Powerful
-
ప్రపంచ శ్రేయస్సుకు యోగా శక్తివంతమైన సాధనం: మోదీ
శ్రీనగర్: యోగాను ప్రపంచ శ్రేయస్సుకు పనిచేసే శక్తివంతమైన ఉపకరణంగా నేడు అందరూ భావిస్తున్నా రని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడం ద్వారా జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మార్చే సామర్థ్యం యోగాకు ఉందన్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో యోగాను 50 వేల నుంచి 60 వేల మంది వరకు సాధన చేస్తుండటం సాధారణ విషయం కాదని తెలిపారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘దేవుడు, ఈశ్వరుడు లేదా అల్లాను చేరుకునే ఆధ్యాత్మిక ప్రయాణంగా యోగా గురించి సాధారణంగా చెబుతుంటారు. ఆధ్యాత్మిక కోణాన్ని వదిలేసి ప్రస్తుతానికి, మనం వ్యక్తిగత అభివృద్ధి కోసం యోగాపై దృష్టి పెట్టి, దానిని జీవితంలో ఒక భాగంగా ఆచరించవచ్చు. అలా చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత అభివృద్ధి సమాజ శ్రేయస్సుకు..అంతిమంగా అది మానవాళి శ్రేయస్సుకు దారితీస్తుంది’’ అని చెప్పారు.సియాచిన్‌లోనూ యోగా డేరాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారులు యోగా చేశారు. పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు దేశవ్యాప్తంగా పలుచోట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. సియాచిన్‌లో, రాజస్తాన్‌లోని థార్ ఏడారిలో, సముద్రంలో విమానవాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై సైనికులు యోగా చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో సాయుధ సిబ్బంది జల యోగ చేశారు. ఈ ఏడాది యోగా డే ఇతివృత్తం ‘యోగా ఫర్ సెల్ప్ అండ్ సొసైటీ’. -
గ్రాము ఖరీదు కోట్ల డాలర్లట!... ఏందబ్బా అది?
ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్ధం ఒక గ్రాము ధర 7,553 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) ఆ ఖరీదైన పదార్ధం పేరు యాంటీమాటర్. దీని గురించి ఎవరూ అంతగా వినివుండకపోవచ్చు. అయితే సైన్స్ ప్రపంచంలో ఇది ఒక రహస్యమైన, శక్తిమంతమైన పదార్ధం. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది పదార్థంతో సమానంగానే ఉంటుంది. కానీ ఇది సాధారణ పదార్ధానికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీమాటర్లోని ఉప పరమాణు కణాలు సాధారణ పదార్థానికి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని 20 వ శతాబ్దపు ప్రథమార్థంలో కనుగొన్నారు. యాంటీమాటర్ను మొట్టమొదట ప్రపంచానికి 1928 లో శాస్త్రవేత్త పాల్ డిరాక్ పరిచయం చేశారు. న్యూ సైంటిస్ట్ పత్రిక ఈ మహనీయుడిని ‘సర్ ఐజాక్ న్యూటన్ తరువాత గొప్ప బ్రిటిష్ సిద్ధాంతకర్త’ అని అభివర్ణించింది. నాటి నుంచి యాంటీమాటర్ శాస్త్రవేత్తలకు సైతం ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్టీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్.. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే మూడు వేల రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీమాటర్ అంతరిక్ష ప్రయాణానికి సమర్థవంతమైన ఇంధనంగా లేదా మన గ్రహానికి అత్యధిక శక్తి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. ఇక్కడ పదార్థం, యాంటీమాటర్ సమానంగా, సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రారంభ విశ్వంలో పదార్థం, యాంటీమాటర్ మధ్య కొంత అసమానత లేదా అసమతుల్యత ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది యాంటీమాటర్ కంటే పదార్థం అధికంగా ఉండటానికి దారితీసింది. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద పజిల్‌గా నిలిచింది. యాంటీమాటర్ను శాస్త్రీయ పరిశోధనలు, వైద్య అనువర్తనాలకు సాధనంగా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయిక పద్ధతులకు మించి మరింత ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునే రేడియేషన్ థెరపీకి ఉపయుక్తమవుతుంది. యాంటీహైడ్రోజన్ (యాంటీమాటర్తో తయారు చేసిన సరళమైన పరమాణువు) సమానత్వ సూత్రం, ఛార్జ్-పారిటీ-టైమ్ (సీపీటీ) సమరూపత వంటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను పరీక్షించడానికి యాంటీమాటర్ ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం యాంటీమాటర్ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థం. శాస్త్రవేత్తలు భూమిపైనే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లాంటి అధిక శక్తి కణాల యాక్సిలరేటర్ల ద్వారా యాంటీ పార్టికల్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం
అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. హమాస్ పని పట్టేందుకు గాజా స్ట్రిప్ వద్దే ప్రస్తుతం ఏకంగా 3 లక్షల మంది సైనికులను మోహరించింది! గాజాపై భూతల దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందనేందుకు ఇది కచి్చతమైన సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి అన్నివిధాలా అందుతున్న సాయంతో ఇజ్రాయెల్ సైనికంగా తేరిపార చూడలేనంతగా బలోపేతమైంది. మధ్యప్రాచ్యంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా భావించడమే ఇందుకు కారణం... సైనిక శక్తియుక్తులను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు, నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఆ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా సైన్యంలో చేరాల్సిందే. పురుషులు కనీసం 32 నెలల పాటు, మహిళలు రెండేళ్ల పాటు సైన్యంలో పని చేయాలి. ఇవిగాక అణు సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ సొంతమని చెబుతారు. అణు వార్ హెడ్లను మోసుకెళ్లగల జెరిషో మిసైళ్లు, విమానాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారు తొలినాళ్లలో సైనిక అవసరాలకు ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడ్డ ఇజ్రాయెల్, చూస్తుండగానే సంపన్న దేశాలకు కూడా అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ, నిఘా వ్యవస్థలు తదితరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది! ► 2018–22 మధ్య కనీసం 35 దేశాలు ఇజ్రాయెల్ నుంచి 320 కోట్ల డాలర్ల పై చిలుకు విలువైన ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి. ► వీటిలో ఏకంగా మూడో వంతు, అంటే 120 కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను భారతే దిగుమతి చేసుకుంది. ► ఆ ఐదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ ఆయుధ దిగుమతులు 270 కోట్ల డాలర్లకు చేరాయి. ఇవన్నీ కేవలం అమెరికా, జర్మనీ నుంచే కావడం విశేషం! అందులోనూ 210 కోట్ల డాలర్ల దిగుమతులు ఒక్క అమెరికా నుంచే జరిగాయి! ఇంజనీరింగ్ అద్భుతం.. ఐరన్‌డోమ్ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. స్వల్పశ్రేణి రాకెట్లను రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేయగల సామర్థ్యం దీని సొంతం... ► హెజ్బొల్లా తొలిసారి ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలకొద్దీ రాకెట్లతో దాడి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2006లో ఐరన్ డోమ్ నిర్మాణానికి ఆ దేశం తెర తీసింది. ► ఇది 2011లో వాడకంలోకి వచి్చంది. ► 2021 మొత్తంలో హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ప్రయోగించిన రాకెట్లలో 90 శాతానికి పైగా ఐరన్‌డోమ్ నిర్వీర్యం చేసి సత్తా చాటింది. ► డోమ్ నిర్మాణానికి అమెరికా ఎంతగానో సాయం చేసింది. ► 1946–2023 మధ్య ఏకంగా 12,400 కోట్ల డాలర్ల విలువైన సైనిక, రక్షణపరమైన సాయాన్ని అమెరికా నుంచి ఇజ్రాయెల్ అందుకుంది!! ► అమెరికా తన 2022 బడ్జెట్లో కేవలం ఇజ్రాయెల్‌కు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నిమిత్తమే ఏకంగా 150 కోట్ల డాలర్లు కేటాయించింది! – పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! ► పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! రక్షణపై భారీ వ్యయం చుట్టూ శత్రు సమూహమే ఉన్న నేపథ్యంలో రక్షణపై ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తుంది. 2022లో సైనిక అవసరాలకు ఏకంగా 2,340 కోట్ల డాలర్లు వెచ్చించింది. ► దేశ జనాభాపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ తలసరి సైనిక వ్యయం ఏకంగా 2,535 డాలర్లు. ఖతర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మయన్మార్, బంగ్లాదేశ్లని తాకనున్న మోచా తుఫాను..ఇప్పటికే వేలాదిమంది..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా మోచా తుపానుగా మారింది. తొలుత ఈ తుపాను ప్రభావం ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని భావించారు అధికారులు. కానీ తుపానుగా మారిన తర్వాత తన దిశ మార్చుకుని ఈశాన్య రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను మే 14న బంగ్లాదేశ్, మయాన్మార్ సరిహద్దుల్లో తీరం దాటనుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ మోచా తుపాను గంటకు హరికేన్ 4కి సమానంగా సుమారు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ తుపాను మయాన్మార్ రఖైన్ తీరంలోని సిట్వే మధ్య ఆదివారం ఉదయం తాకగానే బలహీనపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఒక లక్ష మందికిపైగా ప్రజలు ఉన్న పట్టణంలో దుకాణాలు, మార్కెట్లు మూసేశారు. ఇదిలా ఉండగా, మయన్మార్ జుంటా అధికారులు రఖైన్ తీరం వెంబడి ఉన్న గ్రామాలలో తరలింపు ప్రక్రియలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మయన్మార్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ రాఖైన్ ఎయిర్‌పోర్టు తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమానాలను సోమవారం వరకు నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో అధికారులు రోహింగ్యా శరణార్థులను ప్రమాదకర ప్రాంతాల నుంచి కమ్యూనిటీ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సిద్ర్ తుపాను తర్వాత మోచా తుపాను అత్యంత శక్తిమంతమైన తుపాన్ అని బంగ్లాదేశ్ వాతావరణ విభాగం అధిపతి రెహ్మన్ వెల్లడించారు. ఈపాటికే వేలాది మంది వాలంటీర్లు రోహింగ్యాలను ప్రమాదకర ప్రాంతాల నుంచి పాఠశాలలు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయా సరిహద్దులోని దీవుల్లో పనిచేసే వేలాదిమంది ఆయా ప్రాంతాలను విడిచి పారిపోయినట్లు కూడాఅధికారులు పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఓడరేవు చిట్టగాంగ్‌లో కార్యకలాపాలు నిలిపివేయడమే గాక పడవ రవాణా, చేపల వేటను కూడా నిషేధించారు అధికారులు. (చదవండి: క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో) -
ఇక్కడ ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి: ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అని, అతని నిర్ణయాలే అందరూ అనుసరిస్తారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మళ్లీ అధికారంలోకి రాకుండా బహిష్కరించేందుకు అవినీతి మాఫియాకు మద్దతిస్తోందంటూ సైనిక వ్యవస్థపై మండిపడ్డారు. ఈ మేరకు ఖాన్ జమాన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రజలు సుప్రీం కోర్టుకి అండగా నిలబడాలని కోరారు. తాను అధికారంలోకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే సైనిక వ్యవస్థ అవినీతి మాఫియా అయిన షరీఫ్‌లు, జర్దారీలకు అండగా ఉందని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దేశానికి పెను విషాదంగా అభివర్ణించారు. ఈ దిగుమతి చేసుకున్న ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోందని, ఈ తరుణంలో సుప్రీం కోర్టుకు అండగా నిలవాలని దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. ప్రస్తుతం పాక్‌లో ప్రజాస్వామ్యం సుప్రీం కోర్టు అనే దారంతో వేలాడుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ దానికి అండగా నిలబడాలని చెప్పారు. ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం మానేయాలని అన్నారు. మే 14న పంజాబ్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని దిక్కరిస్తూ ఉంటే ఈద్ తర్వాత వీధుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని ఖాన్ పిలుపునిచ్చారు. ముందు నుంచి తాను దీనికి నాయకత్వం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అవినీతి పాలకులను అంగీకరించమని ప్రజలను బలవంతం చేయలేమనే విషయాన్ని సైనిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే ఒక దేశం పురోగమిస్తున్నప్పుడూ హింసాత్మక వ్యూహాలు పనిచేయవనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. ఇంతకుముందు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతదారులను సైలంట్ చేసేలా హింసాత్మక కార్యకలాపాలకు దిగారని, ఐతే అవి పనిచేయలేదన్నారు. ఇక మీదట కూడా అవి పనిచేయవని నొక్కి చెప్పారు ఖాన్. తనను చంపడానికి కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ముస్లీం లీగ్ నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేయకూడదని అప్రకటిత నిషేధం విధించడం గమనార్హం. (చదవండి: నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు) -
ఆరోగ్య పంజాబ్ సృష్టికి తీవ్ర కృషి: సీఎం మాన్
అమృత్సర్: పంజాబ్‌ను ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ప్రతి రంగంలోనూ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆయన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి 400 ఆమ్ ఆద్మీ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ మాన్ సర్కార్ నెరవేరుస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేందుకు కొద్దిగా ఓపిక పట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 500 ఆమ్ ఆద్మీ క్లినిక్కులను ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని చెప్పారు. -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మహిళల్లో నిర్మలా సీతారామన్
-
మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం
భగవంతుని సృష్టిలో అంతర్భాగమైన కాలానికి ఉన్న శక్తి అద్భుతమైనది, అమోఘమైనది. కష్ట సుఖాలని, మంచి–చెడులని, కలతలని, కన్నీళ్ళని ఇలా అన్నిటిని తనలో లీనం చేసుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాలని మాత్రమే మిగులుస్తూ, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంటుంది.. మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మృత్యు ఒడిలోకి జారిపోతున్న వారిని చూస్తున్నా, ఆ దుఖాన్ని అనుభవిస్తున్నా, ఆ క్షణంలో ఎంతో విరక్తిని కల్గించి, కాలక్రమేణా ఆ దుఃఖభారాన్ని మరపింపచేసి, మన జీవితమే శాశ్వతమన్నంతగా మనసు మరల్చి మాయ చేస్తుంది. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది కనుక. ఇంతటి మహత్తరమైన, శక్తిమంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రయోగించే విధానాన్నిబట్టి కాలం అర్థం మారిపోతుంటుంది. ఏదో ఆలా కాలక్షేపం చేస్తున్నామండీ అని పెద్దలు అంటుంటారు. అంటే ‘రోజులు గడుపుతున్నాము’ అని అర్థం. ఏదైనా విచిత్ర సంఘటన కళ్ళబడితే ‘కలికాలం’,’పిదపకాలం’ అంటుంటారు. పురాణ పఠనం చేస్తుంటే దాన్ని ‘సత్కాలక్షేపం’ అంటుంటారు. ఇలా అర్థాలు ఎన్ని మారినా, కాలప్రభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాలం గడపటం అంటే ‘పొద్దుపుచ్చటం’ అని మాత్రమే కాదు. నిజానికి సద్వినియోగం చేసుకున్నా,దుర్వినియోగం చేసుకున్నా కాలం మాత్రం ఎవరికోసమూ ఆగదు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. అది సహజం. ఆశలు, ఆశయసాధనాలు, వివాహం, సంతానం, ఇలా ప్రౌఢ, యుక్తవయస్సులు గడచిపోతాయి. అది అప్పటికవసరం. ఇక మిగిలేది బాధ్యతలు తీరిన జీవితం, అలసిపోయిన శరీరం. మొదటి మూడు దశలలోనూ గిర్రున తిరిగిన కాలం, నాల్గవ దశలో, వయసు మీద పడేసరికి కొంత భారంగా గడుస్తున్నట్టనిపిస్తుంది. ఇంటి పెద్దగా ఎన్నో బాధ్యతలతో తలమునకలై, జీవనపోరాట ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఒక్కసారిగా విశ్రాంతి లభించటంతో కాలం స్తంభించినట్టుగా భావిస్తాం. కాని ఆలోచిస్తే ఈ విశ్రాంతి పెద్దలకు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే, నిబద్ధతతో కూడిన లక్ష్యసాధన, ఏ వయసు వారినైనా కాలాన్ని సద్వినియోగపరచుకునేలా చేస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోలేక పోతే, సమయం వృథా అయిపోయి, జీవితం నిస్సారం గా తయారవుతుంది. వయస్సులో ఉన్నవారు తమ ఆశయసిద్ధి కోసం అవిరామంగా కృషి చేయాలి. వయసు మీరిన వారు తమకు వయసు నేర్పిన పాఠాలు, అనుభవాలు భావితరాలకు పంచవచ్చు. తమలోని మరుగుపడిపోయిన కళలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం పొందవచ్చు. చక్కని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి వెళ్లి, అక్కడి వారి యోగక్షేమాలని విచారిస్తూ, వారి అనుభవాలను పంచుకుంటూ, తగిన సలహాలు, సూచనలు అందించవచ్చు. ఎదుటివారికి చేతనైనంత సహాయం చేస్తూ, హాయిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే కాస్త వయసు మీరాక, వీటికన్నిటికీ కాలాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి యోగసాధన జీవితంలో ఒక భాగం కావాలి. యోగసాధన శారీరక, మానసిక రుగ్మతలని దూరం చేస్తుంది. ఏ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. ఆ కాయ కాస్తుంది. సకల జీవరాసులు, కాలానికి అనుగుణంగా తమ తమ జీవనశైలిని మార్చుకుంటూ, కాలానికి కట్టుబడి జీవిస్తాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోవటంలో తన మేధస్సును మరింత చక్కగా ఉపయోగించుకోవాలి కదా. కర్మసిద్ధాంతం ప్రకారం జరగాల్సిందేదో అదే జరుగుతుందిలే అని వదిలి వేయకుండా మానవ ప్రయత్నం చేయాలి. భూత భవిష్యత్ ప్రభావాలని రంగరించుకుంటూ జీర్ణించుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ సాగాలి. ‘గతాన్ని తలచుకుని వగచవద్దు.. భవిష్యత్ గురించి భయపడవద్దు... వర్తమానంలో జీవించు’ అంటారు పెద్దలు. మనసుని కలచి వేసే సంఘటనలు, మధుర స్మృతులు– రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అయితే ఆ సంఘటనల వల్ల కలిగిన గాయం మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి అని తరచి చూసుకోవాలి. దానిద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాని దాని గురించి అతిగా వ్యధపడ కూడదు.అలాగే మనసుని సంతోషపెట్టే సంఘటనలను తలచుకోవడం వల్ల మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉదాహరణకి బాల్యస్మృతులు ఇంచుమించు అందరికీ ఆనందం కలిగించేవే. ఇక భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కానీ అంతకే పరిమితమైపోకుండా, ఆ కలని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. – అడవి అన్నపూర్ణ -
ఫిజిలో భారీ భూకంపం
సౌత్ పసిఫిక్ ద్వీప దేశం ఫిజిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుఝామున రిక్టర్ స్కేల్ పై 7.9 తీవ్రతతో భూమి కంపించింది. సుమారు 10-15 నిమిషాలపాటు భూమి కంపించినట్టు స్తానికుల సమాచారం. దీంతో పసిఫిక్ సునామీ కేంద్ర అధికారులు మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో జనజీవనం ప్రభావితమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శక్తివంతమైన భూకంపం ఫిజీ రాజధాని సువాను తాకింది. మొదట7.2 తీవ్రతతో తో రికార్డ్ చేయబడింది. కానీ 6.9 కు తగ్గించబడింది. దీంతో మొదట జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అయితే సముద్ర సమీపంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తీర ప్రాంత వాసులును సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎలాంటి నష్టం సంభవించిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ****Tsunami Message**** A magnitude 7.2 earthquake has occurred about 200km to the south-southwest of Fiji. A... https://t.co/3YSZlJLk2I — Na Draki Weather (@Nadraki) January 3, 2017 -
తమిళ రాజకీయాల్లో జయ తిరుగులేని శక్తి
-
స్మతి ఇరానీ.. వివాదాల మహారాణి..!
న్యూఢిల్లీః కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఆమె ఓ పవర్ ఫుల్ మంత్రే కాదు వివాదాల మహరాణి అంటూ ఛలోక్తులు విసిరింది. మీలో ఏ లక్షణాలను గుర్తించి మీకు ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవిని ఇచ్చారన్న ఓ టెలివిజన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించిన తీరు.. మరోసారి వివాదాన్ని తెచ్చిపెట్టింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా స్టూడియోలో ప్రేక్షకుల ముందు ఆమె అదే ప్రశ్నను పునరావృతం చేసి అక్కడివారిని రెచ్చగొట్టిన తీరుపై ఫారెన్ మీడియా మండి పడుతోంది. ఇప్పటికే నకిలీ డిగ్రీ ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి స్మతి ఇరానీపై విదేశీ మీడియా విమర్శలు ఎక్కుపెట్టింది. ఓ టీవీ స్టూడియోలో ఆమె ప్రవర్తించిన తీరును తప్పుపడుతోంది. టీవీ స్టూడియోలో స్మృతిని పాత్రికేయుడు అడిగిన ప్రశ్ననే... ఆమె రిపీట్ చేసి.. అక్కడున్న వారిని రెచ్చగొట్టడంతో వారంతా సదరు జర్నలిస్టుపైకి దూసుకొచ్చి.. దాదాపు కొట్టినంత పనిచేసిన నేపథ్యంలో విదేశీ మీడియా విరుచుకుపడుతోంది. మీలో ఎటువంటి లక్షణాలను గుర్తించి మీకు మంత్రి పదవి ఇచ్చారంటూ సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఆమెలో ఆగ్రహాన్ని తెప్పించిందో.. లేదా ఉద్దేశపూర్వకంగానే ఆమె ఆలా ప్రవర్తించిందో తెలియదు గానీ... అతడు అడిగిన ప్రశ్ననే స్టూడియోలోని ప్రేక్షకులముందు రిపీట్ చేసింది. దీంతో రెచ్చిపోయిన అక్కడి జనం.. కుర్చీలపైనుంచి దూకి.. వేదికపైకి దూసుకొచ్చిన పాత్రికేయుడ్ని కొట్టినంత పని చేశారు. అయితే అంతటి వ్యతిరేకత వస్తుందని ఆమె అనుకుందో లేదో గాని... వారి అభిమానానికి ఓ పక్క ఆనందించినా పరిస్థితులు అదుపు తప్పడంతో స్టేజిపైకి వచ్చిన వారిని వారించి, సదరు జర్నలిస్టును కొట్టకుండా కాపాడింది. ప్రముఖ రాజకీయ నాయకురాలు, నరేంద్రమోదీ ప్రభుత్వంలో మానవవనరుల శాఖామంత్రిగా కొనసాగుతున్న 40 ఏళ్ళ స్మృతి ఇరానీ.. తన విద్యార్హతల విషయంలో ఇప్పటికే పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. ప్రఖ్యాత టీవీ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులూ అందుకున్న ఆమె... రాజకీయాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకొన్నారు. దీనికి తోడు ఎప్పుడూ తన పదునైన ప్రసంగాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం కూడ ఆమెలోని మరో ప్రత్యేకతగా చెప్పాలి. లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్రమంత్రి... ఎన్నికల కమిషన్ కు సమర్పించిన మూడు అఫిడవిట్లలో తన విద్యార్హతలు ఒక్కోదాంట్లో ఒక్కో విధంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను మంత్రి పదవినుంచీ తొలగించాలన్న డిమాండ్లుకూడ వెల్లువెత్తాయి. ఫిబ్రవరి నెలలో జరిగిన సుమారు 42 విశ్వవిద్యాలయాలకు చెందిన అధిపతుల సమావేశంలోనూ స్మృతి ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఆమెను ఫోటో తీయాలని చూసిన ఓ ప్రొఫెసర్ ను దురుసుగా తోసేయడంకూడ పెద్ద దుమారమే రేపింది. అయితే ఆమె అజ్ఞానం, అహంకారం కలసి ప్రమాదకరంగా మారుతున్నాయంటూ అప్పట్లో రామచంద్ర గుహ అనే ఓ రాజకీయ చరిత్రకారుడు సైతం విమర్శించడం విశేషం. ఏదై ఏమైనా స్మృతి ఇరానీ ఇప్పుడు విదేశీ మీడియా దృష్టిలో పడి మరోసారి వివాదాలు ఎదుర్కొంటున్నారు. -
ఫేస్ బుక్ లో కాక పుట్టిస్తున్న'హాకా'!
ప్రపంచ దేశాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో అనేక సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. సుమారుగా ప్రతి సంప్రదాయ పద్ధతిలోనూ అక్కడి వేడుకలో ఉత్సాహాన్ని నింపడం కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి సన్నివేశాలు ఉద్వేగాన్ని కూడ నింపుతుంటాయి. అటువంటి వివాహ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఫేజ్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. రెండు రోజుల క్రితం పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పటివరకూ సుమారు కోటీ అరవై లక్షలమందిని ఆకట్టుకుంది. న్యూజిల్యాండ్ లో వివాహ వేడుక సమయంలో ఉత్సాహంగా నిర్వహించే సంబరాల్లో సంప్రదాయ నృత్యం 'హాకా' ఒకటి. బంధు మిత్రులంతా కలసిన వేళ.. నిర్వహించిన ఆ వార్ డ్యాన్స్ సన్నివేశం ఇప్పుడు ఫేస్ బుక్ వినియోగదారులను లక్షలమందిని అమితంగా ఆకట్టుకుంది. ఎందరో హృదయాలను దోచిన ఆ హాకా డ్యాన్స్ వీడియో... బెన్, అలియా ఆమ్ స్ట్రాంగ్ ల పెళ్ళి సందర్భంలోనిది. వధూవరులు.. దంపతులైన వేళ న్యూజిల్యాండ్ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులంతా కలసి ఉత్సాహంగా హాకా డ్యాన్స్ చేస్తారు. ఇలా నిర్వహించే సంప్రదాయ నృత్యాన్ని ఆ కుటుంబ గౌరవానికి చిహ్నంగా చెప్తారు. ఈ వేడుకలో పెళ్ళి కొడుకుతోపాటు అతని పెద్దన్న కార్యక్రమానికి నాయకత్వం వహించారు. పాటలకు లయబద్ధంగా అడుగులు కలుపుతూ సంప్రదాయ పద్ధతిలో చేసే ఆ నృత్యం.. అక్కడి వారిని భావోద్వేగానికి లోను చేసింది. హాకా డ్యాన్స్ సమయంలో సందర్భానుసారంగా పాడే పాటలు... విన్నవారు సైతం కన్నీరు పెట్టకున్నారు. ఉత్సాహంగా అంతా కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఉద్వేగభరిత సన్నివేశం లక్షలమంది మనసులను దోచింది. వధూవరులిద్దరూ కూడ కన్నీటిని తుడుచుకొని ఆ వేడుకలో భాగం పంచుకోవడం అందరికీ ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఫేస్ బుక్ లో వీడియోను చూసిన వారంతా వధూవరులు సైతం డ్యాన్స్ చేసిన తీరును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తెలుగువారి వివాహ సంప్రదాయంలోని అప్పగింతల పాటలు కూడ ఇటువంటి సందర్భాన్ని స్ఫురింపజేస్తాయి. పెళ్ళి కుమార్తెను భర్తకు, వారి కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో పాడే పాటలు, వాయించే మ్యూజిక్ అక్కడున్నవారిని కన్నీరు పెట్టించడం కనిపిస్తుంది. న్యూజిల్యాండ్ హాకా డ్యాన్స్ లో కూడ అటువంటి సందర్భమే మనకు కళ్ళకు కడుతుంది. -
అప్పుడు నన్ను వేధించారు!
ప్రియాంకా చోప్రా తన చిన్నతనంలో అమెరికాలో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారట. దాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ప్రియాంక చెబుతూ - ‘‘అప్పుడు నాకు పదహారేళ్లు. అమెరికాలో చదువుకుంటున్నా. తోటి పిల్లలతో సరదాగా ఉంటూ, ఆడుతూ, పాడుతూ చదువుకుందామనుకున్న నాకు నిరాశే మిగిలింది. అక్కడి పిల్లలు నన్ను ‘బ్రౌనీ’ అని పిలవడం మొదలుపెట్టారు. భారతీయులను అలా పిలుస్తారని నాకు అప్పుడే తెలిసింది. కానీ, భారతీయులంటే ఎందుకింత చిన్నచూపు అని కుమిలిపోయేదాన్ని. ‘నువ్వెక్కణ్ణుంచి వచ్చావో అక్కడికే వెళ్లిపో’ అని వేధించడం మొదలుపెట్టారు. పిరికిగా వెనక్కి వెళ్లిపోకూడదనుకున్నా. చాన్నాళ్లు భరించా. చివరకు చదువుని మధ్యలో ఆపేసి ఇండియా వచ్చేశా’’ అన్నారు. అప్పట్లో చేదు అనుభవాన్ని మిగిల్చిన అదే అమెరికా, ఇప్పుడు తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తోందని ప్రియాంక చెబుతూ- ‘‘అమెరికన్ టీవీ రియాల్టీ షో ‘క్వాంటికో’లో ఓ పవర్ఫుల్ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. నా నటన చూసి, అక్కడివాళ్లు ‘భేష్ ప్రియాంక’ అన్నారు. అది చాలు నాకు’’ అని ఉద్వేగంగా చెప్పారు. -
డైలాగ్ పవర్ ను పెంచేసిన బాలయ్య
-
సమాచార ఉత్తి చట్టం
=హైదరాబాద్ జిల్లాలో చట్టం అమలు అంతంతే.. =సాకులు చెబుతూ తప్పించుకుంటున్న అధికారులు =వందలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే.. సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని రూపుమాపేందుకు..ప్రజలు అడిగిన సమాచారాన్ని సమగ్రంగా ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల ఎంతో శక్తివంతమైన చట్టం ఆయా ప్రభుత్వ కార్యాలయాల గోడలకు అలంకారప్రాయంగా మారింది. పేరుకు చట్టం చేసినా నానాసాకులు చెబుతూ సమాచారం ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. దీంతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునేందుకు హైదరాబాద్ జిల్లాలో ముందుకు రావడం లేదు. ఒకప్పుడు పార్లమెంట్, శాసనసభసభ్యులకు మాత్రమే ఉండే సమాచారం కోరే హక్కును, ప్రజలందరికి కల్పిస్తూ భారత ప్రభుత్వం 2005 అక్టోబరు నుంచి ఆర్టీఐ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని భారత పౌరులెవరైనా కేవలం వినతిపత్రం ద్వారా పొందవచ్చు. అడగకున్నా అందుబాట్లో..: ప్రజలెవరూ సమాచారం అడగకపోయినప్పటికీ ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, శాఖకు సంబంధించిన విధివిధానాలు, ఉద్యోగుల, అధికారుల బాధ్యతలు..తదితర 16 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని (నోటీసుబోర్డులో గానీ, అధికారిక వెబ్సైట్లోగానీ)అందుబాట్లో ఉంచాలి. అయితే...చట్టం అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగుల సమాచారాన్ని ఇచ్చే నాథుడే లేడు. ఇంకొం దరు అధికారులైతే అర్థం లేని సాకులు చూపుతూ సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఎలాగంటే ఆయా సంస్థల్లో వందల కొద్దీ ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడమే ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇలా సాకులు చెబుతున్నారు.. దరఖాస్తు రుసుం నగదురూపంలో చెల్లించేందుకు చట్టం అవకాశం కల్పిస్తున్నా..డీడీలు, పోస్టల్ ఆర్డర్లు జత చేయాలంటూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నారేగానీ, దరఖాస్తుదారుడు స్పష్టంగా అడిగినా..అతను కోరిన సమాచారాన్ని ఇవ్వడంలేదు. అడిగిన సమాచారంతోపాటు ఆ సమాచారం సకాలంలో పొందే హక్కు చట్టం కల్పిస్తున్నా..దరఖాస్తు చేయడంలో లోపాలున్నాయంటూ నెలల తరబడి సమాచారం ఇవ్వకుండా తిప్పుకుటున్నారు. సుపరిపాలన కేంద్రం సహకారంతో చేసే ప్రయత్నాలు వెబ్‌సైట్‌కే పరిమితమయ్యాయి. పూర్తిస్థాయిలో దరఖాస్తు నింపలేదని, కోరిన సమాచారం స్పష్టంగా లేదని 65శాతం దరఖాస్తులను తిరిస్కరిస్తున్నారు. సమాచారమివ్వడం ఇష్టం లేని అధికారులు కమిషన్ ముందు డొంక తిరుగుడు సమాధానాలతో దరఖాస్తుదారుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. అప్పీలు చేస్తే షోకాజ్ నోటీసులిచ్చి రెండోమారు దరఖాస్తు చేసుకోవాలని చేతులు దులుపుకుంటున్నారు. సమాచార కమిషన్ విశ్రాంత అధికారులకు, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు లేకపోలేదు. అగ్ర స్థానమే ఇస్తున్నాం.. హైదరాబాద్ రెవెన్యూ విభాగంలో సమాచార హక్కు చట్టం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాం. కలెక్టరేట్‌తోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాల్లో కూడా దరఖాస్తుల పెండింగ్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. తహశీల్దారు కార్యాలయాలు, ఆర్డీవో ఆఫీసుల నుంచి సమాచారం రాగానే వీటిని కూడా క్లియర్ చేస్తాం. - అశోక్‌కుమార్, హైదరాబాద్ డీఆర్వో -
మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మపదార్థం కాదు!
‘నాకు అంత ఐడియా లేదండి... మా ఆయనే చూసుకుంటారు డబ్బు విషయాలన్నీ’ అని మహిళలు అనే రోజులు కావివి. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన సెన్సెక్స్, బ్యాంకులు, పెద్ద పెద్ద సంస్థలు వంటివే నేడు మహిళల నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలోనూ నాకర్థం కావు అనుకోవడం మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోవడమే. మహిళ పొదుపులో స్ట్రాంగ్, పెట్టుబడుల్లో వీక్... కానీ ఈ సిద్ధాంతం పాతబడే రోజులు వచ్చేశాయి. ఈ వారం ఆధునిక మదుపు పద్ధతుల్లో ప్రాథమిక మార్గమైన మ్యూచువల్ఫండ్స్పె అవగాహన పెంచుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శక్తిమంతమైన మదుపు విధానాల్లో మ్యూచువల్ ఫండ్ ఒకటి. వీటిపై వచ్చే ప్రాథమిక ప్రశ్నలు-సమాధానాలు. 1. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఇది ఒక ఉమ్మడి నిధి. సంప్రదాయ పొదుపు పద్ధతుల కంటే కాస్త ఎక్కువ ఆదాయాన్నిచ్చేది. ఆధునిక పొదుపు పద్ధతుల్లో కాస్త తక్కువ రిస్క్‌తో కూడినది. నిరంతరం మార్పులక గురయ్యే షేర్లలో పెట్టుబడి పెట్టడం తెలియనపుడు ఏదైనా ఒక కంపెనీ ఒక ఉమ్మడి నిధిని ఏర్పాటుచేసి దానికో ‘కర్త’ను నియమించి షేర్లలో, బాండ్లలో మదుపు చేస్తుంది. వీలైనంత లాభదాయకంగా అతను ఈ ఉమ్మడి నిధిని షేర్లలో మదుపు చేస్తారు. ఈ ఉమ్మడి నిధిలో ప్రతి పౌరుడు తనకు నచ్చినంత మొత్తాన్ని మదుపు చేసుకోవచ్చు. వచ్చిన లాభాలను మనం మదుపు చేసిన శాతాన్ని బట్టి మనకు పంచుతారు. ఉదా: రెండు ఎకరాలున్న 50 మంది రైతులు తమ చిన్న పొలాలను అన్నీ కలిపి ఒకే వ్యక్తికి ఇచ్చారనుకుందాం. అతను పంట వేస్తాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అందరూ సమానంగా పంచుకుంటారు. ఫలితం ఏదైనా కౌలుదారుకు కొంత ఫీజు ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాగే పనిచేస్తాయి. 2. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరైనా పెట్టొచ్చా? ఎవరైనా పెట్టొచ్చు. యాభై వేలకు పైన పెట్టుబడి పెట్టాలంటే పాన్‌కార్డ్ ఉండాలి. అంతకంటే తక్కువ అయితే అవసరం లేదు. 3. స్త్రీలకు మ్యూచువల్ ఫండ్స్‌లో మినహాయింపులేమైనా ఉంటాయా? ఇదో ఉమ్మడి మదుపు నిధి కాబట్టి ప్రత్యేకించి మహిళలకు మినహాయింపులు ఏమీ ఉండవు. 4. మ్యూచువల్ ఫండ్స్‌లో దాచడం శ్రేయస్కరమేనా? అసలుకు కూడా హామీ ఉండదు. కానీ, షేర్ల కంటే శ్రేయస్కరమే. మార్కెట్‌ను బట్టే లాభష్టాలుంటాయి. 5. అంత శ్రేయస్కరం కానపుడు ఎందుకు పెట్టాలి? మనదేశంలో ధరలుపెరుగుదల-డబ్బు విలువ పడిపోవడం (ద్రవ్యోల్బణం) పెద్ద సమస్య. దీన్ని అధిగమించాలంటే మన పొదుపు రాబడి పెరగాలి. సాధారణ పద్ధతుల్లో ఆశించినంత రాదు. అందుకే కొంత నష్టభయం ఉన్నా కూడా వీటిలో పెట్టడం వల్ల ఎక్కువ ఆదాయానికి ఆస్కారం ఉంటుంది. 6. ‘అసలు’కు ఎసరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న డబ్బంతా ఒకేసారి కాకుండా... ఒక ఫండ్ ఎంచుకుని అందులోనే ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం (ఉదా: రూ.500) పెట్టుకుంటూ పోవడం శ్రేయస్కరం. ఇలా రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం అలా పెడితే... నష్టం దాదాపు ఉండదు. - వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు