ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ఫిజీ బయల్దేరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ఫిజీ బయల్దేరారు. 5 రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన.. అక్కడ జి-20 సదస్సులో పాల్గొని, ప్రధాని టోనీ అబాట్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియా నుంచి ఫిజీ రాజధాని నగరం సువాకు ఆయన బయల్దేరారు. అక్కడ ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమారమాతో చర్చిస్తారు.
1981లో ఇందిరాగాంధీ తర్వాత ఫిజీలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీయే. ఫిజీలో ఉన్న మొత్తం 8.49 లక్షల జనాభాలో 37 శాతం భారత సంతతి వాళ్లే ఉన్నారు. 19వ శతాబ్దం తర్వాత చాలామంది భారతీయులు ఫిజీకి వచ్చారు.