హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ సంక్షోభం, రుణమాఫీ అమలు కాకపోవటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఒక తాను ముక్కలేనని వ్యాఖ్యానించారు. వారి వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని నారాయణ అన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ తన వైఫల్యాలకు చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని నారాయణ అన్నారు.
ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావాలంటే 50 సంవత్సరాలు పడుతుందని నారాయణ అన్నారు. హుదూద్ తుఫాను నష్టంలో అన్ని రాజకీయ పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవటంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
ఇద్దరూ ఆ తానులో ముక్కలే.....
Published Mon, Oct 27 2014 12:21 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement