భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ | Prime Minister Narendra Modi returns home after a nine day | Sakshi
Sakshi News home page

భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Published Thu, Nov 20 2014 8:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ - Sakshi

భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ఢిల్లీ:విదేశీ పర్యటన ముగించుకుని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ  గురువారం స్వదేశానికి చేరుకున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజి దేశాల్లో తొమ్మిది రోజుల పాటు పర్యటించిన మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజైన బుధవారం నాడు మోదీ ఫిజీలో పర్యటించారు. దాదాపు 33 సంవత్సరాల కిందట 1981లో ఇందిరాగాంధీ పర్యటన అనంతరం ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే.   ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామతో మోదీ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించాయి. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement