
ఒడిశాలో రాహుల్ పర్యటన
భువనేశ్వర్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఒడిశాలో పర్యటిస్తున్నారు. హుదూద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్నారు.
బాధితులకు అండగా ఉంటామని, సాధారణ జనజీవనం ఏర్పడే వరకు పార్టీ తరపున సాయం చేస్తామని రాహుల్ చెప్పారు. కొరాపుట్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాన్ తీవ్రత, సహాయక చర్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తానని రాహుల్ చెప్పారు. ఆదివారం రాహుల్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించి తుపాన్ బాధితులను పరామర్శించారు.