అదానీ పవర్‌కు చెందిన.. అదానీ పవర్ జార్ఖండ్ లిమిటెడ్ (APJL) నవంబర్ 7 నాటికి దాదాపు 850 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,200 కోట్లు) బకాయిలు చెల్లించకపోతే బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఇప్పటికే బకాయిలు సరిగ్గా చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను సగానికి తగ్గించేసింది. కాగా ఇప్పుడు రూ. 7200 కోట్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయనుంది. పవర్ గ్రిడ్ బంగ్లాదేశ్ పీఎల్సీ ప్రకారం.. అదానీ ప్లాంట్ గురువారం రాత్రి దాని ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. దీంతో దేశంలో సుమారు 1600 మెగావాట్స్ కంటే ఎక్కువ కొరత ఏర్పడింది.
1496 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అదానీ పవర్ ప్లాంట్.. ఒక ఆపరేషనల్ యూనిట్ నుంచి కేవలం 700 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేసింది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (PDB)కి ముందస్తు లేఖలో.. అదానీ పవర్ అక్టోబర్ 30 లోపు బకాయిలను క్లియరెన్స్ చేయాలని ఇప్పటికే కోరింది. లేఖలోని.. చెల్లింపులు చేయడంలో విఫలమైతే విద్యుత్ సరఫరాను నిలిపివేయవలసి ఉంటుందని పేర్కొంది.
ఇదీ చదవండి: ధరల తగ్గుదలపై వరల్డ్ బ్యాంక్ క్లారిటీ
బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాను తొలగించిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటయింది. ఆ తరువాత అదానీ బకాయిల పరిష్కారం కోసం తన డిమాండ్లను తీవ్రతరం చేసింది. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఈ సమస్యకు సంబంధించి ప్రధాన సలహాదారు యూనస్‌తో నేరుగా సంభాషించారు.
Comments
Please login to add a commentAdd a comment