
బలహీనపడుతున్న తుపాన్
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాన్ వేగంగా బలహీనపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. కొన్ని గంటల్లో తుపాను అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. గాలుల తీవ్రత కూడా 50 శాతం తగ్గుతోందని ఐఎండీ తెలిపింది.
తుపాను ప్రభావం మొత్తం నాలుగు జిల్లాలపై పడిందని ఏపి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు తుపాను దెబ్బకు ముగ్గురు చనిపోయినట్టు ప్రభుత్వం తెలిపింది. లక్షా 35వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. 24 ఎన్డిఆర్ఎఫ్ టీమ్‌లు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. 155 మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. తుపాను సహాయక చర్యల కోసం 56 బోట్లు, 6 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి.
**