
ఉత్తరాంధ్రలో కదంతొక్కిన జనం
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలపై రైతులు, డ్వాక్రా మహిళలు పోరుబాటపట్టారు. రుణమాఫీ అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో రైతులు, మహిళలు నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో జనం కదంతొక్కారు. ధర్నా విశేషాలు..
విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ధర్నా అడ్డుకునేందుకు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా ప్రజలు ఖాతరు చేయకుండా వచ్చారు. విశాఖపట్నం రోడ్లు జనసంద్రంగా మారాయి.
శ్రీకాకుళం జిల్లా ధర్నాకు రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు అద్భుత స్పందన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే గాక అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు.