Cyclone Mocha
-
బంగ్లా తీరాన్ని తాకిన మోకా
సాక్షి, విశాఖపట్నం: భీకర మోకా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్ తీరాన్ని తాకి తీవ్ర నష్టం కలగజేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8–12 అడుగుల ఎత్తున ఎగిసి పడిన అలలు లోతట్టు ప్రాంతాలను ముంచి వేశాయి. సెంట్ మార్టిన్ దీవిలో బలమైన గాలులు, భారీగా వానలు కురిశాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తివంతమైన తుపాను అని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపితే హుద్‌హుద్ తరహా పెను విపత్తుకు కారణమయ్యేదని నిపుణులు చెబుతున్నారు. -
Cyclone Mocha: తీవ్ర తుపానుగా ‘మోచా’
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ‘మోచా’ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. గురువారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 520, మయన్మార్‌లోని సిట్వేకు దక్షిణ నైరుతి దిశగా 1020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా పయనిస్తూ శుక్రవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం మలుపు తిరిగి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అత్యంత తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యాక్‌ప్యూ (మయన్మార్) మధ్య ఈ నెల 14న మధ్యాహ్నం తీవ్ర తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటవచ్చని పేర్కొంది. చదవండి: మళ్లీ గురివింద నిందలే! రాష్ట్రంలో వడగాడ్పుల ఉధృతి రాష్ట్రంలో ఉష్ణతీవ్రత మరింత పెరుగుతోంది. శుక్రవారం నుంచి ఇది మరింత తీవ్రరూపం దాల్చి వడగాడ్పులు వీయనున్నాయి. రానున్న ఐదు రోజులు కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులకు ఆస్కారం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐంఎండీ హెచ్చరించింది. -
బంగ్లాదేశ్–మయన్మార్ తీరం దిశగా ‘మోకా’
న్యూఢిల్లీ: మోకా తుపాను మరింత శక్తివంతంగా మారుతోందని, శుక్రవారం ఉదయానికల్లా మరింత తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్–మయన్మార్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు గురువారం రాత్రి తెలియజేశారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమంగా 520 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ నుంచి దక్షిణ దిశగా 1,100 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ బంగాళాఖాతంపై మోకా తుపాను ఆవరించి ఉంది. ఆదివారం ఉదయం వరకూ ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. -
గురువారంకల్లా భీకర మోచా తుపానుగా అల్పపీడనం.. భారీ వర్షాలు
పోర్ట్ బ్లెయిర్/భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచా తుపానుగా మారబోతోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. సంబంధిత వివరాలను భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ‘అండమాన్, నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అది గురువారంకల్లా భీకర మోచా తుపానుగా మారి ఆ దీవుల్లో భారీ వర్షాలకు కారణమవుతుంది. తర్వాత బంగాళాఖాతం ఆగ్నేయ, సమీప ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే 13న కాస్తంత బలహీనపడి బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని క్యావూక్ప్యూ పట్టణాల మధ్య తుపాను తీరం దాటనుంది. మే 14న గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లకపోవడం శ్రేయస్కరం’ అని కోల్‌కతా రీజియన్ డైరెక్టర్ జీకే దాస్ చెప్పారు. అత్యవసర నిర్వహణ కేంద్రాల ద్వారా నిరంతరం పరిస్థితిని అంచనావేస్తూ తీరప్రాంతవాసులను అప్రమత్తం చేస్తామన్నారు.