ఫిజిలో భారీ భూకంపం | Powerful, shallow quake hits Fiji, power cuts ensue | Sakshi
Sakshi News home page

ఫిజిలో భారీ భూకంపం

Published Wed, Jan 4 2017 8:26 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

ఫిజిలో భారీ  భూకంపం - Sakshi

ఫిజిలో భారీ భూకంపం

సౌత్ పసిఫిక్  ద్వీప దేశం ఫిజిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుఝామున రిక్టర్ స్కేల్ పై 7.9 తీవ్రతతో  భూమి కంపించింది. సుమారు 10-15  నిమిషాలపాటు భూమి కంపించినట్టు స్తానికుల  సమాచారం. దీంతో  పసిఫిక్  సునామీ కేంద్ర అధికారులు మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు.  దీని ప్రభావంతో జనజీవనం  ప్రభావితమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.   అధికారుల  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శక్తివంతమైన  భూకంపం  ఫిజీ రాజధాని సువాను తాకింది. మొదట7.2 తీవ్రతతో తో రికార్డ్ చేయబడింది. కానీ 6.9 కు తగ్గించబడింది. దీంతో మొదట జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అయితే సముద్ర సమీపంలో  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  హెచ్చరించారు. తీర ప్రాంత వాసులును సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎలాంటి నష్టం సంభవించిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.






 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement