Pacific
-
Chile Quake: కుదిపేసిన భారీ భూకంపం
శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీ తీర ప్రాంతం.. భారీ భూకంపంతో Earthquake in Chile చిగురుటాకులా వణికిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో శక్తివంతమైన ప్రకంపనలు చిలీని కుదిపేశాయి. అయితే శక్తివంతమైన ప్రకంపనల తర్వాత.. ఎలాంటి నష్టం వాటిల్లిందనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం రాత్రి ఉత్తర చిలీలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని.. భూకంపం కేంద్రం కోక్వింబోలో నలబై కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ మాత్రం.. 6.5 తీవ్రతతో మధ్య చిలీ రీజియన్‌లో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణామెరికా దేశమైన చిలీ.. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2010లో 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 526 మంది మృతి చెందారు. ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. Strong 6.2-magnitude earthquake hits central Chile, close to La Serena pic.twitter.com/1RrnyAe3Uq — BNO News (@BNONews) September 7, 2023 #Chile 🇨🇱 Reacciones al sismo Magnitud 6.3. pic.twitter.com/hZq7ruWuo4 — InfoSismologic (@EarthquakeChil1) September 7, 2023 Tremors felt and can be seen… Coquimbo in San Juan #Sismo #Temblor #temblor #terremoto #Chile #LaSerena pic.twitter.com/LJEd2dY0a9 — Shadab Javed (@JShadab1) September 7, 2023 #Chile #Chilenos Momento del Sismo M6.6 Percibido en La Serena, #Chile. (Septiembre 06, 2023). #Temblor #Earthquake #Climagram #Coquimbo pic.twitter.com/xZRi7sR437 — 𝔸𝕝𝕖𝕛𝕒𝕟𝕕𝕣𝕠 𝔽𝕣𝕚𝕒𝕤 ♚ ✖️ (@FriasAlejandro_) September 7, 2023 -
తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..మరో క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా దూకుడుగా వరుస క్షిపణి ప్రయోగాలకు తెగబడుతోంది. ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన రెండు రోజుల్లోనే మరో రెండు బాలిస్టిక్ కిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ధృవీకరిచింది కూడా. ఎలాంటి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఉత్తర కొరియా గత శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని జపాన్ పశ్చిమ తీరంలో ప్రయోగించింది. దీంతో ఆదివారం అమెరికా ఆదివారం దక్షిణ కొరియా, జపాన్‌తోనూ విడిగా ఉమ్మడి వైమానికి విన్యాసాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను బహుళ రాకెట్ లాంచర్‌తో సుమారు 395 కి.మీ, 337 కి.మీ దూరంలోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వ్యూహాత్మక అణ్వాయుధం శత్రు ఎయిర్ ఫీల్డ్‌ను నిర్వీర్వం చేయగలదని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అలాగే కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ పసిఫిక్‌ను ఫైరింగ్ రేంజింగ్ మారుస్తామని హెచ్చరించింది. అంతేగాదు అధిక ఫ్రీక్వెన్సీతో మరిన్ని సైనిక చర్యలకు తెగబడటం అనేది యూఎస్ దళాల చర్యలపై ఆదారపడి ఉంటుందని ఆమె గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అవి గరిష్టంగా 50 కి.మీ నుంచి 100 కి.మీ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షల విషయమై అత్యవసర యూఎన్ భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు. ఐతే ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్ వ్యవహారం నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తదితర కారణాల రీత్యా యూఎన్ ఆంక్షాలు విధించే అవకాశం తక్కువగా ఉంది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియా మాత్రం ఈ ప్రయోగాలను తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. వెంటనే ఇలాంటి వాటిని నిలిపివేయాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది. అలాగే ప్రతిఘటనలపై చర్చించడానికి జాతీయ భద్రత మండలి సమామేశాన్ని నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ కార్యాలయం తెలిపింది. అంతేగాదు ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలకు సంబంధించి నలుగురు వ్యక్తులను, ఐదు సంస్థలపై ఆంక్షలను ప్రకటించింది. పైగా దీన్ని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా పేర్కొంది దక్షణ కొరియా. కచ్చితంగా దీనికి తగిన పర్యవసానాన్ని ఎదుర్కొనక తప్పదంటూ హెచ్చరించింది. దీని గురించి అమెరికా, జపాన్‌తోనూ చర్చిస్తానని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, యూఎన్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం నిషేధించిన కవ్వింపు చర్యలను నిలిపేయాలని, అణ్వాయుధీకరణపై చర్చలు పునఃప ప్రారంభించాలని ఉత్తర కొరియాను కోరారు. -
ఎంతటి సాహాసయాత్ర! 83 ఏళ్ల వయసులో ఒంటరిగా మహా సముద్రాన్ని...
Japanese Man solo, non-stop trip across the Pacific: భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. ఒంటరిగా సమద్రయానం చేసిన తొలి వృద్ధుడిగా నిలిచాడు. ఇంతకి అతను ఎవరు? ఎలా అంత పెద్ద సాహసయాత్రను చేయగలిగాడో అనే కదా! వివరాల్లోకెళ్తే... జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీ పసిఫిక్ మహాసమ్రుదం మీదుగా ఒంటరిగా సముద్రయానం చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. సముద్ర సాహసికుడు. చిన్నతనం నుంచి ఇలాంటి సముద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలు చేయడమంటే అతని అత్యంత ఆసక్తి. అతను 1962లో 23 ఏళ్ల వయసులోనే జపాన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణించి, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన ప్రపంచలోనే తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. అయితే ఆసమయంలో పాస్‌పోర్ట్ లేకుండా అమెరికాలో ప్రయాణిస్తున్నప్పుడూ చాలా ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఇలా సమద్రయానానికి సంబంధించిన సాహాసయాత్రలను వరుసగా 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. తదనంతరం మళ్లీ ఇప్పుడూ హోరీ మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి తన తొలి సాహాసయాత్రను ప్రారంభించాడు. ఈ సాహసయాత్రను విజయవంతంగా ముగించుకుని శనివారం తెల్లవారుజామున జపాన్‌లోని కియ్ జలసంధికి చేరుకోవడంతో ముగిసింది. ఈ అరుదైన సాహాసయాత్రతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. (చదవండి: భారత యువసైంటిస్ట్ మేధస్సుకు ఐన్‌స్టీన్ ఫిదా! ప్చ్.. నోబెల్ మాత్రం దక్కలేదు!) -
చైనా నుంచి భారత్‌కు పెను సవాళ్లు
వాషింగ్టన్: భారత్‌కు ప్రధానంగా డ్రాగన్ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్‌కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ శ్వేతసౌధం తన తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని నివేదికలో తెలియజేసింది. రెండు దేశాలు కలిసి పని చేస్తాయని అభిప్రాయపడింది. దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని శ్వేతసౌధం తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో భారత్ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తామని ప్రకటించింది. భారత్ నాయకత్వ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించింది. భారత్ తమ భాగస్వామ్య దేశమని ఉద్ఘాటించింది. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న అని స్పష్టం చేసింది. ఇండియాతో కలిసి పనిచేస్తాం.. ఆస్ట్రేలియా, తదితర దేశాల తరహాలో కాకుండా భారత్ భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందని, పొరుగు దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఏసీ వద్ద చైనా ప్రవర్తన భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న మాట వాస్తమేనని అన్నారు. గత ప్రభుత్వ(డొనాల్డ్ ట్రంప్ సర్కారు) హయాంలో భారత్–అమెరికా మధ్య సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తృతమయ్యాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని బైడెన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. తమలాగే మరో ప్రజాస్వామ్య దేశమైన ఇండియాతో కలిసి పనిచేసే విషయంలో ఎన్నో అవకాశాలు కళ్లెదుట కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇండియాతోపాటు ఇండోనేషియా, మలేసియా, మంగోలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, వియత్నాం, పసిఫిక్ దీవులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ‘క్వాడ్’ మినిస్టీరియల్ సదస్సు జరిగిన రోజే ‘ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యం’పై బైడెన్ ప్రభుత్వం తొలి నివేదికను విడుదల చేయడం విశేషం. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
మెల్బోర్న్: శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతితో కూడిన స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ప్రగతికి కీలకమని విదేశాంగ మంత్రి జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత భద్రతలో క్వాడ్ మరింత చురుకైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్‌ను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయించింది. అఫ్గాన్ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. తర్వాత మంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం తదితరాలపై రాజీ ఉండబోదన్నారు. ‘‘ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర రక్షణ తదితర అంశాల్లో కలిసి పని చేసేందుకు ఎంతో అవకాశముంది. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఇండో పసిఫిక్ దేశాలు చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలవాలన్న క్వాడ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి పేర్కొన్నారు. రష్యా దూకుడుకు భారీ మూల్యమే ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక మోహరింపుల విషయమై రష్యాతో చర్చించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. దూకుడు ప్రదర్శిస్తే ఆర్థిక, ఎగుమతిపరమైన ఆంక్షల రూపంలో భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తమ మద్దతుంటుందని పైన్, హయాషీ చెప్పారు. బర్మా సంక్షోభంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.అక్కడ ప్రజాస్వామ్యాన్ని తక్షణం పట్టాలెక్కించాలని సైనిక ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ అయ్యారు. విఫల ప్రయోగం: చైనా క్వాడ్‌పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
చైనాకు క్వాడ్ పరోక్ష హెచ్చరికలు
వాషింగ్టన్: ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేస్తామని క్వాడ్ సదస్సు ప్రతిజ్ఞ చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ నిబంధనలు అమలు కావాలని పిలుపునిచ్చింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి క్వాడ్ సదస్సు శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగింది. తొలిసారిగా నాలుగు దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ సందస్సులో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో తమ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదో అవకాశమని నేతలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగా సదస్సు అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో క్వాడ్ సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సంయుక్త ప్రకటనలో నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఏ దేశమైనా ప్రవర్తించాలని పేర్కొన్నారు. ‘ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా వాణిజ్యం జరగాలి. వివాదాలు శాంతియుతంగా పరిష్కారం కావాలి. దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రాదేశిక సమగ్రత కాపాడేలా కలసికట్టుగా కృషి చేస్తాం’’అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. అక్టోబర్ నుంచి భారత్ వ్యాక్సిన్ ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని క్వాడ్ సదస్సు స్వాగతించింది. పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందేలా కృషి చేయనున్నాయి. 2022 నాటికల్లా వంద కోట్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందజేయనున్నాయి. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పరం సహకరించుకోనున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఒక నిర్ణయానికొచ్చాయి. -
ఓయూలో ఇండో–పసిఫిక్ స్టడీస్ ఇన్స్టిట్యూట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో –పసిఫిక్ స్టడీస్ కేంద్రం ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమా ర్ నేతృత్వంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఉస్మానియా వర్సిటీ ప్రతినిధులు ఈ అంశంపై శనివారం ఢిల్లీలో విదేశాంగ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం అధికారులతో చర్చించారు. ప్రతినిధి బృందంలో ఉన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్‌లు ఇండో పసిఫిక్ స్టడీస్‌కు ఉస్మానియా అనుకూలంగా ఉంటుందని విదేశాంగ శాఖకు వివరించారు. కాగా, ఈ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందిస్తామని విదేశాంగ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఓయూ పరిధిలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ (ఓయూసీఐపీ)లో ఇండో పసిఫిక్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ అధికారులు ఓయూను సందర్శించాక ఇన్స్టిట్యూట్ నిర్వహణకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. సామాజిక న్యాయ శాఖ నుంచి నిధులు వర్సిటీలోని సివిల్ సర్వీసెస్ అకాడమీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వసతి గృహాలకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ నుంచి నిధుల కేటాయింపునకు ఆ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్.సుబ్రమణ్యం హామీ ఇచ్చారని ఓయూ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఇక ఇండో పసిఫిక్ కమాండ్..!
అసియా, పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అమెరికా సైనిక స్థావరం పేరును ‘అమెరికా పసిఫిక్ కమాండ్’ నుంచి ‘అమెరికా భారత–పసిఫిక్ కమాండ్’గా మార్పు చేశారు. ఈ మేరకు అమెరికా సైన్యం బుధవారం పసిఫిక్ కమాండ్ పేరును మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ద్వారా వ్యూహాత్మక ప్రణాళికల్లో భారత్‌ను కీలక భాగస్వామి చేసేందుకు అమెరికా సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోందని అంచనా వేస్తున్నారు. సైనికపరంగా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న భారత్ పాత్రకు గుర్తింపుగా ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ మార్పు వల్ల వెంటనే అదనపు బలగాలు లేదా యుద్ధనౌకలను ఈ ప్రాంతానికి తరలించే అవకాశం లేదు. తమ అధికారిక పత్రాల్లో ఆసియా–పసిఫిక్ అనే పదానికి బదులు ఇండో–పసిఫిక్ అనే పదాన్ని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. పసిఫిక్ కమాండ్ అంటే ? అమెరికాకు చెందిన అతి పాత, పెద్ద సైనిక స్థావరం. ఫసిఫిక్ మహా సముద్రంలోని హవాయి రాష్ట్రంలోని నావికా కేంద్రం పెరల్ హార్బర్లో ప్రధానకేంద్రముంది. ఈ కమాండ్ పరిధి 10 కోట్ల చదరపు మైళ్ల కంటే ఎక్కువ భూభాగం, 52 శాతం భూ ఉపరితలం వ్యాపించి ఉంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ తీరం వరకు,ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు విస్తరించింది. ఈ ప్రాంతంలో 3,75,000 మంది సైనికులు, ఇతర సిబ్బంది భారత్‌తో సహా వివిధ దేశాలపై పర్యవేక్షణ సాగిస్తుంటారు. పసిఫిక్–హిందూ మహాసముద్రాల మధ్యనున్న 36 దేశాలు దీని పరిధిలోకి వస్తాయి. యూఎస్ఆర్మీ పసిఫిక్, యూఎస్ పసిఫిక్ ఫ్లీట్, యూఎస్ పసిఫిక్ ఎయిర్పోర్సెస్, యూఎస్ మెరైన్ ఫోర్సెస్ పసిఫిక్, యూఎస్ ఫోర్సెస్ జపాన్, యూఎస్ ఫోర్సెస్ కొరియా, స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ ఏరియా, స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ పసిఫిక్ ఈ ›ప్రాంతం నుంచే పనిచేస్తాయి. యూఎస్ పసిఫిక్ కమాండ్ జాయింట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సెంటర్, ద సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అవినీతిలో భారత్ టాప్
ఆసియా–పసిఫిక్ దేశాల్లో నంబర్‌వన్ ... ♦ ట్రాన్స పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ సర్వేలో వెల్లడి ♦ లంచం ఇవ్వాల్సి వస్తోందని చెప్పిన 69 శాతం భారతీయులు ♦ భారత్‌లో అగ్రస్థానంలో పోలీసుల అవినీతి బెర్లిన్/న్యూఢిల్లీ: భారత్‌లో అవినీతి రాజ్యమేలుతుందని తాజా సర్వే ఒకటి తేల్చిచెప్పింది. అవినీతి విషయంలో ఆసియా పసిఫిక్ దేశాల్లో మన దేశం మొదటిస్థానంలో ఉందని ట్రాన్స పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. గతేడాదితో పోలిస్తే భారత్‌లో 41 శాతం అవినీతి పెరిగిందని వెల్లడించింది. ఇక ప్రభుత్వ సేవలు పొందేందుకు లంచం చెల్లించాల్సి వస్తోందని సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారు. భారత్‌లో పోలీసులు, ప్రభుత్వాధికారులతో పాటు మతపెద్దల్లోనూ అవినీతి ఎక్కువేనని అధిక శాతం మంది తేల్చిచెప్పారు. పోలీసులు లంచం తీసుకుంటున్నారని సర్వేలో పాల్గొన్న 85 శాతం భారతీయులు అభిప్రాయపడగా... తర్వాతి స్థానాల్లో ప్రభుత్వాధికారులు(84 శాతం), బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ (79 శాతం), స్థానిక కౌన్సిలర్లు (78), ఎంపీలు (76), పన్ను అధికారులు (74), మత పెద్దలు (71 శాతం) నిలిచారు. సర్వే మేరకు భారత్‌లోని దాదాపు 69 శాతం మంది లంచం ఇవ్వాల్సి వస్తోందని చెప్పగా... 65శాతంతో వియత్నాం తర్వాతి స్థానంలో నిలిచింది. చైనాలో 26శాతం, పాక్ లో 40శాతం మంది లంచం చెల్లిస్తున్నామన్నారు. జపాన్ 0.2 శాతంతో అవినీతిలో చిట్టచివరన నిలవగా, దక్షిణ కొరియా 3 శాతంతో మెరుగైన స్థానంలో ఉంది. ఆసియాపసిఫిక్ లో 16 దేశాల్లో 22 వేల మందిని ప్రశ్నించామని... ఆ లెక్కన గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం చెల్లించినవారు దాదాపు 90 కోట్ల మంది ఉండొచ్చని పేర్కొంది. పోలీసు లు, జడ్జీలు లేదా కోర్టు సిబ్బంది, టీచర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ సిబ్బందికి లంచం లేదా బహుమతి లేదా ఉపకారం చేస్తున్నారో అన్న అంశాలపై సర్వే చేశారు. నిజాయితీ మతనాయకులు 14 శాతమే ఈ సర్వేలో భారత్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. భారత్‌లో మతనాయకులు అవినీతికి అతీతులు కారని తేల్చింది. మత నాయకుల్లో కొందరు లేదా ఎక్కువమంది లేదా అందరూ అవినీతిపరులంటూ 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. మత నాయకుల్లో కొందరే అవినీతిపరులని 37 శాతం, ఎక్కువ మంది అని 23 శాతం, అందరూ అవినీతిపరులేనని 11 శాతం అభిప్రాయపడ్డారు. మతనాయకులు ఎలాంటి అవినీతికి పాల్పడడం లేదని 14 శాతం మంది చెప్పగా... 15 శాతం మంది ఏ సమాధానం ఇవ్వలేదు. ఆసియా పసిఫిక్ మొత్తంగా చూస్తే మతనాయకులు అత్యధిక అవినీతి పరులంటూ ప్రతి ఐదుగురిలో ఒకరి కంటే తక్కువ మంది అభిప్రాయపడడం గమనార్హం. పెరుగుదలలో చైనా ఫస్ట్ అవినీతి పెరుగుదలలో చైనా 73 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే భారత్‌లో 41 శాతం అవినీతి పెరిగి ఏడో స్థానంలో ఉంది. పోలీసు విభాగం లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆసియా పసిఫిక్ ప్రజలు ఆరోపించారు. తాము లంచం చెల్లించాల్సి వస్తోందని 38 శాతం పేదలు పేర్కొనగా... ఇతర ఆదాయ వర్గాలతో పోల్చితే వీరిదే అధిక శాతం కావడం గమనార్హం. పోలీసులు టాప్ భారత్‌లో లంచం తీసుకుంటున్న వారి జాబితాలో మాత్రం పోలీసులదే తొలిస్థానం. పోలీసులు లంచం డిమాండ్చేస్తారని 85 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటారని 84 శాతం మంది చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ 79 శాతం, స్థానిక కౌన్సిలర్లు 78 శాతం, ఎంపీలు 76 శాతంలో నిలిచారు. ఇక పన్ను అధికారులు 74 శాతంతో ఆరో స్థానంలో ఉండగా మతనాయకులు 71 శాతంతో ఏడో స్థానంలో నిలిచారు. జడ్జీలు, మేజిస్ట్రేట్లు అవినీతిపరులని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. లంచం తీసుకోని వారు తక్కువే.. ప్రభుత్వాధికారులు అవినీతికి పాల్పడరని 6 శాతం మంది చెప్పారు. పోలీసులు లంచం తీసుకోరని 7 శాతం, స్థానిక కౌన్సిలర్లు అవినీతికి పాల్పడరని 9 శాతం భారతీయులు చెప్పారు. ఇక ఉన్నతస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అవినీతిచేయరని 26 శాతం, జడ్జీలు, మేజిస్ట్రేట్లు అవినీతిరహితులని 19 శాతం భారతీయులు వెల్లడించారు. ఎంపీల విషయానికి కొస్తే అది 12 శాతమే. కఠిన చర్యలు చేపట్టాలి ప్రభుత్వాలు అవినీతిపై మాటలు ఆపి, చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ సేవలు పొందేందుకు బలవంతంగా ప్రజలు లంచం ఇచ్చేలా చేస్తున్నారని, పేదల్ని ఇబ్బంది పెడుతున్నారని సంస్థ చైర్మన్ జోస్ ఉగాజ్ అభిప్రాయపడ్డారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి సమాచారం వెల్లడించేవారికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. చట్టపరంగా సరైన నిరోధక వ్యవస్థ లేకపోతే అవినీతి అవిచ్ఛిన్నంగా సాగుతుందని, అది చిన్న నేరం కాదని, మన బతుకుదెరువుకు నష్టం కల్గించడంతో పాటు, విద్యను అడ్డుకోవడం, వైద్య సేవల్ని ఆటంకపర్చడంతో పాటు చివరకు మనల్ని చంపేస్తుందని ఆయన పేర్కొన్నారు. -
ఫిజీని వణికిస్తున్న తుఫాను
సువా: పసిఫిక్ దక్షిణ ప్రాంత దీవుల సముదాయం ఫిజీ దేశాన్ని అత్యంత బలమైన తుఫాను 'విన్స్టన్' వణికిస్తోంది. గతవారం టోంగా దీవులను తాకిన ఈ తుఫాను తిరిగి తీవ్రరూపం దాల్చి ఫిజీ రాజధాని సువా దిశగా దూసుకొస్తోంది. తుఫాను దాటికి శనివారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. విన్స్టన్ ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు ఫిజీ వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని విమానసర్వీసులను రద్దు చేశారు. ఫిజీ ప్రధాని బైనీమరామ ప్రజలను సురక్షితంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావానికి గురికానున్న పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశ వ్యాప్తంగా 758 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజధాని సువా ప్రాంతంలో తుఫాను అత్యధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. పసిఫిక్ దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అత్యంత బలమైన తుఫానుగా యూఎన్ వాతావరణ విభాగం 'విన్స్టన్'ను పేర్కొంది. -
ముంబై 12వ స్థానం, 20వ స్థానంలో ఢిల్లి
-
భారత్ పరిస్థితి భేష్: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తోందని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) పేర్కొంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో దేశంలో సంస్కరణల ప్రక్రియ జోరందుకుందని పేర్కొంది. డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, బీమా రంగంలో సంస్కరణలకు ప్రయత్నం, ప్రభుత్వ వ్యయాలు తగ్గింపునకు కృషి ద్వారా ద్రవ్యలోటు కట్టడి చర్యలు వంటి అంశాలను ఈ సందర్భంగా ఎస్అండ్పీ ప్రస్తావించింది. 7% జీడీపీ వృద్ధి దిశగా విశ్వాసం గణనీయంగా మెరుగుపడినట్లు విశ్లేషించింది. ఇదే ప్రాంతంలోని కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు 2014 చివరినాటికి ఊహించినదానికన్నా పేలవ పనితీరును నమోదు చేసుకుంటున్నాయని పేర్కొంది. చైనా వృద్ధి మందగించిందని, జపాన్ మాంద్యంలోకి జారిపోయిందని పేర్కొంది. అమెరికా పటిష్ట రికవరీ ఎగుమతుల రంగానికి సానుకూల అంశమని పేర్కొంది. -
భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ:విదేశీ పర్యటన ముగించుకుని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం స్వదేశానికి చేరుకున్నారు. మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజి దేశాల్లో తొమ్మిది రోజుల పాటు పర్యటించిన మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజైన బుధవారం నాడు మోదీ ఫిజీలో పర్యటించారు. దాదాపు 33 సంవత్సరాల కిందట 1981లో ఇందిరాగాంధీ పర్యటన అనంతరం ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామతో మోదీ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించాయి. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. -
ఫిజీకి 500 కోట్ల రుణం, సాయం
ప్రధాని మోదీ ప్రకటన పసిఫిక్ దీవి దేశంలో భారత ప్రధానమంత్రి పర్యటన సువా: పసిఫిక్ దీవుల్లోని ఫిజీ దేశానికి దాదాపు 500 కోట్ల రూపాయల రుణం, అభివృద్ధి సాయం అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతంలోని 14 దేశాల ప్రజలు భారత్ పర్యటన కోసం.. ముందుగా వీసా తీసుకోవటం కాకుండా.. భారత్‌కు వచ్చి వీసా తీసుకునే విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. పది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజైన బుధవారం నాడు మోదీ ఫిజీలో పర్యటించారు. దాదాపు 33 సంవత్సరాల కిందట 1981లో ఇందిరాగాంధీ పర్యటన అనంతరం ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. బుధవారం ఉదయాన్నే ఫిజీ రాజధాని సువా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ప్రభుత్వ లాంఛనాలతో రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఫిజీ ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామతో మోదీ ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలూ ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించాయి. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తన పర్యటనలో 12 పసిఫిక్ ద్వీప దేశాలనేతలసమావేశంలోమోదీ ప్రసంగించారు. బలమైన భాగస్వామ్యానికి పునాది... ఫిజీ ప్రధానితో చర్చల అనంతరం బయినీమరామతో కలిసి మోడీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ఫిజీతో మా సంబంధాల్లో ఇది నూతన ఆరంభం. పాత సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు, భవిష్యత్తులో బలమైన భాగస్వామ్యానికి పునాది వేసేందుకు నా పర్యటన అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. భారత మార్స్ మిషన్ విజయవంతం కావటంలో ఫిజీ పోషించిన పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అంతరిక్ష రంగంలో ఫిజీని ప్రాంతీయ కేంద్రంగా మార్చేందుకు ఆ దేశంతో కలిసి కృషి చేస్తామన్నారు. (అంగారకుడిపై భారత్ ప్రయోగించిన ఉపగ్రహం మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఫిజీ, పలు ఇతర పసిఫిక్ దేశాల నుంచి నియంత్రించారు). భారత్ ‘విశ్వగురు’ పాత్ర పోషిస్తుంది... రాబోయే యుగం విజ్ఞానయుగం అవుతుందని.. అందులో భారత్ మరోసారి ‘విశ్వగురు’ (ప్రపంచానికి బోధకుడు) పాత్ర పోషిస్తుందని, తన ప్రజాస్వామ్య బలం, యువశక్తులను వినియోగించుకుని మానవాళికి ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఫిజీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆ దేశ పౌర సమాజ ప్రతినిధులతో ముచ్చటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిజీలో రోజంతా పర్యటించిన మోదీ బుధవారం సాయంత్రం ప్రత్యేక భారత వైమానిక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షం ఫిజీ పార్లమెంటులో ప్రతిపక్షమైన సెడెప్లా భారత ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాలను బహిష్కరించింది. పార్లమెంటులో ధన్యవాదం తెలిపేందుకు ప్రతిపక్షానికి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవటంతో అందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపక్ష నేత రో రో తీముము కెపా పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షం చర్య మన్నించరాని చర్య అని.. ఇందుకు ఫిజీ ప్రజల తరఫును తాను మోదీకి క్షమాపణ చెప్తున్నానని ప్రధానమంత్రి ఫ్రాంక్ బయినీమరామ పార్లమెంటులో పేర్కొన్నారు. ఫిజీలో మూడో వంతు మంది భారత సంతతి వారే... పసిఫిక్ సముద్రంలోని దీవుల్లో.. 332కు పైగా దీవుల సమాహారం ఫిజీ. మొత్తం జనాభా 8,49,000 మంది. వీరిలో 87 శాతం మంది కేవలం రెండు ప్రధాన దీవుల్లోనే నివసిస్తుంటారు. జనాభాలో మూడో వంతు మంది భారత సంతతి వారే. 19వ శతాబ్దంలో అప్పటి బ్రిటిష్ వలస పాలనలో భాగంగా.. ఫిజీలోని చెరకు సాగులో బానిస కార్మికులుగా వీరిని తరలించారు. పర్యాటకం, పంచదార పరిశ్రమ ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు. మొన్నటి వరకూ సైనిక పాలనలో ఉన్న ఫిజీ ఇటీవలే గణతంత్ర దేశంగా మారింది. అప్పటి సైనిక పాలకుడైన ఫ్రాంక్ బయినీమరామ.. తొలి ఎన్నికల్లో గెలిచి గత సెప్టెంబర్‌లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గణతంత్ర ఫిజీ పార్లమెంటులో ప్రసంగించిన తొలి విదేశీ ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. -
పుకుషిమా ప్లాంట్‌లో లీక్‌లు లేవు
పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లోని ఓ ట్యాంక్ నుంచి రేడియోధార్మికత నీరు లీక్ అవుతుండటంతో టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (టీఈపీసీఓ) అప్రమత్తమైంది. పుకోషిమా ప్లాంట్ ప్రాంగణంలో దాదాపు మూడు వందల రేడియోధార్మికత నీరు ట్యాంక్‌లు ఉన్నాయి. వాటికి ఏమైన లీకులు ఏర్పడ్డాయేమోనని గురువారం పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ఉద్యోగుల చేత తనిఖీలు నిర్వహించినట్లు ఆ ప్లాంట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఆ ప్లాంట్‌కు ఎటువంటి లీకేజీలు లేవని అధికారుల స్పష్టం చేశారు. ఓ వేళ ట్యాంక్‌లకు లీకులు ఏర్పడినట్లు అయితే తీసుకోవలసిన చర్యలను వారు వివరించారు. గత నాలుగు రోజుల క్రితం ప్లాంట్‌లోని ఓ ట్యాంక్ నుంచి రేడియోధార్మికత నీరు లీక్ కావడంతో ప్లాంట్ ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. ఆ ట్యాంక్‌లోని ఆ నీటిని ప్లాంట్ పక్కనే ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోకి డ్రైనేజ్ ద్వారా వదిలివేసిన సంగతి తెసిందే. అ ప్రక్రియ పూర్తి అయిందని అయితే ఆ డ్రైనేజ్ ద్వారా ఆ నీరు ప్రవహించడం వల్ల ఆ పరిసర ప్రాంతాలు, మట్టిలో రేడియోధార్మికత ప్రసరించే ప్రమాదం ఉందని ప్లాంట్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దాంతో ఆ పరిసర ప్రాంతాలను రేడియోధార్మికతను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 2011, మే మాసంలో జపాన్‌లో సంభవించిన సునామీ, భూకంపం వల్ల పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో చోటు చేసుకున్న దుర్ఘటన వల్ల ఎంతో మంది మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.