మూడు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు | Heavy rains in North Andhra for three days | Sakshi
Sakshi News home page

మూడు రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Published Fri, Jul 21 2023 4:13 AM | Last Updated on Fri, Jul 21 2023 10:41 AM

Heavy rains in North Andhra for three days - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి.. ఒడిశా సరిహద్దు తీర ప్రాంతాల్లో విస్తరించింది. అల్ప­పీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించింది.

మ­రో­వైపు రుతుపవన ద్రోణి ప్రస్తు­తం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర, ఉభయ­గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచన­లున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 23న అల్లూరి సీతారామరాజు, పార్వతీ­పురం మన్యం, శ్రీకాకుళం, విజ­య­నగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement