరేట్ : 1800-4250-0002 (టోల్ ఫ్రీ) విశాఖ ఆర్టీసీ : 99592 25582 విశాఖ విద్యుత్ : 0891-2718091, 73822 9975, 94408 12492 విశాఖ రైల్వే: 0891 -2575083 హైదరాబాద్ హెల్ఫ్ లైన్ : 040 -23200865 ఏలూరు : 08812 -232267 తాడేపల్లి గూడెం :08818 - 226162 శ్రీకాకుళం : 08942 -225361, 965283819, టోల్ ఫ్రీ : 18004256625 విశాఖ: 0891 -2563121, టోల్ ఫ్రీ: 1800-425 -00002 తూర్పుగోదావరి : 0884 -2365424 /2365506, టోల్ ఫ్రీ : 1800-4253077/4251077 పశ్చిమగోదావరి : 08812 - 230050/230934/252655, టోల్ ఫ్రీ: 1800-4258848 ** -
బలహీనపడుతున్న తుపాన్
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్ వేగంగా బలహీనపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. కొన్ని గంటల్లో తుపాను అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. గాలుల తీవ్రత కూడా 50 శాతం తగ్గుతోందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం మొత్తం నాలుగు జిల్లాలపై పడిందని ఏపి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు తుపాను దెబ్బకు ముగ్గురు చనిపోయినట్టు ప్రభుత్వం తెలిపింది. లక్షా 35వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. 24 ఎన్డిఆర్ఎఫ్ టీమ్‌లు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. 155 మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. తుపాను సహాయక చర్యల కోసం 56 బోట్లు, 6 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ** -
తుపానుపై ప్రధాని మోదీ నిరంతర సమీక్ష
హైదరాబాద్: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాన్ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను ఆయన నిరంతరం సమీక్షిస్తున్నారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రధానికి చంద్రబాబు వివరించారు. తుపాను విశాఖపై తీవ్రప్రభావం చూపింది. నగరంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ** -
రోడ్డు మార్గంలో విశాఖకు చంద్రబాబు
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం విశాఖపట్నం వెళ్లనున్నారు. హుదూద్ తుపాన్ ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖకు విమాన సర్వీసులు రద్దు చేశారు. ఈ పరిస్థితులలో విశాఖకు విమానంలో వెళ్లే అవకాశంలేదు. అందువల్ల చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడ వరకు వెళతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన విశాఖ వెళతారు. తుపాను కారణంగా విశాఖలో భారీ నష్టం సంభవించింది. చెట్లు, హోర్డింగ్స్ కూలిపోయాయి. టెలీఫోన్ స్తంభాలు కుప్పకూలాయి. వాహనాలపై చెట్లు కూలాయి. వందలాది వాహనాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తారు. ** -
విపత్తు నిర్వహణలో మనం ఎక్కడున్నాం ?
-
తుపానుకు పేరొచ్చేదిలా..!
-
తుపాను కారణంగా 40 రైళ్ల రద్దు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తుపాను కారణంగా ముందు జాగ్రత్త చర్యగా 40 రైళ్లను రద్దు చేసింది. 29 రైళ్లను దారి మళ్లించింది. రద్దయిన కొన్ని రైళ్ల వివరాలు: విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ(రత్నాచల్) విశాఖ-తిరుపతి, తిరుపతి - విశాఖ( తిరుమల ఎక్స్‌ప్రెస్) భువనేశ్వర్-తిరుపతి, తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖపట్నం (దురంతో ఎక్స్‌ప్రెస్) విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖ (గరీబ్ రథ్) గుంటూరు-విశాఖ (సింహాద్రి ఎక్స్‌ప్రెస్) భువనేశ్వర్-బెంగళూరు సిటీ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ -యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ పూరి-చెన్నై ఎక్స్‌ప్రెస్ విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ ముంబై-భువనేశ్వర్ (కోణార్క్ ఎక్స్‌ప్రెస్) -
ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు!
-
ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు!
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాను మరింత తీవ్రమైంది. ఈ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు పెనుముప్పు పొంచి ఉంది. విశాఖకు 260 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం తీరం వెంట గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 170 నుంచి 180 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. తుపాను తీరందాటే సమయంలో ఉప్పెన మాదిరిగా అలలు వస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను రేపు ఉదయం విశాఖ పరిసరాలలో తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో తుపాను విధ్వంసం బాగా ఉండే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఇచ్ఛాపురం-కాకినాడ మధ్య జాతీయ రహదారిని మూసివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఐఎన్ఎస్ డేగాలో ఆరు హెలీకాప్ట్ర్లను సిద్ధంగా ఉంచారు. ** -
హుదూద్ తుపాను ముంచుకొస్తోంది!