Fiji
-
మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం
ఫిజీ ప్రధానమంత్రి సితివేణి రబుకా ప్రమాదానికి గురయ్యారు. మొబైల్ ఫోన్ చూస్తూ కింద పడిపోవడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీంతో ప్రధాని చైనా అధికారిక పర్యటనను అనూహత్యంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిజీలోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి గెంగ్డూలో జరిగే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల ప్రారంభోత్సవానికి ఫిజీ ప్రధాని హాజరు కావాల్సి ఉంది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక ముఖ్యమైన దౌత్య కార్యక్రమంగా నిలవనుంది. అయితే తలకు గాయం కావడంతో చైనా పర్యటన అకస్మాత్తుగా రద్దు అయ్యిందని స్వయంగా ప్రధాని వెల్లడించారు. ఫోన్‌ని చూస్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డానని, ఫలితంగా తలకు గాయమైందని తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు రాత్రి పర్యటకు రావడం లేదని చైనాకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే! ‘బుధవారం ఉదయం ప్రభుత్వానికి చెందిన కొత్త బిల్డింగ్ ప్రవేశ ద్వారం వద్ద మొబైల్ చూస్తూ పొరపాటున మెట్లు జారి కిందపడిపోయాను. ఈ ప్రమాదంలో తలకు గాయమైంది. ఇప్పుడే ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాను’ అని పేర్కొన్నారు. ఇక వీడియోలో అతని చొక్కాపై కొద్దిగా రక్తపు మరకలు సైతం కనిపిస్తున్నాయి. దీంతో తలకు దెబ్బ గట్టిగానే తగిలినట్లు తెలుస్తోంది. కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అధికారిక పర్యటనల కోసం భవిష్యత్తులో చైనా నుంచి ఆహ్వానాలు అందుతాయని రబుకా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పర్యటన రద్దు ఫిజీ, చైనాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. An update on the deferment of my trip to China due to an injury that I sustained earlier today due to a misstep at the entrance to the New Wing of Government Buildings. pic.twitter.com/SYKrRUQPHF — Sitiveni Rabuka (@slrabuka) July 25, 2023 -
భారత ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
సువా: భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విదేశీ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఫసిఫిక్ ద్వీప దేశం ఫిజీ తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ని ప్రధాని మోదీకి అందజేసింది. ప్రపంచ నాయకత్వ లక్షణాలకుగానూ ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు ఫిజీ ప్రకటించింది. తమ దేశ పౌరుడు కాని వ్యక్తికి ఈ పురస్కారం అందించడం అత్యంత అరుదని ఈ సందర్భంగా ఫిజీ ప్రకటించుకుంది. ఫిజీ ప్రధాని సిటివేని లిగమామడ రబుక నుంచి ఆ మెడల్‌ను భారత ప్రధాని మోదీ అందుకున్నారు. భారత్‌కు దక్కిన పెద్ద గౌరవమని ఈ సందర్భంగా భారత ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ చాలా దేశాలు ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందజేశాయి. PM @narendramodi has been conferred the highest honour of Fiji, the Companion of the Order of Fiji. It was presented to him by PM @slrabuka. pic.twitter.com/XojxUIKLNm — PMO India (@PMOIndia) May 22, 2023 ఇదిలా ఉంటే. పాపువా గినియా తరపు నుంచి కూడా ప్రధాని మోదీ ఓ గౌరవాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహును పాపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే.. భారత ప్రధాని మోదీకి అందించారు. Papua New Guinea has conferred the Companion of the Order of Logohu on PM @narendramodi. It was presented to him by Papua New Guinea Governor General Sir Bob Dadae. pic.twitter.com/0Xki0ibW8D — PMO India (@PMOIndia) May 22, 2023 జీ-7 సదస్సు కోసం ప్రత్యేక అతిథిగా జపాన్(హిరోషిమా) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ప్రపంచ దేశల అధినేతలతో భేటీ అయ్యారు. ఆపై అటు నుంచి అటే ఫసిఫిక్ ద్వీప దేశాల్లో పర్యటిస్తున్నారాయన. ఇదీ చదవండి: ఐరాసను సంస్కరించాల్సిందే! -
ఫిజీ ప్రధానిగా రబుకా
మెల్బోర్న్: ఫిజీ ప్రధానిగా మాజీ మిలటరీ కమాండర్ సిటివెని రబుకా (74) శనివారం ప్రమాణం చేశారు. పీపుల్స్ అలయెన్స్ పార్టీకి చెందిన ఆయన మరో రెండు పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. 16 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న ఫ్రాంక్ బైనిమరామ వైదొలిగేందుకు నిరాకరించడంతో ఉత్కంఠ కొనసాగింది. పార్లమెంట్లో విశ్వాస తీర్మానంలో రబుకా ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఫిజీలో గత 35 ఏళ్లలో నాలుగుసార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. -
రగ్భీలో దుమ్మురేపిన ఫిజీ.. వరుసగా రెండోసారి స్వర్ణం
టోక్యో: పసిఫిక్ మహా సముద్రంలోని ఓ చిరు దీవి ఫిజీ దేశం తన రగ్బీ టైటిల్ నిలబెట్టుకుంది. తద్వారా వరుస ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఫిజీ జట్టు 27–12 స్కోరు తేడాతో ప్రపంచకప్ చాంపియన్ న్యూజిలాండ్‌పై నెగ్గింది. ఇటు ఫిజీ, అటు కివీస్... ఇరు దేశాల జాతీయ క్రీడ రగ్బీనే! పైగా ఫైనల్ కూడా ఈ రెండు పసిఫిక్ జట్ల మధ్యే జరగడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో ఫిజీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. తొలి అర్ధభాగంలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. 19–12తో ముగించారు. ఇక ద్వితీయార్ధంలో అయితే న్యూజిలాండ్‌ను ఒక్క పాయింట్ కూడా చేయనీకుండా పరిపూర్ణ ఆధిపత్యాన్ని చాటారు. రెండో అర్ధ భాగంలో ఫిజీ మరో 8 పాయింట్లు చేస్తే కివీస్ స్కోరే చేయలేదు. ఈ విజయం కోసం, ఒలింపిక్స్ స్వర్ణం కోసం రగ్బీ జట్టు ఓ రకంగా యజ్ఞమే చేసింది. కోవిడ్ కోరలకు చిక్కకుండా ఒకట్రెండు కాదు నెలల తరబడి బయో బబుల్‌లో గడిపింది. కఠోర సాధన చేసింది. ఇప్పుడు అనుకున్నది సాధించినా... వెంటనే కుటుంబాలను కలిసే వీల్లేదు. కఠినమైన క్వారంటైన్ పూర్తయ్యాకే టైటిల్ సంతోషాన్ని ఫిజీ వాసులతో, కుటుంబసభ్యులతో పంచుకోవాల్సి ఉంటుంది. కివీస్ రజతంతో సరిపెట్టుకోగా... కాంస్య పతక పోరులో అర్జెంటీనా 17–12తో గత రన్నరప్ బ్రిటన్ను ఓడించింది. రగ్బీ క్రీడాంశాన్ని 2016 రియో ఒలింపిక్స్‌లోనే ప్రవేశపెట్టారు. నాడు హంగామా... ‘రియో’లోనే ఈ ఆట రగ్బీ సెవెన్ పేరుతో విశ్వక్రీడల్లో భాగమైంది. తమకు ఇష్టమైన క్రీడలో ఫిజీ ఆటగాళ్లు ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన కనబరిచారు. చివరకు ఒలింపిక్స్ రగ్బీ సెవెన్లో బంగారు బోణీ కొట్టారు. ఈ ఘనతను, ఘనవిజయాన్ని ఆటగాళ్లకు ప్రోత్సాహంతో, భారీ ప్రైజ్‌మనీతో సరిపెట్టకుండా ఫిజీ ప్రభుత్వం చిరస్మరణీయం చేసుకోవాలని నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్‌తో 7 ఫిజీ డాలర్ నోటును ముద్రించింది. నిజానికి ఏ దేశంలోనూ 7 విలువైన నోటు, నాణెం లేనేలేదు. అంతా 5, 10, 20, 50, 100 విలువల్లోనే ఉంటాయి. కానీ ఫిజీ తమ జట్టు సాధించిన రగ్బీ సెవెన్ ‘గోల్డ్’కు గుర్తుగా ఈ నోట్లను ముద్రించింది. అన్నట్లు కేవలం 9 లక్షల జనాభా కలిగిన ఫిజీ దేశానికి ఒలింపిక్స్ చరిత్రలో అదే తొలి స్వర్ణం! -
కోవిడ్ టీకా తీసుకోలేదా..? అయితే ప్రభుత్వ ఉద్యోగం ఊడినట్టే!
సువా, ఫిజి: కరోనా మహమ్మారి వివిధ రూపాంతరాలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న వేళ, పలు దేశాలు వ్యాక్సిన్ వేసుకోవడాన్ని తప్పనిసరి చేశాయి. అయినప్పటికీ కొందరు టీకాలపై అపనమ్మకాలు, అపోహల కారణంగా ఇప్పటికీ టీకాలు వేసుకునేందుకు ముందుకురావడం లేదు. దీంతో వారు టీకాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు చాలా దేశాలు వెరైటీ బహుమతులు కూడా ప్రకటించాయి. అయినా ముందుకురాని కొందరి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు పలు దేశాలు సన్నద్ధమయ్యాయి. తాజాగా తమ దేశ పౌరులకు కోవిడ్ టీకాను తప్పనిసరి చేయాలని ఫిజి దేశ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది. ‘NO JABS, NO JOB‘ అంటూ ఫిజి ప్రధాని ఫ్రాంక్ బైనిమారామా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్, భౌతిక దూరం నిబంధనలను దేశ ప్రజలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. డెల్టా వేరియంట్ భయాల నేపథ్యంలో కోవిడ్ టీకాలు తీసుకోకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని ఫిజి ప్రధాని హెచ్చరించారు. ఆగస్టు 15నాటికి మొదటి డోస్ టీకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులంతా సెలవులపై వెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. నవంబరు ఒకటికల్లా వారు రెండో డోస్ వేయించుకోని పక్షంలో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ప్రైవేటు ఉద్యోగులు ఆగస్టు ఒకటి నాటికల్లా మొదటి డోస్ వేయించుకోని పక్షంలో భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 9.3 లక్షల జనాభా కలిగిన దక్షిణ పసిఫిక్ దేశమైన ఫిజిలో ఇప్పటి వరకు 3.40 లక్షల మంది జనం మాత్రమే టీకాలు తీసుకున్నారు. మిగిలిన వాళ్లు టీకాలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అయితే, టీకాలు తీసుకోలేదన్న కారణంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫిజి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా…మరికొందరు దీన్ని నియంతృత్వ పోకడగా అభివర్ణిస్తూ వ్యతిరేకిస్తున్నారు. -
మరో 80 ఏళ్లలో మాల్దీవులు మాయం..!
మనదేశంలో సెలబ్రిటీల ఫెవరెట్ హాలీడే స్పాట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది మాల్దీవులు. మరీ ముఖ్యంగా బీటౌన్ లవ్ కపుల్స్‌కి మాల్దీవులంటే మహా ఇష్టం. ఇక హీరో, హీరోయిన్లు ఏమాత్రం గ్యాప్ దొరికినా చాలు.. మాల్దీవుల్లో వాలిపోతారు. కొత్తగా పెళ్లైన బడాబాబులు హానీమూన్ ట్రిప్ కోసం కూడా మాల్దీవులనే సెలక్ట్ చేసుకుంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద దీరుతూ.. ఏంజాయ్ చేస్తూ.. రోజువారి ఒత్తిడి నుంచి దూరమయ్యి.. రిఫ్రెష్ అయ్యి వస్తారు. అయితే మాల్దీవ్స్ లవర్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్. మరో 80 ఏళ్లలో అనగా 2100 నాటికి మాల్దీవులు మాయమవుతాయట.. అంటే పూర్తిగా నీటిలో మునిగిపోతాయని నివేదిక వెల్లడించింది. మాల్దీవ్స్, ఫిజితో పాటు మరో మూడు అందమైన దీవులు నీటిలో మునిగిపోతాయంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న 60 ఏళ్లలోపు ఈ ద్వీపాలు నీటిలో మునిగిపోతాయని, గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న సముద్ర మట్టం 40 వ దశకంలో, అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్బర్గ్ సముద్రంలో నీరు పెరుగుతున్నట్లు అనుమానించి.. ఒక అధ్యయనం చేశాడు. దీన్ని ధ్రువీకరించుకోవడానికి గుటెన్బర్గ్ గత 100 సంవత్సరాల డేటాను అధ్యయనం చేశాడు. అతని అనుమానం నిజమని తేలింది. ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోందని గుటెన్బర్గ్ గమనించాడు. 90 వ దశకంలో, నాసా కూడా దీనిని ధ్రువీకరించింది. అప్పటి నుంచి, గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తే సమస్యల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ ప్రారంభమయ్యింది. 2100 నాటికి మాయమవనున్న మాల్దీవులు సముద్రపు నీరు వేగంగా పెరగడం వల్ల 2100 చివరి నాటికి మాల్దీవులు నీటిలో మునిగిపోతాయని ప్రపంచ బ్యాంక్, అనేక ఇతర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫిజీ కూడా ముప్పు అందమైన బీచ్‌లతో తయారైన ఫిజీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఫిజీలో అనేక మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే సముద్ర మట్టం పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ అందమైన దేశం కూడా నీటిలో మునిగిపోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏటా పెరుగుతున్న సముద్ర నీటి మట్టం పలావు, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. నీటి మట్టం పెరగడం వల్ల సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఎదుర్కొనబోతుంది. పలావు నేషనల్ వెదర్ సర్వీస్ ఆఫీస్ అండ్ పసిఫిక్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రోగ్రాం ప్రకారం 1993 నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ సముద్రపు నీరు 0.35 అంగుళాల చొప్పున పెరుగుతోంది. ఇప్పటికే నీట మునుగుతున్న రిపోసోలోమోన్ ద్వీపం రీడర్స్ డైజెస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, రిపోసోలోమోన్ ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది సుమారు 1000 ద్వీపాలు ఉంటాయి. ఇవి ఇప్పుడు నీటిలో మునిగిపోతున్నాయి అని తెలిపారు శాస్త్రవేత్తలు. చదవండి: ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్ -
ఫిజీలో భారీ భూకంపం
దక్షిణ పసిఫిక్ సముద్రంలో దీవుల సమూహమైన ఫిజీలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.2 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు భూమి కంపించడం మొదలైందని స్థానికలు చెప్పారు. ఒక్క సారిగి భూమి కంపించడం మొదలవడంలో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలోంచి బయటకి పరుగులు తీశారు. అయితే భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం తెలియాల్సివుంది. -
ఫిజీ దీవుల్లో భారీ భూకంపం
-
ఫిజిలో భారీ భూకంపం
సౌత్ పసిఫిక్ ద్వీప దేశం ఫిజిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుఝామున రిక్టర్ స్కేల్ పై 7.9 తీవ్రతతో భూమి కంపించింది. సుమారు 10-15 నిమిషాలపాటు భూమి కంపించినట్టు స్తానికుల సమాచారం. దీంతో పసిఫిక్ సునామీ కేంద్ర అధికారులు మొదట సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో జనజీవనం ప్రభావితమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శక్తివంతమైన భూకంపం ఫిజీ రాజధాని సువాను తాకింది. మొదట7.2 తీవ్రతతో తో రికార్డ్ చేయబడింది. కానీ 6.9 కు తగ్గించబడింది. దీంతో మొదట జారీ చేసిన సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. అయితే సముద్ర సమీపంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తీర ప్రాంత వాసులును సురక్షి ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎలాంటి నష్టం సంభవించిందన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ****Tsunami Message**** A magnitude 7.2 earthquake has occurred about 200km to the south-southwest of Fiji. A... https://t.co/3YSZlJLk2I — Na Draki Weather (@Nadraki) January 3, 2017 -
ఫిజీలో భూకంపం
వెల్లింగ్టన్: ఫిజీలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు అయిందని యూఎస్ భూకంప పరిశోధకులు వెల్లడించారు. అయితే సునామి వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నారు. స్థానిక కాలమాన ప్రకారం..ఉదయం 9.28 గంటలకు ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఫిజీలోని ఎండోయి ఐలాండ్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే తన వెబ్ సైట్లో వెల్లడించింది. -
ఒలింపిక్స్ చరిత్రలో ఫిజీకి తొలి స్వర్ణం
రియో ఒలింపిక్స్ రగ్బీ సెవన్స్ టైటిల్‌ను ఫిజీ జట్టు గెలుచుకుంది.ఫైనల్లో బ్రిటన్‌పై 43-7తో గెలిచిన ఫిజీకి.. ఆ దేశ చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్స్ మెడల్ కావడం విశేషం. 92 ఏళ్ల విరామం తర్వాత ఈసారే ఒలింపిక్స్‌లోకి రగ్బీ ప్రవేశపెట్టారు. క్వార్టర్స్‌లో అమెరికాను 24-19తో, సెమీస్‌లో జపాన్ను 20-5తో ఓడించిన ఫిజీ.. ఫైనల్స్‌లో భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. -
చిన్న దీవి నుంచి ప్రపంచంలో అతిపెద్ద పదవికి..
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితికి కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు. దాదాపు 193 దేశాల సభ్యత్వం గల ఈ అంతర్జాతీయ సంస్థకు అతి చిన్న ద్వీపం అయిన ఫిజీకి చెందిన వ్యక్తి ఈ అత్యున్నత బాధ్యతలు స్వీకరించనున్నారు. బాన్ కీ మూన్ స్థానంలో ఆయన కొనసాగనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు సోమవారం ఎన్నికలు జరగగా ఫిజీకి చెందిన పీటర్ థామ్సన్ విజయం సాధించారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ 94 ఓట్లు పోలయ్యాయి. ఆయనతోపాటు ఈ పదవికి పోటీపడిన సిప్రస్ కు చెందిన ఆండ్రియాస్ మావ్రోయిన్నిస్ 90 ఓట్లు వచ్చాయి. దీంతో థామ్సన్ విజయం ఖరారైంది. ఈసారి ఫసిపిక్ దేశాలకు చెందిన వ్యక్తులకు ఈ పదవిని దక్కించుకునే అవకాశం రావడంతో ఫిజీ రాయభారి థామ్సన్‌ను ఈ అదృష్టం వరించింది. గతంలో ఒక అభ్యర్థిని ప్రతిపాదించగా దానికి ఏకాభిప్రాయం తెలిపేవారు. అయితే, ఈసారి అలా కుదరకపోవడంతో 193 దేశాల సభ్యత్వం ఉన్న ఈ సంస్థలో ప్రధాన అంగమైన జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. అమెరికాలో చోటుచేసుకుంటున్న అవినీతి అంశాలపైనే థామ్సన్ తన దృష్టిని పెట్టనున్నారట. భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి థామ్సన్ అత్యంత అనూకూలమైన వ్యక్తి. అంతేకాకుండా భద్రతామండలి పునర్నియామకం జరగాలని చెప్పే వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. సెప్టెంబర్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
విన్ స్టన్ తుఫాన్ విధ్వంసం.. 20 కి చేరిన మృతులు
విధ్వంసకర విన్స్టన్ తుఫానుతో ఫిజి పౌరులు నిరాశ్రయులయ్యారు. తుఫాను బీభత్సంతో అతలాకుతలమైన ఆ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం ఫిజి ద్వీపంలో చెలరేగిన శక్తివంతమైన తుఫాను వల్ల సుమారు 20 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిజి తుఫాను సృష్టించిన బీభత్సం ప్రాణ నష్టంతో పాటు... తీవ్ర ఆస్తి, పంట నష్టాన్ని తెచ్చిపెట్టింది. పునరావాస కేంద్రాల్లోని తుఫాన్ బాధితులకు తిరిగి ఆశ్రయం కల్పించే పనులు ప్రారంభించినట్లు ఫసిఫిక్ పశ్చిమ డివిజన్ అధిపతి తెలిపారు. మరో ఐదు రోజుల్లో బాధితులు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక కమిషనర్ మానస చెప్పారు. ఫిజి ద్వీపాల్లోని తుఫాను బాధిత ప్రాంతాల్లో.. ముఖ్యంగా ప్రధాన ద్వీపమైన విటి లెవుతో సహా పవర్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో అధికారులు పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు. తుఫాను కారణంగా ఫిజి ప్రాంతంలో విధించిన కర్ఫ్యూ ను సోమవారం ఎత్తివేసినప్పటికీ... తక్షణ పునరుద్ధరణ పనులకోసం 30 రోజులపాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రాథమిక సాయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫిజికి 5 మిలియన్ డాలర్ల సాయాన్నిఅందించింది. గృహాలను కోల్పోయిన తుఫాన్ బాధితులకు ఆహారం, తాగునీరు, పరిశుభ్రత వంటి తక్షణ సాయం అందించేందుకు ఆ నిధులను వినియోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జూలీ బిషప్ చెప్పారు. ఫిజినుంచీ వర్జిన్ ఆస్ట్రేలియా, ఎయిర్ న్యూజిల్యాండ్, ఫిజి ఎయిర్వేస్ విమానాలను ఇప్పటికే పునరుద్ధరించాయని, అయితే జెట్ స్టార్ మాత్రం మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. తుఫాను వల్ల ఫిజి సందర్శకులకు ఎటువంటి ముప్పు లేదని, వారంతా సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నారని ఫిజి టూరిజం మంత్రి ఫయాజ్ సిద్ధిక్.. ప్రభుత్వ ఫేస్ బుక్ పేజీలో ప్రకటించారు. 'విటి లెవు' ప్రాంతంలో అత్యధికంగా ఉన్న హోటళ్లకు ఎటువంటి నష్టం జరగలేదని, మొబైల్, ఇంటర్నెట్ వ్యవస్థ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫిజీని వణికిస్తున్న తుఫాను
సువా: పసిఫిక్ దక్షిణ ప్రాంత దీవుల సముదాయం ఫిజీ దేశాన్ని అత్యంత బలమైన తుఫాను 'విన్స్టన్' వణికిస్తోంది. గతవారం టోంగా దీవులను తాకిన ఈ తుఫాను తిరిగి తీవ్రరూపం దాల్చి ఫిజీ రాజధాని సువా దిశగా దూసుకొస్తోంది. తుఫాను దాటికి శనివారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. విన్స్టన్ ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు ఫిజీ వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని విమానసర్వీసులను రద్దు చేశారు. ఫిజీ ప్రధాని బైనీమరామ ప్రజలను సురక్షితంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావానికి గురికానున్న పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా 758 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజధాని సువా ప్రాంతంలో తుఫాను అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. పసిఫిక్ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అత్యంత బలమైన తుఫానుగా యూఎన్ వాతావరణ విభాగం 'విన్స్టన్'ను పేర్కొంది. -
భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ:విదేశీ పర్యటన ముగించుకుని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం స్వదేశానికి చేరుకున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజి దేశాల్లో తొమ్మిది రోజుల పాటు పర్యటించిన మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజైన బుధవారం నాడు మోదీ ఫిజీలో పర్యటించారు. దాదాపు 33 సంవత్సరాల కిందట 1981లో ఇందిరాగాంధీ పర్యటన అనంతరం ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామతో మోదీ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించాయి. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. -
ఫిజీ సాంకేతిక వృద్ధికి భారత్ సహకారం: మోదీ
-
ఫిజీ చేరుకున్న మోదీ
సువా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఫిజీ చేరుకున్నారు. మోదీ మంగళవారం ఫిజీ రాజధాని సువాకు వచ్చారు. 33 ఏళ్లలో ఫిజీని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మయన్మార్, ఆస్ట్రేలియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఫిజీ పర్యటన అనంతరం మోదీ స్వదేశం తిరిగిరానున్నారు. -
ఫిజీ బయల్దేరిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ఫిజీ బయల్దేరారు. 5 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన.. అక్కడ జి-20 సదస్సులో పాల్గొని, ప్రధాని టోనీ అబాట్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియా నుంచి ఫిజీ రాజధాని నగరం సువాకు ఆయన బయల్దేరారు. అక్కడ ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమారమాతో చర్చిస్తారు. 1981లో ఇందిరాగాంధీ తర్వాత ఫిజీలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీయే. ఫిజీలో ఉన్న మొత్తం 8.49 లక్షల జనాభాలో 37 శాతం భారత సంతతి వాళ్లే ఉన్నారు. 19వ శతాబ్దం తర్వాత చాలామంది భారతీయులు ఫిజీకి వచ్చారు. -
పోరాటమే ఆమె పంథా!
పసిపిక్ మహాసముద్రం తూర్పు భాగంలో ఉండే చిన్న దీవి ఫిజి. ఈ దేశాన్ని ఇంకో రకంగా పరిచయం చేయాలంటే.. మహిళలపై హింస విషయంలో ప్రపంచంలోనే తొలి స్థానం ఈ దేశానిదే. ఇక్కడ సగటున 64 శాతం మహిళలు శారీరక, లైంగిక హింసకు గురవుతున్నారు. గృహహింసకు కూడా లోటు లేదు. ఇటువంటి చోట మహిళలకు అనుకూలంగా గళం విప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉండటం వల్లే రోషికాదేవ్కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.‘కరేజియస్ ఉమన్’ అవార్డును దక్కేలా చేసింది. రోషికాదేవ్... ఫిజీ దేశానికి చెందిన మహిళ. ఈ యేడాదికి గానూ యూఎస్ వాళ్లు ఎంపిక చేసిన అత్యంత శక్తిసామర్థ్యాలున్న మహిళల్లో ఒకరిగా నిలిచిందామె. పేరును బట్టి ఈమె భారతీయ మూలాలున్న మహిళ అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫిజిలో రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా పేరున్న ఇందర్ దేవ్ తనయ రోషికా. తండ్రి వ్యాపారాలు చూసుకొంటూ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినా... రోషికా మాత్రం సామాజిక ఉద్యమాలపై దృష్టి నిలిపింది. సామాజిక మాధ్యమాల ద్వారా యువ, మహిళా శక్తిని సమీకరించుకొంటూ రిషిక తన పోరాటపంథాను కొనసాగిస్తోంది. విశేషం ఏమిటంటే... ఇటీవల జరిగిన ఫిజి ఎన్నికల్లో రోషిక పోటీ చేసింది! కేవలం 0.2 శాతం ఓట్లతేడాతో ఓడిపోయింది. మరింత విశేషం ఏమిటంటే ఆమె రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పోటీ చేసి ప్రధాన పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. స్వల్పతేడాతో ఓటమి పాలయ్యింది.అయితే అందుకు తానేమీ నిరుత్సాహపడలేదని.. మార్పు అనేది ఒక రోజులో రాదని, క్రమంగా సంభవిస్తుందన్నది రోషిక విశ్వాసం. ఏనాటికి అయినా ఫిజి దేశానికి దిశానిర్దేశం చేసే నేత కావాలనేది రోషిక లక్ష్యం. ఈ విషయాన్ని ఆమె గర్వంగా ప్రకటించుకొంటారు కూడా!