
తుపాను కారణంగా 40 రైళ్ల రద్దు
హైదరాబాద్: హుదూద్ పెను తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తుపాను కారణంగా ముందు జాగ్రత్త చర్యగా 40 రైళ్లను రద్దు చేసింది. 29 రైళ్లను దారి మళ్లించింది.
రద్దయిన కొన్ని రైళ్ల వివరాలు:
విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ(రత్నాచల్)
విశాఖ-తిరుపతి, తిరుపతి - విశాఖ( తిరుమల ఎక్స్ప్రెస్)
భువనేశ్వర్-తిరుపతి, తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్
విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖపట్నం (దురంతో ఎక్స్ప్రెస్)
విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విశాఖ (గరీబ్ రథ్)
గుంటూరు-విశాఖ (సింహాద్రి ఎక్స్ప్రెస్)
భువనేశ్వర్-బెంగళూరు సిటీ ఎక్స్ప్రెస్
భువనేశ్వర్ -యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్
పూరి-చెన్నై ఎక్స్ప్రెస్
విశాఖ-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్
ముంబై-భువనేశ్వర్ (కోణార్క్ ఎక్స్ప్రెస్)