
చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం విశాఖపట్నం వెళ్లనున్నారు. హుదూద్ తుపాన్ ఉత్తరాంధ్రను అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖకు విమాన సర్వీసులు రద్దు చేశారు. ఈ పరిస్థితులలో విశాఖకు విమానంలో వెళ్లే అవకాశంలేదు. అందువల్ల చంద్రబాబు ప్రత్యేక విమానంలో విజయవాడ వరకు వెళతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన విశాఖ వెళతారు.
తుపాను కారణంగా విశాఖలో భారీ నష్టం సంభవించింది. చెట్లు, హోర్డింగ్స్ కూలిపోయాయి. టెలీఫోన్ స్తంభాలు కుప్పకూలాయి. వాహనాలపై చెట్లు కూలాయి. వందలాది వాహనాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తారు.
**