నరేంద్ర మోదీ
హైదరాబాద్: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాన్ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను ఆయన నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రధానికి చంద్రబాబు వివరించారు. తుపాను విశాఖపై తీవ్రప్రభావం చూపింది. నగరంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
**