సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాల రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. దీనివల్ల ఏకంగా 3.30 లక్షల హెక్టార్లలో వరి, ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పంట నష్టమే రూ.2,287 కోట్లుంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వరి, ఇతర పంటల నష్టం రూ.947.90 కోట్లు కాగా ఉద్యాన పంటల నష్టం రూ.1,339.23 కోట్లుగా వ్యవసాయశాఖ తెలిపింది. 3.09 లక్షల హెక్టార్లలో 50 శాతానికిపైగా పంట నష్టపోయినట్లు పేర్కొంది. మొత్తంమీద హుద్‌హుద్ నష్టం రూ.21,640.63 కోట్లుగా రాష్ట్రప్రభుత్వం లెక్కతేల్చింది.